Cherlapally Railway Terminal: దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పటి వరకు అతిపెద్ద రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే స్టేషన్ కు ప్రత్యామ్నాయంగా మరో రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది. చర్లపల్లి వేదికగా రైల్వే హబ్ తయారయ్యింది. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రోజు రోజుకు ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ చర్లపల్లి స్టేషన్ కు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ స్టేషన్ కు ప్రత్యామ్నాయ కేంద్రంగా రెడీ చేసింది.
చర్మపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్న రైల్వేమంత్రి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ను కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ(నవంబర్ 30)న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొననున్నారు. రీసెంట్ గా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ రైల్వే టెర్మినల్ ను పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో రోడ్లు విస్తరణ పనులను చేపట్టింది. రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గాలను విస్తరిస్తున్నది.
రూ. 450 కోట్లతో ఎయిర్ పోర్ట్ తరహాలో నిర్మాణం
చర్లపల్లి రైల్వే హబ్ ను కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 450 కోట్లతో అద్భుతంగా నిర్మించింది. ఎయిర్ పోర్టును తలదన్నేలా రెండు అంతస్తులలో ఈ రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం 9 రైల్వే ఫ్లాట్ ఫారమ్ లను ఏర్పాటు చేశారు. 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. అటు స్త్రీ, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్స్, హైక్లాస్ ఏసీ వెయిటింగ్ హాల్స్ తో పాటు వీఐపీల కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ లో 6 బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. ప్రయాణీకుల రాకపోకల కోసం విశాలమైన ప్రదేశం, ముందువైపు అద్భుతమైన లైటింగ్, రేల్వే స్టేషన్ అంతటా ఫ్రీ వైఫై సదుపాయాన్ని అందించనున్నారు.
𝐂𝐡𝐚𝐫𝐥𝐚𝐩𝐚𝐥𝐥𝐢 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧 𝐭𝐨 𝐛𝐞 𝐥𝐚𝐮𝐧𝐜𝐡𝐞𝐝 𝐬𝐨𝐨𝐧!
Being developed with a budget of Rs. 428 crores, the new satellite terminal will have facilities like large circulating area with adequate parking facilities, 5 lifts and 5 Escalators… pic.twitter.com/16Hs3F5jiz
— G Kishan Reddy (@kishanreddybjp) November 29, 2024
కీలక అనుమతులు మంజూరు చేసిన రైల్వే బోర్డు
చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆపరేషన్స్ కు సంబంధించి రైల్వే బోర్డు కీలక అనుమతులు జారీ చేసింది. చర్లపల్లి స్టేషన్ నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లును నడిపేందుకు అనుమతి ఇచ్చింది. మరో 12 రైళ్లు ఈ స్టేషన్ లో ఆపేందుకు పర్మీషన్స్ ఇచ్చింది. ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుంచి మరిన్ని రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే రెడీ అవుతోంది. ఇక్కడి నుంచి పలు రైళ్లను సుదూర ప్రాంతాలకు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.
Read Also:రైలు బోగీల మీద కోడ్ నెంబర్లు, ఇంతకీ వాటి వెనుకున్న అర్థం ఏంటో తెలుసా?
చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు
ప్రస్తుతం చర్లపల్లి నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిచేందుకు అనుమతులు వచ్చాయి. ఆ రైళ్లలో గోరఖ్ పూర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, షాలిమార్ – హైదరాబాద్ ఈస్ట్ కోస్టు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలను కొనసాగించగా, ఇకపై చర్లపల్లి నుంచి ప్రయాణాలను కొనసాగించనున్నాయి. త్వరలోనే మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అటు చర్లపల్లి స్టేషన్ లో నిలిచే రైళ్లలో గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. స్టేషన్ ప్రారంభం అయ్యాక మరిన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
The station’s transformation includes advanced facilities designed to accommodate increased footfall, ease congestion in Kacheguda, Hyderabad and Secunderabad stations, and improve overall efficiency.@RailMinIndia@SCRailwayIndia pic.twitter.com/D8Zw0A836d
— G Kishan Reddy (@kishanreddybjp) November 29, 2024
Read Also: నెరవేరిన అర్థ శతాబ్దం కల, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్