BigTV English

Thyroid: డైలీ థైరాయిడ్ టాబ్లెట్లు తీసుకుంటున్నారా? భవిష్యత్తులో జరిగేది ఇదే!

Thyroid: డైలీ థైరాయిడ్ టాబ్లెట్లు తీసుకుంటున్నారా? భవిష్యత్తులో జరిగేది ఇదే!

థైరాయిడ్ బారిన పడుతున్న మహిళల సంఖ్య అధికంగానే ఉంది. అలాంటివారు ప్రతిరోజు ఒక థైరాయిడ్ టాబ్లెట్ ను వేసుకుంటారు. అలా వేసుకోకపోతే థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా విడుదల కావు. ప్రతిరోజూ ఇలా థైరాయిడ్ మాత్రం వేసుకునే వారిలో భవిష్యత్తులో ఎముక నష్టం తప్పదని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఈ థైరాయిడ్ టాబ్లెట్లు త్వరగా ఎముకలు బలహీన పడేలా చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలను చికాగోలోని రేడియో లాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వార్షిక సమావేశంలో వివరించారు.


అధ్యయనం ఇలా
ఈ అధ్యయనంలో భాగంగా 450 మంది వృద్ధులను తీసుకొచ్చారు. వారికి థైరాయిడ్ టాబ్లెట్ వాడడం వల్ల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దాదాపు ఆరున్నరేళ్ల పాటు వారిపై ఈ పరిశోధన నిర్వహించారు. ఇందులో వారి శరీర ఎముక ద్రవ్యరాశి, సాంద్రత ఎక్కువగా కోల్పోయినట్టు గుర్తించారు. ఈ మందుల వల్ల సాధారణ పరిధిలోనే ఉన్నాయి. కానీ వారిలో ఎముకలు మాత్రం చాలా బలహీనంగా మారిపోయినట్టు గుర్తించారు.

థైరాయిడ్ సమస్యతో ఉన్నవారికి ఎక్కువగా లెవో థైరాక్సిన్ ఉన్న మందులను సూచిస్తారు. ఇవే ఎముకలను బలహీనపడి త్వరగా విరిగిపోయేలా చేస్తాయి. లైవో థైరాక్సిన్ అనేది థైరాయిడ్ హార్మోను అయినా థైరాక్సిన్ (టీ4) కు చెందిన సింథటిక్ రూపం ఇది. హైపోథైరాయిడిజం చికిత్సకు ఈ ట్యాబ్లెట్ అందిస్తారు. హైపోథైరాయిడింజలో థైరాయిడ్ హార్మోన్స్ స్థాయిలో తక్కువగా ఉత్పత్తి అవుతాయి. థైరాయిడ్ గ్రంధి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇలా టాబ్లెట్ ను సూచిస్తారు.


లైవో థైరాక్సిన్ అనేది మరికొన్ని రకాల మందుల్లో కూడా వినియోగిస్తూ ఉంటారు. దీన్ని శరీరం శోషించుకునేలా చేయడం కోసం ఉదయం పూట పరగడుపున వేసుకోమని చెబుతారు. ఇది థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యాన్ని కాపాడుతున్నప్పటికీ… ఎముకను మాత్రం దెబ్బతీస్తోంది. అందుకే ఎముకల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ప్రతిరోజూ ఒక టాబ్లెట్ వేసుకుంటారో వారు ఎముకల కోసం కాల్షియం నిండిన పదార్థాలను అధికంగా తింటూ ఉండాలి.

కాల్షియం నిండిన పదార్థాలు
ఎముక ఆరోగ్యం కోసం కాల్షియం, విటమిన్ డి… ఈ రెండు నిండుగా ఉండే ఆహారాలను తినాలి. క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. క్యాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం. కాబట్టి విటమిన్ డి నిండుగా ఉన్న పదార్థాలను కూడా తినాల్సిన అవసరం ఉంది. పెరుగు, పాలు, చీజ్ వంటి వాటిలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే చేపలు, గుడ్డు సొన వంటివి కూడా తినాలి. తృణధాన్యాలు నిండిన ఆహారాన్ని కూడా తింటూ ఉండాలి.

Also Read: జపనీస్ ప్రాణాంతక వ్యాధి ఇండియాకూ వచ్చేసింది, ఈ దోమ కుడితే చనిపోతారా? లక్షణాలేమిటీ?

మినప్పప్పులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముక బలానికి, ఎముక సాంద్రతకు అత్యవసరమైనవి. మినప్పప్పును తరుచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఆర్థరైటిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా కూడా అడ్డుకోవచ్చు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×