BigTV English

Cheapest Foreign Trip: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ఖర్చులో వెళ్లొచ్చే దేశం ఇదే!

Cheapest Foreign Trip: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ఖర్చులో వెళ్లొచ్చే దేశం ఇదే!

Cheapest Foreign Trip From India: పిల్లలకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయి, వేసవి సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది సమ్మర్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. బడ్జెట్ తక్కువగా ఉన్న వాళ్లు ఇండియాలోనే ట్రిప్పులు ప్లాన్ చేస్తే,   డబ్బులు ఖర్చు చేసేందుకు వెనుకాడని వాళ్లు ఫారిన్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే, తక్కువ ఖర్చులో ఫారిన్ టూర్లు వేసే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. అవును.. మీరు విన్నది నిజమే.. చౌకగా ఫారిన్ టూర్ కు వెళ్లి రావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ సింగపూర్. ఇంతకీ అక్కడికి వెళ్లేందుకు ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం..


సమ్మర్ టూర్ కు బెస్ట్ సింగపూర్

వేసవి తాపానికి దూరంగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు సింగపూర్ ను ఎంచుకోవచ్చు. మేలో ఇక్కడ వర్షాలు కురుస్తుంటాయి. చల్లని ప్రకృతి ఆకట్టుకుంటుంది. అక్కడి అందమైన పూలతోటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. పొగమంచుతో కూడిన క్లౌడ్ ఫారెస్ట్ కనువిందు చేస్తుంది. గార్డెన్స్ బై ది బే షికారు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది.  సెంటోసా ద్వీపంలో S.E.A. అక్వేరియం మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. సముద్ర అద్భుతాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. యూనివర్సల్ స్టూడియోస్ సరికొత్త థ్రిల్స్‌ ను అందిస్తుంది. సూర్యాస్తమయ సమయంలో క్రూయిజ్‌ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. సిలోసో బీచ్‌ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యొచ్చు.


సింగపూర్ లో ఎన్నో అద్భుతాలు

ఇక  చైనా టౌన్‌లో రూఫ్ గార్డెన్ లు ఆకట్టుకుంటాయి. ప్రశాంతమైన బుద్ధ టూత్ రెలిక్ టెంపుల్‌ మానసిక ప్రశాంతతను అందిస్తుంది. మాక్స్‌ వెల్ ఫుడ్ సెంటర్‌ లో ఫుడ్, భోజన ప్రియులను ఆకట్టుకుంటుంది.  పగోడా స్ట్రీట్‌ షాపింగ్, లిటిల్ ఇండియాలో ఇండియన్ వంటకాలు రుచి చూడవచ్చు. విలాసవంతమైన అనుభూతి కోసం హై ఎండ్ షాపింగ్, మంత్రముగ్ధులను చేసే ఈవినింగ్ లైట్ షో కోసం మెరీనా బే సాండ్స్ ప్రొమెనేడ్‌ కు వెళ్లవచ్చు. కళాభిమానులు నేషనల్ గ్యాలరీ సింగపూర్‌ ను తప్పక చూడాలి. ఇందులో ఎన్నో అద్భుతమైన కళాఖండాలు దర్శనం ఇస్తాయి. సింగపూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఆర్ట్స్ (SIFA) ప్రతి ఏటా మే 16 నుంచి జూన్ 1 వరకు జరుగుతుంది.  ఈ సంవత్సరం ‘మోర్ దేన్ ఎవర్’ అనే థీమ్ తో ఈ ప్రదర్శన కొనసాగనుంది. మొత్తంగా సింగపూర్ టూర్ లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే మెమరీగా మిగిలిపోతుంది.

భారత్ నుంచి సింగపూర్ కు విమాన టికెట్ ధరలు

భారత్ లోని పలు నగరాల నుంచి నేరుగా సింగపూర్ కు పలు విమానయాన సంస్థలు సర్వీసులు నడిపిస్తున్నాయి.  ఆయా నగరాల నుంచి  సింగపూర్ కు విమాన టికెట్ ధర ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు 

⦿ చెన్నై- విమాన టికెట్ ధర- రూ.5,315

⦿ బెంగళూరు- విమాన టికెట్ ధర- రూ.7,585

⦿ కోయంబత్తూర్-విమాన టికెట్ ధర- – రూ.7,611

⦿ తిరువనంతపురం- విమాన టికెట్ ధర- రూ.7,933

⦿ అమృత్ సర్- విమాన టికెట్ ధర- రూ.7,955

⦿ తిరుచిరాపల్లి- విమాన టికెట్ ధర-  రూ.8,428

⦿ విశాఖపట్నం- విమాన టికెట్ ధర- రూ.8,493

⦿ ముంబై- విమాన టికెట్ ధర- రూ.9,674

⦿ హైదరాబాద్- విమాన టికెట్ ధర- రూ.10,314

⦿ భువనేశ్వర్- విమాన టికెట్ ధర- రూ.10,590

⦿ న్యూఢిల్లీ- విమాన టికెట్ ధర- రూ.11,934

⦿ కొచ్చి- విమాన టికెట్ ధర- రూ.12,829

⦿ పుణే- విమాన టికెట్ ధర-  రూ.14,658

⦿ అహ్మదాబాద్- విమాన టికెట్ ధర- రూ.16,986

⦿ గౌహతి- విమాన టికెట్ ధర- రూ.21,653

Read Also: విశాఖ వాసులకు గుడ్ న్యూస్, ఇక అక్కడి నుంచి నేరుగా విమాన సర్వీసులు!

Related News

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Big Stories

×