E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఏ నేరం చేయకుండానే జైలుకు వెళ్లొచ్చు.. చంచల్‌గూడ జైలులో చిప్పకూడు తినే ఛాన్స్!

ఏ నేరం చేయకుండానే జైలుకు వెళ్లొచ్చు.. చంచల్‌గూడ జైలులో చిప్పకూడు తినే ఛాన్స్!
Advertisement

జైలు జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా? ఖైదీలు ఎలాంటి గదుల్లో ఉంటారు? వారికి ఎలాంటి భోజనం అందిస్తారు? జైల్లో రోజు ఎలా గడుస్తుంది? అనే విషయాలను ప్రత్యక్షంగా అనుభవించాలనుకుంటున్నారా? ఇప్పుడు హైదరాబాద్‌ లో ఇలాంటి అవకాశం అందుబాటులోకి వచ్చింది. చంచల్‌ గూడ సెంట్రల్ జైల్లో ‘ఫీల్ ది జైల్’ పేరుతో వినూత్న టూరిజం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

24 గంటల పాటు జైలు జీవితాన్ని గడిపే అవకాశం

ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా సాధారణ ప్రజలు 24 గంటల పాటు జైలు జీవితాన్ని ఎక్స్ పీరియెన్స్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు జైలు వ్యవస్థపై అవగాహన కల్పించడంతో పాటు, జైలు జీవితం ఎంత కఠినంగా ఉంటుందో తెలియజేయాలన్న ఉద్దేశంతో అధికారులు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు.

Advertisement

ఈ ఎక్స్ పీరియన్స్ కావాలనుకునే వారికి జైలులో ఖైదీలు ధరించే యూనిఫాం అందజేస్తారు. అంతేకాదు, వారు సాధారణ ఖైదీల మాదిరిగానే జైలు సెల్‌ లోనే బస చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, జైలులో ఖైదీలకు అందించే భోజనాన్నే వారికి కూడా అందిస్తారు. దీంతో జైలు వాతావరణాన్ని కంప్లీట్ గా ఎక్స్ పీరియెన్స్ చేసే అవకాశం లభిస్తుంది.

చంచల్ గూడ్ జైలు గురించి..

హైదరాబాద్‌ లోని చంచల్‌ గూడ సెంట్రల్ జైలుకు చాలా చరిత్ర ఉంది. ఈ జైలును 1912లో నిజాం పాలన కాలంలో నిర్మించారు. దాదాపు శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ కారాగారం ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా మారబోతోంది. చారిత్రక నిర్మాణంతో పాటు జైలు వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక కొత్త అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం 24 గంటల ప్యాకేజీని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని 4 గంటలు, 8 గంటల ప్రత్యేక ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికీ విదేశాల్లో ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమాలు

Advertisement

ఇలాంటి ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమాలు విదేశాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అదే తరహా ఎక్స్ పీరియెన్స్ ను తెలంగాణలో కూడా అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జైలు జీవితం గురించి తెలుసుకోవాలనుకునే విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపే అవకాశం ఉంది.  అయితే, జైలు అనేది కేవలం సందర్శన స్థలం మాత్రమే కాదని, నేరాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ప్రదేశమని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చట్టాల పట్ల గౌరవం పెరగడంతో పాటు, జైలు జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యక్షంగా అర్థమవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి, చంచల్‌గూడ జైలు తీసుకొచ్చిన ‘ఫీల్ ది జైల్’ టూరిజం కార్యక్రమం తెలంగాణలో ఒక వినూత్న ప్రయత్నంగా నిలవనుంది. జైలు జీవితాన్ని దగ్గరగా చూసే ఈ అరుదైన అవకాశం ప్రజలను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Also: లడఖ్ ట్రిప్‌ కోసం రూ.20 వేలు ఇస్తున్న ప్రభుత్వం, ట్రావెలర్స్‌ కు పండగే!

Related News

బుల్లెట్ రైళ్లు సాధారణ పట్టాలపై వెళ్లలేవా? ప్రత్యేక ట్రాక్‌లు ఎందుకు నిర్మిస్తారు?

అలా జరిగితే.. వందే భారత్‌ రైలులో ఫుడ్ ఫ్రీ, రైల్వే కీలక నిర్ణయం!

జపాన్ టూర్‌కు IRCTC స్పెషల్ ప్యాకేజీ.. బుల్లెట్ రైలు ప్రయాణంతో 10 రోజుల టూర్!

రైలు కోబ్రా కలకలం.. సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెనుముప్పు!

రెండింతల ఫైన్.. కట్టకపోతే జైల్.. ఇవాళ్టి నుంచి అమల్లోకి షాకింగ్ రూల్!

హైదరాబాద్ నుంచి క్రేజీ గోవా ట్రిప్.. ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ మీకోసమే!

లడఖ్ ట్రిప్‌ కోసం రూ.20 వేలు ఇస్తున్న ప్రభుత్వం, ట్రావెలర్స్‌ కు పండగే!

Big Stories

×