E-Paper
Advertisement

అమృత్ భారత్ లో పుష్ పుల్ టెక్నాలజీ, రైల్వే కొత్త ప్రయోగం సక్సెస్ అయ్యేనా?

అమృత్ భారత్ లో పుష్ పుల్ టెక్నాలజీ, రైల్వే కొత్త ప్రయోగం సక్సెస్ అయ్యేనా?
Advertisement

Indian Railways Modernization: భారతీయ రైల్వే గత కొంత కాలంగా మరింత అప్ డేట్ అవుతుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణించే సాధారణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో కీలక చర్యలు చేపడుతుంది. ప్రీమియం రైళ్లతో పోలిస్తే టికెట్ ధర తక్కువగా ఉన్నా, ప్రయాణ అనుభవం మాత్రం మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే అమృత్ భారత్ రైళ్లను మరింత అద్భుతంగా తీర్చిదిద్దబోతుంది. అందులో భాగంగానే పుష్ పుల్ టెక్నాలజీని తీసుకురాబోతోంది. అంటే రైలు రెండు చివర్లలో కూడా లోకోమోటివ్‌ లు ఉంటాయి. దీనివల్ల రైలు వేగంగా స్టార్ట్ అవడం, త్వరగా ఆగడం సులభమవుతుంది. మొత్తం ప్రయాణ సమయం తగ్గుతుంది. సుదూర ప్రయాణాల్లో కూడా ఈ టెక్నాలజీ మంచి పనితీరును ఇస్తుంది.

పలు మార్గాల్లో అప్ డేటెడ్ రైళ్లు అందుబాటులోకి!

ప్రస్తుతం ఈ రైలు సేవలను ముఖ్య నగరాల మధ్య విస్తరించేందుకు రైల్వే ప్రయాణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా వారణాసి- పూణే మధ్య ప్రయాణించే రైళ్లలో ఈ టెక్నాలజీని తీసుకొస్తుంది. ఈ మార్గంలో ఇప్పటికే ఉన్న రైళ్లపై భారీ ఒత్తిడి ఉంది. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ లు ప్రారంభమైతే, ఆ రద్దీ తగ్గే అవకాశం ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు ఈ మార్గంలో సులభంగా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంటుంది. అటు అయోధ్య- ముంబై వరకు కూడా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయోధ్యకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా దేశం నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై లాంటి పెద్ద నగరంతో నేరుగా అనుసంధానం కల్పించడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.

రైళ్లలో ప్రత్యేక సౌకర్యాలు

Advertisement

అటు ఈ కొత్త అమృత్ భారత్ రైళ్లలో సౌకర్యాలపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎర్గోనామిక్ సీటింగ్, మెరుగైన సస్పెన్షన్ లాంటి  అంశాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. సుదూర ప్రయాణాల్లో కూడా అలసట తగ్గేలా వీటిని డిజైన్ చేశారు. అలాగే షెడ్యూల్‌ కూడా ప్రయాణికులకు అనుకూలంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను  ప్రవేశపెట్టడం సాధారణ ప్రజలకు మంచి సౌకర్యాలు అందుతాయి. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల మధ్య అనుసంధానం మరింత బలపడుతుంది. ఇది కేవలం రవాణా సదుపాయం మాత్రమే కాదు, వివిధ ప్రాంతాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కూడా మెరుగుపరచనుంది. కొత్త టెక్నాలజీతో వస్తున్న ఈ రైళ్లు భారతీయ రైల్వేలో పెద్ద మార్పును తీసుకురానున్నాయి. తక్కువ ఖర్చుతో, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ద్వారా సాధారణ ప్రయాణికుల మంచి ఆప్షన్ గా మారనుంది.

Read Also: ట్రైన్ లేట్, ఫ్లైట్ మిస్.. చచ్చినట్టు ఆ డబ్బులు కట్టేయాలన్న న్యాయస్థానం!

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×