BigTV English

Shivaji Maharaj Biopic: ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్టే… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్?

Shivaji Maharaj Biopic: ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్టే… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్?

Shivaji Maharaj Biopic: సినీ ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలకు(Bio Pic Movies) ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీల నుంచి మొదలుకొని రాజకీయ నాయకులకు క్రీడారంగానికి చెందిన వారితో పాటు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన బయోపిక్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ఛత్రపతి శివాజీ మహా రాజ్ కుమారుడు శంబాజీ మహారాజ్ బయోపిక్ సినిమాగా ఛావా సినిమా(Chhaava) ప్రేక్షకుల ముందుకు వచ్చే అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.


ఛత్రపతి శివాజీ బయోపిక్…

ఇకపోతే ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో శంభాజీ మహారాజ్ తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ (shivaji maharaj)బయోపిక్ సినిమా చేయాలని సన్నాహాలు జరిగాయి. ప్రముఖ దర్శకుడు అమిత్ రాయ్(Amith Rai) దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్(shahid kapoor) హీరోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా? లేదా అనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. తాజాగా చత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ సినిమా గురించి డైరెక్టర్ అమిత్ రాయ్ క్లారిటీ ఇచ్చారు.


బాక్సాఫీస్ లెక్కలు చూస్తారు…

ఈ సందర్భంగా దర్శకుడు చత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ సినిమా గురించి మాట్లాడుతూ… ఐదు సంవత్సరాలపాటు ఒక సినిమా కథ సిద్ధం చేస్తూ ఈ కథకు జీవితాన్ని అంకితం చేస్తే కొంత మంది మధ్యలో వచ్చి ఇది ఇలా కాదు, అది అలా కాదు అంటూ వంకలు పెడితే ఎలాగో ఉంటుందంటూ తనకు జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్పకనే చెప్పారు. ఇలా ఈయన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈ బయోపిక్ సినిమా విషయంలో కొందరు అభ్యంతరం చెప్పడం వల్లే పూర్తిగా పక్కన పెట్టేసారని స్పష్టం అవుతుంది. అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు సినిమా కథ గురించి ఆలోచించరని కేవలం బాక్సాఫీస్ లెక్కల గురించి మాత్రమే ఆలోచనలు చేస్తారు అంటూ ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

ప్రేమ కథ సినిమాలే కావాలి…

ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూపించే సినిమాలలో భాగం కారని ప్రేమ కథ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతారు అంటూ కూడా అమిత్ రాయ్ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. మొత్తానికి చత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ సినిమా వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు ఇది కాస్త చేదువార్త అని చెప్పాలి. షాహిద్ కపూర్ ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. చివరిగా దేవా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నటి పూజా హెగ్డే(Pooja Hedge) నటించిన సంగతి తెలిసిందే.

Also Read: Pawan Kalyan: రామ్ చరణ్, ఎన్టీఆర్ నాటు నాటు పాటపై పవన్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Related News

Coolie vs War 2 : వార్‌కి ఇది సరిపోదు… మిగిలింది ఈ ఒక్క ఛాన్సే

Vadde Naveen: పదేళ్ల తర్వాత రీఎంట్రీ.. ఈ కానిస్టేబుల్ కష్టాలేందుకు నవీన్..

Bollywood: రక్షాబంధన్ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ సోదరి పోస్ట్!

Niharika Konidela: మెగా బ్రదర్స్ తో నిహారిక రాఖీ సెలబ్రేషన్స్.. ఆకట్టుకున్న ఫోటోలు!

Aamir Khan Brother: ఏడాది పాటు గదిలో బంధించాడు.. ఏవేవో మందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టాడు.. ఆమిర్ ఖాన్ పై సోదరుడి ఆరోపణలు

Bad Girlz : స్టేజ్‌పైనే బట్టలు విప్పేసిన హీరోయిన్లు… వామ్మో అసలు వీళ్లకు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Big Stories

×