Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వే సంస్థ త్వరలో వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి తయారీ పూర్తయ్యింది. ట్రయల్ రన్ కూడా సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. త్వరలోనే ఈ రైలు ఫీల్ట్ ట్రయల్ కు వెళ్లనుంది. ఈ ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత, ప్రారంభం తేదీని ప్రకటిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో వందేభారత్ రైళ్ల గురించి ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వందేభారత్ స్లీపర్ రైళ్లను సుదూర ప్రయాణాలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపారు. ఆధునిక ఫీచర్లతో పాటు ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తాయని వెల్లడించారు. ఇంతకీ వందేభారత్ స్లీపర్ రైల్లో ఉన్న అత్యాధునిక ఫీచర్లు, ప్రయాణీకులకు కల్పించే సౌకర్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వందేభారత్ స్లీపర్ రైలులోని ప్రత్యేకతలు
⦿ వందేభారత్ స్లీపర్ రైల్లో భద్రతకు పెద్దపీట వేశారు. ఈ రైలు ‘కవాచ్’తో అమర్చబడింది.
⦿ EN-45545 HL3 ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ కు అనుకూలంగా ఈ రైలును రూపొందించారు.
⦿ క్రాష్‌వర్తీ, జెర్క్-ఫ్రీ సెమీ పర్మనెంట్ కప్లర్లు, యాంటీ క్లైంబర్లను కలిగి ఉంటుంది.
⦿ EN ప్రమాణాలకు అనుగుణంగా కార్ బాడీని రూపొందించారు.
⦿ వందేభారత్ స్లీప్ రైల్లో రీ జెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ను అమర్చారు.
⦿ లేటెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా సడెన్ బ్రేకులు వేసే అవకాశం ఉంటుంది.
⦿ ఈ రైలు క్షణాల్లో అత్యంత వేగాన్ని అందుకోవడంతో పాటు అంతే ఫాస్ట్ గా రైలును ఆపే అవకాశం ఉంటుంది.
⦿ అత్యవసర పరిస్థితుల్లో ప్యాసింజర్లు రైలు మేనేజర్, లోకో పైలట్ తో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రైల్లో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ను అమర్చారు.
⦿ ప్రతి కోచ్ లో ప్రయాణీకులకు టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి.
⦿ ఈ రైల్లో ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, పూర్తిగా సీల్ చేయబడిన గ్యాంగ్ వేలు ఉంటాయి.
⦿ ఎర్గోనామిక్ గా రూపొందించిన ల్యాడర్ సాయంతో పై బెర్త్ లకు సులభంగా ఎక్కే అవకాశం ఉంటుంది.
⦿ ఎయిర్ కండిషనింగ్, సెలూన్ లైటింగ్ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తాయి.
⦿ ఈ రైలులోని అన్ని కోచ్‌లలో సీసీటీవీ నిఘా కెమెరాలు ఉంటాయి.
Read Also: స్పీడు పెంచిన వందే భారత్.. ఈ రూట్లో మరింత వేగంగా గమ్యానికి, ఎంత టైమ్ తగ్గుతుందంటే..
దేశవ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు
అటు డిసెంబర్ 2, 2024 నాటికి దేశ వ్యాప్తంగా 136 కార్ కోచ్ లతో కూడిన వందేభారత్ రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు తమిళనాడు లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ- బనారస్ మధ్య అత్యధికంగా 771 కిలో మీటర్ల మేర వందేభారత్ రైలు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయా రూట్లలో వందేభారత్ రైళ్ల బోగీల సంఖ్యలను పెంచనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: వందే భారత్ లో ఇక పార్సెల్ కూడా పంపుకోవచ్చు, గంటల్లోనే డెలివరీలు!