E-Paper
Advertisement

41 ఏళ్ల‌ రొనాల్డో ఆడుతున్న‌ప్పుడు, రోహిత్ శ‌ర్మ ఆడితే మీకేం నొప్పి?

41 ఏళ్ల‌ రొనాల్డో ఆడుతున్న‌ప్పుడు, రోహిత్ శ‌ర్మ ఆడితే మీకేం నొప్పి?
Advertisement

Mohammad Kaif :  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మకు ఈనెల 19వ తేదీన జరిగే వన్డేనే చివరిది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మ ఆడడం లేదని.. ఇప్పటికే అతనికి బిసిసిఐ స్పష్టం చేసిందట. లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే ఆడేసి… రిటైర్మెంట్ కూడా ఇస్తాడని అంటున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల పై మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

41 సంవత్సరాల క్రిస్టియానో రోనాల్డో (Cristiano Ronaldo) ఇప్పటికి ఫుడ్ బాల్ ఆడుతున్నాడని… అలాంటిది రోహిత్ శర్మ ఆడితే తప్పేంటి అని నిలదీశారు. రోహిత్ శర్మకు 39 సంవత్సరాల వయసు మాత్రమే ఉందని… అతడు కుర్ర క్రికెటర్ లాగా దూకుడుగా ఆడుతున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆడితే ఎవరికి ఏం నొప్పి? అంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ), అజిత్ అగార్కర్ లను (Ajit Agarkar) తీసేయండి అంటూ బీసీసీఐకి సూచనలు చేశారు.

Advertisement

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

41 ఏళ్ల‌ రొనాల్డో ఆడుతున్న‌ప్పుడు, రోహిత్ శ‌ర్మ ఆడితే మీకేం నొప్పి?

రోహిత్ శర్మ రిటైర్మెంట్ చేయబోతున్నట్లు వస్తున్నా వార్తలపై మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ) ఫైర్ అయ్యారు. కావాలనే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ పై ఒత్తిడి తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. రిటర్మెంట్ ఇచ్చేలా కుట్రలకు తెరలేపుతున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లను గంభీర్ గ్యాంగ్ తోక్కేస్తుందని మండిపడ్డారు. వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మకు ఇలా అన్యాయం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు.

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీనియర్ క్రికెటర్ కాబట్టి వన్డేల్లో రోహిత్ శర్మ అవసరం ఎంతైనా ఉంటుందని… అతడే లేకపోతే 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టమన్నారు. క్రిస్టియానో రోనాల్డోకు 41 సంవత్సరాలు ఉన్నాయని… అతడు దేశం తరఫున అద్భుతంగా ఆడుతున్నట్లు గుర్తు చేశారు. మరి 39వేల రోహిత్ శర్మ ఆడితే గంభీర్ (Gautam  Gambhir), అజిత్ అగార్కర్ లకు (Ajit Agarkar) ఏం నొప్పి అంటూ ఫైర్ అయ్యారు మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ). రోహిత్ శ‌ర్మ విష‌యంలో బీసీసీఐ కూడా వెన‌క్కి త‌గ్గాల‌ని కోరారు.

 

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

 

Related News

శ్రేయ‌స్ అయ్య‌ర్ దెబ్బ‌కు ప‌క్షి విల విల‌…జాకబ్‌ బెతెల్ చేసిన ప‌నికి ఫిదా కావాల్సిందే

వెన్నుపోటు పొడిచిన అట్కిన్సన్…రూట్ సెంచ‌రీ మిస్ చేసుకోవ‌డంపై రాజుకున్న వివాదం

2027 వన్డే వరల్డ్ కప్ నుంచి రోహిత్ ఔట్..19న లార్డ్స్ లో రిటైర్మెంట్?

గంభీర్ కు ఒళ్లంతా అహంకారం, అందుకే టీమిండియా ఓడిపోతోంది

బీసీసీఐ వేసే బిస్కెట్ల‌కు ఐసీసీ అమ్ముడుపోయిది..అందుకే టీమిండియాకు వ‌రుస‌గా ట్రోఫీలు

Video: సామ్ కర్రన్ కుప్పిగంతులు..ఇచ్చిప‌డేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్

Video: లైవ్ మ్యాచ్ లో త‌న్నుకున్న‌ స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్

Big Stories

Advertisement
×