BigTV English

Ashwini Vishnaw: వెయిటింగ్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లో వెళ్తున్నారా? కేంద్ర మంత్రి సీరియస్ వార్నింగ్!

Ashwini Vishnaw: వెయిటింగ్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లో వెళ్తున్నారా? కేంద్ర మంత్రి సీరియస్ వార్నింగ్!

Indian Railways New Rule: రద్దీ సమయాల్లో చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నా పెద్ద మొత్తంలో వెయిటింగ్ లిస్టు ఉంటుంది. అయినప్పటికీ.. చాలా మంది రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణిస్తుంటారు. టీసీ వస్తే ఫైన్ కడతారు. లేదంటే, ఖాళీగా ఉన్న సీటును రిజర్వ్ చేయించుకుంటారు. ఇకపై వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణీకులు రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణించకూడదని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు. ఈ మేరకు పార్లమెంట్ లో కీలక విషయాన్ని వెల్లడించారు.


వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులు రిజర్వేషన్ కోచ్ లో వెళ్లకూడదు- వైష్ణవ్   

గత కొంతకాలంగా రిజర్వేషన్ కోచ్ లలో, కన్ఫార్మ్ టికెట్ లేని ప్రయాణీకులు ఎక్కువగా జర్నీ చేస్తున్నారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ కోచ్ లలోకి ఇతర ప్రయాణీకులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా పార్లమెంట్ లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రస్తావించారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణీకులు రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణిస్తే ఎలాంటి చర్యలు తీసకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ ప్రశ్నకు స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులు రిజర్వేషన్ కోచ్ లలో జర్నీ చేసేందుకు అనుమతి లేదన్నారు.


Read Also:హైపర్‌లూప్ ట్రైన్ టెస్టింగ్ ట్రాక్ సిద్ధం చేసిన ఐఐటీ మద్రాస్.. రెప్పపాటులో గమ్యానికి చేరిపోవచ్చట!

వెయిటింగ్ టికెట్‌ రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణిస్తే?

వెయిటింగ్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. జరిమానా విధించడంతో పాటు నెక్ట్స్ స్టేషన్ లో డీబోర్డ్ చేయనున్నట్లు చెప్పారు. జరిమానా అనేది స్టార్టింగ్ స్టేషన్ నుంచి ట్రావెల్ పాయింట్ వరకు కనీస ఛార్జీతో పాటు ఆయా కోచ్ ను బట్టి మారుతూ ఉందన్నారు. ఒకవేళ ఏసీ కోచ్ లో ప్రయాణిస్తే టికెట్ ఛార్జీతో పాటు అదనంగా రూ. 440 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వెయిటింగ్ టికెట్లను కలిగి ఉన్న ప్రయాణీకులు సాధారణ కోచ్‌ లో ప్రయాణించే అవకాశం ఉందన్నారు. జనరల్ కోచ్ లో ప్రయాణించడానికి రిజర్వేషన్ అవసరం లేదన్నారు. వెయిటింగ్ టికెట్లు ఉన్నవాళ్లు రైలు బయలుదేరడానికి కనీసం అరగంట ముందు  టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని ఆయన సూచించారు.

ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ.. 

వాస్తవానికి రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌ లు, స్లీపర్ కోచ్‌ లు, జనరల్ బోగీలు ఉంటాయి. ఏసీ, స్లీపర్ కోచ్‌ లలో కన్ఫార్మ్ టికెట్ ఉన్నవాళ్లు మాత్రమే ప్రయాణించాలి. జనరల్ టికెట్ తీసుకున్న వాళ్లు జనరల్ బోగీల్లో ఎక్కాలి. కానీ, గత కొంతకాలంగా రిజర్వేషన్ కోచ్ లలో రిజర్వేషన్ లేని ప్రయాణీకులు, వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కన్ఫార్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు సౌత్ రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా కేరళ, తమిళనాడులో చాలా మంది కన్ఫార్మ్ టికెట్ లేకపోయినా రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణిస్తున్నారు.ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే, కన్ఫార్మ్ టికెట్ లేని వాళ్లు రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణించకూడదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరించారు.

Read Also: స్పీడు పెంచిన వందే భారత్.. ఈ రూట్లో మరింత వేగంగా గమ్యానికి, ఎంత టైమ్ తగ్గుతుందంటే..

Related News

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Big Stories

×