E-Paper
Advertisement

Samantha -Raj : అత్తవారింట్లో సమంతకు గ్రాండ్ వెల్ కమ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్..

Samantha -Raj : అత్తవారింట్లో సమంతకు గ్రాండ్ వెల్ కమ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్..
Advertisement

Samantha -Raj : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును డిసెంబర్ 1న కోయంబత్తూరులో వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ జంట పెళ్లి చేసుకొని రెండు రోజులు అవుతున్న సరే ఏదో ఒకటి వార్తల్లో హైలైట్ అవుతూ వస్తుంది.. తాజాగా సమంత తన అత్తవారింట్లోకి అడుగు పెట్టింది.. తన అత్తవారింట్లోకి అడుగుపెట్టిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.. అంతే కాదు రాజ్ సోదరి శీతల్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ గా మారింది. అందులో ఆమె ఏమి అన్నారో చూద్దాం..

రాజ్ – సమంతల పెళ్లిపై సోదరి ఎమోషనల్ పోస్ట్.. 

గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న రూమర్స్ కు సమంత చెక్ పెట్టేసింది. తాను ప్రేమించిన బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా సడన్ గా పెళ్లి చేసుకుని అందరికీ సమంత సర్ప్రైజ్ వచ్చింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. సమంత తన అత్తవారింటికి అడుగు పెట్టింది.. ఈ క్రమంలో రాజ్ సోదరి శీతల్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Advertisement

అందులో ఏముందంటే.. ఈరోజు చంద్రకుండంలో శివుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రదోష సమయంలో, చలికి వణికిపోతూ శివలింగాన్ని కౌగిలించుకున్నాను. అది నా గుండె కన్నీళ్లతో నిండిపోయింది. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, కృతజ్ఞతతో వచ్చిన కన్నీళ్లు.. ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ప్రశాంతతకు, మా కుటుంబానికి చేరిన స్పష్టతకు రాజ్, సమంతాల ప్రయాణంలో ఏర్పడిన సున్నితమైన అనుసంధానానికి ధన్యవాదములు. వాడు నిజాయితీగా, దృడంగా, నమ్మకంగా ముందుకు వెళ్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు హృదయాలు ఉద్దేశపూర్వకంగా ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కుటుంబంగా మేము వారికి పూర్తిగా, సంతోషంగా, ఎలాంటి సంకోచం లేకుండా అండగా ఉంటాం. వారిని ప్రతి విధంగా ఆశీర్వదిస్తూ.. అలాగే మద్దతు ఇస్తూ వస్తాం. పవిత్రమైన రోజున, ఈషా సంప్రదాయాలను కుటుంబంగా కలిసి చేయడంతో జీవితం అందమైన రీతిలో అనుసంధానమైనట్లు అనిపించింది. నేను దీపాలను వెలిగిస్తున్నప్పుడు నాకు ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్ని అందరు ఎంపిక చేసుకుంటూ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : ‘జైలర్ 2’ లో విలన్ గా స్టార్ యాక్టర్.. ఇదిగో క్లారిటీ ఇచ్చేశాడుగా..

సమంత రియాక్షన్ ఏంటంటే..

Advertisement

సమంత రెండవ భర్త రాజ్ సోదరి వెల్ కమ్ కు ఫిదా అయ్యిందని తెలుస్తుంది. ఆ పోస్ట్ పై సమంత లవ్ ఎమోజితో లవ్ యు అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట ట్రెండ్ అవుతుంది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో వివాహం చేసుకున్నారు. ఈ జంట లింగ భైరవ వివాహాన్ని ఎంచుకున్నారు.. ఇక పోతే సామ్ గతంలో 2017 నుండి 2021 వరకు నాగ చైతన్యతో వివాహ బంధంలో కొనసాగారు. ఆ తర్వాత 2022 నుంచి డైరెక్టర్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉందని వార్తలు వినిపించాయి. మొత్తానికి సమంత పెళ్లి జరిగిపోయింది. మరి ఈ పెళ్లితో టాను సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు..

?igsh=MXd2NGJhNGRzNW1jOQ==

Related News

సందీప్ రెడ్డి వంగకు విజయ్ కాస్ట్లీ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే..

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..

మమిత బైజు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఆ లిస్ట్ లోకి చేరినట్లే..!

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల తేదీ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే..? 

ముద్దు సీన్ ఉంటే అడల్ట్ సినిమా అవుతుందా? ట్రోలర్స్ కు నాగ వంశీ కౌంటర్!

ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య

నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

బోయపాటి సెంటిమెంట్‌కు తమిళ బ్రదర్స్ నో?

Big Stories

Advertisement
×