E-Paper
Advertisement

రాహుల్ వ‌ద్ద‌కు ఎందుకు? జ‌నం వ‌ద్ద నిల‌దీయండి!? బీజేపీ ప‌స‌లేని, అస‌మ‌ర్థ వ్యూహాలు..!

రాహుల్ వ‌ద్ద‌కు ఎందుకు? జ‌నం వ‌ద్ద నిల‌దీయండి!?  బీజేపీ ప‌స‌లేని, అస‌మ‌ర్థ వ్యూహాలు..!
Advertisement

నిజంగా రాంచంద్రారావుకు నోరు లేన‌ట్టుంది. ఎవ‌రో చెబితే ఇన్ని రోజుల‌కు ఓ లేఖ రాశాడు. సీఎంకు బ‌హిరంగ లేఖ‌. ఆరు గ్యారెంటీలు అమ‌లు కాలేదు కాబ‌ట్టి.. రాహుల్ అపాయింట్ ఇప్పిస్తే.. ఆ విష‌యాలు చెబుతాడంట‌. పిల్ల‌లాటలాగే ఉంది ఆ లేఖ సారాంశం. ఎవ‌రు చెప్పారో మ‌రి. బ‌హుశా కిష‌న్‌రెడ్డి చెప్పి ఉంటాడు.

ఇంత‌గానం తుక్క తుక్కు తిడుతుంటే.. నాకు ఎవ‌రూ స‌పోర్టు చేస్త‌లేరు.. అన్నందుకు ఇలా.. ఏదో ఒక‌లా స‌ర్కార్‌ను ఇరుకున పెట్టే యోచ‌న‌లో భాగంగా ఈ లేఖ రాసి.. మ‌రింత న‌వ్వుల పాలే అయ్యింది తెలంగాణ బీజేపీ. సీఎం రేవంత్‌రెడ్డి వ‌రుస‌గా కిష‌న్‌రెడ్డిపై మాట‌ల దాడి చేస్తూ వ‌స్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశం నుంచి మొద‌లు పెడితే, తుమ్మ‌డిహ‌ట్టి వ‌ద్ద ప్రాణ‌హిత‌-చేవెళ్ల బ్యారేజీ నిర్మాణం, మెట్రోకు ప‌ర్మిష‌న్లు, లోన్ సాంక్ష‌న్‌, మూసీకి గ్రీన్ సిగ్న‌ల్‌.. రీజ‌న‌ల్ రింగురోడ్డుకు నిధులు.. ఇలా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క సాయం కూడా అందండం లేద‌ని, దీనికి ప్ర‌ధాన అడ్డంకి కిష‌న్‌రెడ్డే అని ఆరోపిస్తూ వ‌స్తున్నారు.

Advertisement

దీన్ని కిష‌న్‌రెడ్డి ఒక్క‌డే ఎదుర్కొంటూ, కౌంట‌ర్లిస్తూ వ‌స్తున్నాడు త‌ప్ప‌.. బీజేపీ నేత‌లెవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్రేక్ష‌క‌పాత్రే వ‌హిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ద‌లినా.. దానికి అంత స్పంద‌న ఉండ‌టం లేదు. పైగా ఆయ‌న స్ట్రాట‌జీ న‌వ్వుల పాల‌వుతోంది. తాజాగా ఆయ‌న రాసిన లేఖ కూడా అదే కోవ‌లోకి చేరింది. మ‌మ్మ‌ల్ని ఇరుకున పెడితే.. మిమ్మ‌ల్ని కూడా ఎలా ఇబ్బంది పెట్టాలో తెలుసు.. అందుకే రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వు.. నీ ఆరు గ్యారెంటీలు ఎక్క‌డ పోయాయో అడుగుతా..! అని రేవంత్‌రెడ్డిని బెదిరించిన‌ట్టే ఉంది.

జ‌నాల‌కు మాత్రం బీజేపీ వ్యూహం అర్థ‌మై న‌వ్వుకున్నారు. ఆయ‌నేమంటున్నారు? మీరేం అడుగుతున్నారు? ఒక‌వేళ ఆరు గ్యారెంటీలు అమ‌లు కాలేద‌ని భావిస్తే.. జ‌నం ముందు దోషిలా కాంగ్రెస్‌ను నిల‌పండి! జిల్లాల టూర్ పెట్టుకోండి. బ‌హిరంగ స‌భ‌లు పెట్టండి. మేమే ప్ర‌త్యామ్నాయం.. అధికారంలోకి వ‌చ్చిన తరువాత ఇవ‌న్నీ మేమే చేసి చూపుతామ‌ని హామీ ఇవ్వండి. కేంద్రం తెలంగాణ‌కు ఏమేమి చేసిందో వివ‌రించండి. ఆరు గ్యారెంటీల్లో ఏ ఏ గ్యారెంటీ అమ‌లు కాలేదో.. ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా వివ‌రించండి. జ‌నాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టండి. బీజేపీని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా నిల‌బెట్టుకోండి.

Advertisement

ఇన‌న్నీ వ‌దిలేసి.. లేఖ‌ల ద్వారా స‌ర్కార్‌ను డిఫెన్స్‌లో ప‌డేశామ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకున్నంత ప‌ని చేశారు బీజేపీ నాయ‌కులు. ఉన్న న‌లుగురిలో స‌ఖ్యత లేదు. పొద్దున లేస్తే ఎవ‌రేం మాట్లాడుతారో వారికే తెలియ‌దు. ఒక‌రు మా అధ్య‌క్షుడికి నోరు లేదు. నాకే నోరుంది.. నేను రాష్ట్ర అధ్య‌క్షుడిని అవుతానంటాడు. ఇంకొక‌రు.. క‌విత ఇంటి ముందుకు పోయి లొల్లి చేసి వ‌స్తానంటాడు. బండి సంజయ్ బండికి బ్రేకులు ప‌డ్డాయి. ఈట‌ల రాజేంద‌ర్‌ ప్ర‌త్యేక కేట‌గిరీ లీడ‌ర్‌గా ఉన్నాడు. ఇంకెవ‌రున్నారు? అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టున్నారు. ఢిల్లీ పెద్ద‌ల‌ నిర్ణ‌యం కూడా స‌బ‌బుగానే ఉంద‌నిపిస్తుంది. వీరిని చూస్తే.

Related News

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!

సీఎం కోట ముందు కవిత ఛాలెంజ్‌….నేను బహుజన బాణాన్ని.. ఏ పార్టీకి తొత్తును కాదు..!

కానరాని వైష్ణవిలెందరో..!? ప్రతీకార హత్యలకు కారకులెవరు? వెన్నుతట్టి ప్రోత్సహించిన నెటిజన్లది! రెచ్చగొట్టిన జనానిది..!

ఆ ఎమ్మెల్యేది క్రెడిట్‌ చోరీ కాదు.. జనం దిల్‌ చోరీ..! మన తెలుగు నేతల లెక్క క్రెడిట్‌ కోసం కొట్టుకోలేదు.. ప్రతిపక్షానికే క్రెడిట్‌ ఇచ్చిన వైనం..!

Big Stories

Advertisement
×