E-Paper
Advertisement

Airbus A320 Recall: ఎయిర్‌ బస్ A320 విమానాల రీకాల్.. కారణం ఏంటంటే?

Airbus A320 Recall:  ఎయిర్‌ బస్ A320 విమానాల రీకాల్..  కారణం ఏంటంటే?
Advertisement

Airbus A320 Recall Effect: గత కొంత కాలంగా జరుగుతున్న విమాన ప్రమాదాల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడంతో, ఆయా కంపెనీలు తమ విమానాల్లోని భద్రతా లోపాల మీద ప్రత్యేకంగా దృష్టిసారించాయి. ఏవైనా పొరపాట్లు జరిగాయా? అనే పరిశీలన మొదలు పెట్టాయి. ఇందులో భాగంగానే.. యూరప్‌ లోని ప్రముఖ విమాన నిర్మాణ సంస్థ ఎయిర్‌ బస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నిర్మించిన A320 విమానాల్లో సాంకేతి సమస్యలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు ఆ విమానాలను రీకాల్ చేస్తున్నట్లు చెప్పింది.

ఇంతకీ అసలు సమస్య ఏంటంటే?

తాజాగా ఎయిర్‌బస్ కంపెనీ A320 విమానాల్లో కొన్ని సమస్యలను ఐడెంటీఫై చేసింది. ముఖ్యంగా సోలార్ రేడియేషన్ కారణంగా విమానం కంట్రోల్ సిస్టమ్ డేటా చెడిపోయే అవకాశం ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ బస్ రీకాల్  ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ విమానాలు వాడుతున్న సంస్థలకు రీకాల్ నోటీసు పంపించింది. రీసెంట్ గా ఓ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ A320 విమానం ప్రయాణ సమయంలో సడెన్ గా కిందికి దిగింది. ఈ విషయం విమానం డేటాలో రికార్డు అయ్యింది. దీనికి కారణం ఎలివేటర్ ఎయిలరాన్ కంప్యూటర్ లో తలెత్తిన లోపంగా కంపెనీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే. ఆ సమస్యలను సరి చేసేందుకు ప్రస్తుతం సర్వీసులు అందిస్తున్న A320 సిరీస్ విమానాలన్నింటికీ కొత్త సాఫ్ట్‌ వేర్ ఇన్‌ స్టాల్ చేయాలని నిర్ణయించింది.

భారత్ లో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం

Advertisement

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 6 వేల A320 సిరీస్ విమానాలు నడుస్తుండగా, ఇండియాలో సుమారు 560 విమానాలు సేవలు అందిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా ఇండిగో, ఎయిరిండియా సంస్థల దగ్గర ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఎయిర్ బస్ తీసుకున్న రీకాల్ నిర్ణయంతో ఈ సంస్థలకు చెందిన విమాన సర్వీసుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న విమానాల్లో ఇప్పటికప్పుడు సుమారు 250 విమానాల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. కొన్ని విమానాల్లో హార్డ్ వేర్ కూడా మార్చాలని భావిస్తోంది. ఈ పనుల కోసం విమానాలను గ్రౌండ్ చేసేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారు.

కీలక ప్రకటన చేసిన ఇండిగో, ఎయిర్ ఇండియా

ఎయిర్ బస్ A320 సిరీస్ రీకాల్ హెచ్చరిక వచ్చిన నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు స్పందించాయి.  ఎయిర్‌ బస్ టెక్నికల్ అడ్వైజరీ ఇప్పటికే తమకు తెలిసిందన్నారు. తాము వాడుతున్న విమానాల్లో అవసరమైన అప్ డేట్స్ చేపడుతున్నట్లు తెలిపాయి. ఈ సాప్ట్ వేర్ అప్ డేట్ కారణంగా కొన్ని విమానాల షెడ్యూల్స్‌ లో చిన్న చిన్న మార్పులు రావచ్చని తెలిపాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్‌కు చెందిన 31 విమానాల్లో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు యాజమాన్యం ప్రకటించింది. త్వరలోనే ఈ సమస్యలను సరిచేయనున్నట్లు తెలిపింది.

Advertisement

Read Also: రైలు కోచ్ లకు బ్లూ, రెడ్, గ్రీన్, బ్రౌన్ కలర్స్.. ఒక్కో రంగు వెనుకున్న అర్థం ఏంటో తెలుసా?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×