Mohsin Naqvi Off To Dubai over Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 8 మ్యాచ్ లు పూర్తిగా కాగా నిన్న టీమిండియా ఉమెన్స్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య 9వ మ్యాచ్ కూడా జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఎప్పటి లాగే మరోసారి టీమిండియా చేతిలో పాకిస్తాన్ తుక్కుతుక్కుగా ఓడిపోయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఉమెన్స్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పురుషులతో పాటు, మహిళలు కూడా దిగజారిపోయారని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా టైటిల్ నెగ్గాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) దుబాయ్ వెళ్లారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
ఆసియా కప్ 2026 మహిళల టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) నేపథ్యంలో పాకిస్తాన్ నిన్న టీమిండియా చేతిలో తుక్కు తుక్కుగా ఓడిపోయింది. అయితే ఫైనల్స్ లో కూడా టీమిండియా చేతిలో ఓడిపోతుందన్న భయం మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi )కి పట్టుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే హుటా హుటిన దుబాయ్ కి మొహ్సిన్ నఖ్వీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే… టైటిల్ ఎలా దొంగిలించాలనే అంశంపై మొహ్సిన్ నఖ్వీ ఫోకస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2025 పురుషుల ఆసియా కప్ టోర్నమెంట్ సందర్భంగా టైటిల్ దొంగతనం చేసినట్లుగానే ఇప్పుడు కూడా మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ లేపేయబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.
ఆసియా కప్ 2026 మహిళల టోర్నమెంట్ ఫైనల్ లో టీమిండియా గెలిస్తే, నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోవాల్సి ఉంటుంది. ఏసీసీ ఛైర్మన్ గా మొహ్సిన్ నఖ్వీ ఉన్నాడన్న ఒక్క కారణంతో అతని చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలి.అయితే ఫైనల్స్ లో టీమిండియా విజయం సాధిస్తే మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అస్సలు తీసుకోదు. ఇది పాకిస్తాన్ కు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. గతంలో సూర్యకుమార్ యాదవ్ కూడా మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకోబోనని భీస్మించుకొని మైదానంలోనే కూర్చున్నాడు.
ఇప్పుడు టీమిండియా మహిళలకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అలాగే చేసే ఛాన్సులు ఉన్నాయి. అదే జరిగితే… టైటిల్ తీసుకువెళ్లి మళ్లీ తన కార్యాలయంలో పెట్టుకోవచ్చని మొహ్సిన్ నఖ్వీ కుట్రలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఉన్నఫలంగా పాకిస్తాన్ నుంచి దుబాయ్ వెళ్ళాడట మొహ్సిన్ నఖ్వీ. పాకిస్తాన్ గెలిస్తే, టైటిల్ ఇవ్వాలని డిసైడ్ అయిన నఖ్వీ… ఇండియా గెలిస్తే మాత్రం అందరి కండ్లు కప్పి ట్రోఫీ దొంగలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.