Indian Railways: ఇండియన్ రైల్వేలో ఆహార నాణ్యతపై తరచూ ప్రయాణికులు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. ఆహారం తాజాగా లేకపోవడం, పరిశుభ్రత లోపాలు ప్రధాన సమస్యలుగా ప్రయాణికులు చెబుతుంటారు. కొన్ని రైళ్లలో అయితే.. సరఫరా చేసే ఆహారం వాసన వస్తుందని కూడా కంప్లైంట్ చేస్తుంటారు. ఆహారం నాణ్యత లేకపోవడ వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కూరగాయలు తాజాగా ఉండకపోవడం, క్యాటరింగ్ సిబ్బంది పరిశుభ్రత పాటించకపోవడం, ఆహారాన్ని సరిగా నిల్వ చేయకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఐఆర్‌సీటీసీ ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నాణ్యతలో స్థిరత్వం లోపిస్తోంది. ప్రయాణికులు సొంత ఆహారం తెచ్చుకోవడం లేదా బయటి ఫుడ్ డెలివరీ సేవలపై డిపెండ్ అవుతున్నారు. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించడం రైల్వే సేవల విశ్వసనీయత పెరుగుతోంది. కానీ తరుచుగా ఇలాంటి కంప్లైంట్స్ రావడం వల్ల ఇండియన్ రైల్వేలో సరఫరా చేసే ఫుడ్‌పై ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.
ఆహారంపై తేలుతున్న నల్లటి పురుగు..
తాజాగా మంగళవారం న్యూఢిల్లీ నుంచి ప్రయాణించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు తనకు సరఫరా చేసిన భోజనంలో ఒక నల్లని పురుగును గుర్తించాడు. ప్రస్తుతం ఈ ఘటన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై తీవ్ర విమర్శలను దారితీస్తుంది. హార్దిక్ పంచాల్ అనే వ్యక్తి ఆహారంలో పైకి తేలుతున్న పురుగు ఫోటోను సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. దీని ఫలితంగా రైల్వే క్యాటరింగ్ సేవలపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
Insect found in food during journey in vande Bharat train dated 22 july 2025 : Train no 22440 c3 53 seat No pic.twitter.com/8ByCVPA67R
— Hardik panchal (@HARDIK1008) July 22, 2025
వందేభారత్ ట్రైన్‌లో కూడా ఏంటిది..?
‘వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో అంత టిక్కెట్ పెట్టి ప్రయాణిస్తే.. ఇలాంటి ఫుడ్ పెడుతున్నారు.. ఇది ఎంత వరకు కరెక్ట్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘రైల్వేలో సరఫరా చేసే ఫుడ్ పై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన.. సమస్యకు మాత్రం పరిష్కారం లభించండం లేదు’ అని కామెంట్ చేసుకొచ్చాడు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టబడిన ఈ రైలు చాలా వేగంగా ప్రయాణించడమే గాక.. అత్యుత్తమ సేవలతో ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. అయితే, ఈ ఘటన ఆహార సేవల నాణ్యతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. 2024లో ఓ ప్రయాణికుడు సాంబార్‌లో పురుగులను, మరొకరు చపాతీలో బొద్దింక కనిపించింది. ఈ సమస్యలు తరుచూ రిపీట్ కావడంతో.. రైల్వే క్యాటరింగ్ సేవలపై ప్రయాణికులకు విశ్వసనీయత తగ్గిపోతుంది.
We regret inconvenience! Please share details PNR and mobile no. You may also raise your concern directly on https://t.co/AmJ5X4ydf8 for speedy redressal.
— RailwaySeva (@RailwaySeva) July 22, 2025
స్పందించిన రైల్వే సేవ..
ఈ ఘటనపై రైల్వే సేవ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా రియాక్ట్ అయ్యింది. ప్రయాణికుడి పీఎన్ఆర్ అలాగే మొబైల్ నెంబర్ ను పంపమని కోరింది. railmadad.indianrailways.gov.inలో ఫిర్యాదు నమోదు చేయమని కోరింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సరఫరా చేసే రైల్వే సిబ్బందికి మెరుగైన శిక్షణ అవసరమని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన భారత రైల్వేలు తమ ప్రీమియం సర్వీస్‌లలో ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి తీసుకోవలసిన చర్యలను గుర్తు చేస్తుంది.