E-Paper
Advertisement

ఇండియా నుంచి చైనా, భూటాన్ వరకు రైళ్లు.. డోక్లాంలో రైల్వే ట్రాక్‌కు లైన్ క్లియర్!

ఇండియా నుంచి చైనా, భూటాన్ వరకు రైళ్లు.. డోక్లాంలో రైల్వే ట్రాక్‌కు లైన్ క్లియర్!
Advertisement

Chalsa–Naxalbari Rail Project: భారత్-చైనా-భూటాన్ త్రి జంక్షన్ ప్రాంతానికి సమీపంలో రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేసే కీలక ప్రాజెక్టు మళ్లీ వేగం పుంజుకోబోతోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న చల్సా-నక్సల్బారి రైల్వే లైన్ కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది.

కీలకమైన వ్యూహాత్మక రైలు మార్గం

ఈ రైల్వే మార్గం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనదిగా కేంద్రం భావిస్తోంది. డోక్లాం ప్రాంతానికి సమీపంలో ఉండటంతో పాటు, భారత్-చైనా-భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, కనెక్టివిటీని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ మార్గం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు పెరగడమే కాకుండా పర్యాటక రంగానికీ ఊతం లభించే అవకాశం ఉంది.

రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం

Advertisement

ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 380 హెక్టార్ల భూమి అవసరం. భూసేకరణలో జాప్యం కారణంగా గతంలో ఈ పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు అంగీకరించడంతో రైల్వే శాఖ పనులను వేగవంతం చేయడానికి సిద్ధమవుతోంది. చల్సా-నక్సల్బారి రైల్వే లైన్, న్యూ జల్పైగురి–సిలిగురి–న్యూ బొంగైగావ్ గేజ్ ఛేంజ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. ఇందులో సుమారు 20 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గం ఉంటుంది.

ఈ ప్రాజెక్టుకు 2011-12 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా, భూసేకరణ సమస్యల వల్ల పనులు ప్రారంభం కాలేకపోయాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో 2019 సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో రైల్వే శాఖ పెండింగ్‌లో ఉన్న మరో ఐదు ప్రాజెక్టులతో పాటు దీనిని కూడా మళ్లీ పునరుద్ధరించింది. అయినప్పటికీ భూమి సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో పనులు ఆశించిన వేగంతో సాగలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పరిస్థితి మారింది. భూసేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

ఇదే సమయంలో చల్సా సమీపంలోని ఖునియా మోర్ నుంచి జల్ధాకా వరకు కొత్తగా నిర్మించనున్న 17 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం కేంద్రం సుమారు రూ.272 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గం జల్పైగురి, కాలింపాంగ్ అటవీ ప్రాంతాల గుండా వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతిపాదిత రైల్వే మార్గాన్ని ఖరారు చేసేందుకు వర్షాకాలం ముగిసిన తర్వాత రైల్వే శాఖ,  బెంగాల్ అటవీ శాఖ అధికారులు కలిసి సంయుక్త సర్వే నిర్వహించనున్నారు. సర్వే నివేదిక ఆధారంగా తుది మార్గాన్ని నిర్ణయిస్తారు. ఈ కొత్త రైల్వే లైన్ పూర్తయితే డోక్లాం సమీపంలోని జల్ధాకా ప్రాంతానికి రైల్వే అనుసంధానం మరింత పెరుగుతుంది. జల్ధాకా, బిందు, తోడే తంగ్తా లాంటి ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ఐఆర్‌సిటిసి జపాన్ టూర్.. హ్యాపీగా 10 రోజులు ఎంజాయ్ చేయండి గురూ!

Tags

Related News

మెుబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 డెడ్ లైన్.. ఈ ప్రచారంలో వాస్తవమెంత!

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

Big Stories

Advertisement
×