వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ దేవి అహల్యా బాయి హోల్కర్(DABH) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగించే పలు విమానాలకు సంబంధించి కీలక మార్పులు చేశారు. మార్చి 30 నుంచి వేసవి షెడ్యూల్ ను ప్రారంభించిన నేపథ్యంలో డజనుకు పైగా విమానాలను రీ షెడ్యూల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. రాయ్ పూర్, జబల్ పూర్, పూణేకు కొత్త విమానాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ విమానాలు ఇండోర్ తో కనెక్టివిటీని మరింత పెంచుతాయన్నారు. అదే సమయంలో ప్రయాణీకులకు మరిన్ని జర్నీ ఆప్షన్స్ ను లభిస్తాయన్నారు.
ఆ విమానాలు విశాఖ వరకు పొడిగింపు
ఇక సోమవారం(మార్చి 31) నుంచి ఇండోర్ – రాయ్ పూర్ విమానం ఇప్పుడు విశాఖపట్నం వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కొత్త షెడ్యూల్ ప్రకారం విమానాలు తన సర్వీసులను మొదలు పెట్టినట్లు తెలిపారు. రాయ్ పూర్ లో ప్రయాణీకులను దింపిన తర్వాత, ఈ విమానం విశాఖపట్నం వరకు వెళ్లనున్నట్లు తెలిపారు.
విశాఖ విమానం షెడ్యూల్ వివరాలు
ఇండోర్- రాయ్‌పూర్- విశాఖపట్నం విమానం 6E 7295 ఇండోర్ నుంచి ప్రతి రోజు ఉదయం 6:35 గంటలకు బయల్దేరి ఉదయం 8:30 గంటలకు రాయ్ పూర్ చేరుకుంటుంది. 20 నిమిషాలు అక్కడ ఆగిన తర్వాత, ఉదయం 8:50 గంటలకు బయల్దేరి 10:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 6E 7296 విమానం విశాఖపట్నం నుండి ఉదయం 11:00 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12:30 గంటలకు రాయ్ పూర్ చేరుకుంటుంది. అక్కడ మళ్లీ 20 నిమిషాల పాటు ఆగుతుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2:45 గంటలకు ఇండోర్ చేరుకుంటుంది. ఈ విమానాలతో నగరాల మధ్య మెరుగైన కనెక్టివిటీ లభించనుంది.
సుమారు డజన్ విమానాల టైమింగ్స్ మార్పు
ఇక వేసవి షెడ్యూల్ లో భాగంగా ఇండోర్ విమానాశ్రయంలో దాదాపు డజను విమానాలకు సంబంధించిన సమయాల్లో కీలక మార్పులు చేర్పులు చేస్తూ ఎయిర్ పోర్టు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి (ఏప్రిల్ 1 నుంచి), రన్ వే నిర్వహణ సమయాన్ని ఆరు గంటల నుండి ఎనిమిది గంటలకు పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా రాత్రి 10:30 నుంచి అర్ధరాత్రి వరకు, ఉదయం 6:00 నుంచి 6:30 వరకు నడిచే విమానాలను తిరిగి షెడ్యూల్ చేశారు.
Read Also: పట్టాలు ఎక్కబోతున్న ఫస్ట్ హైడ్రోజన్ రైలు, అసలు విషయం చెప్పిన రైల్వే అధికారులు!
ప్రతి రోజు 100 విమానాల రాకపోకలు
తాజా మార్పుల నేపథ్యంలో ఇండోర్ విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ 100 విమానాలు నడుస్తాయని అధికారులు తెలిపారు ఇండోర్- పూణే విమానం కూడా తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ, అది నేరుగా ఇండోర్ కు తిరిగి రాదు. ఢిల్లీ నుంచి ఇండోర్ కు వచ్చి అక్కడి నుంచి పూణేకు వెళుతుంది. ఏప్రిల్ 15 నుంచి నార్త్ గోవాకు నేరుగా విమాన సర్వీసు విమానం ప్రారంభమవుతుంది. దీని వల్ల ఉత్తర, దక్షిణ గోవా రెండూ ఇండోర్ కు కనెక్ట్ కానున్నాయి.
Reada Also: తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్స్ కావాలా? సింఫుల్ గా ఈ ట్రిక్స్ యూజ్ చేయండి!