E-Paper
Advertisement

Fall in Love: విద్యార్థులూ ప్రేమలో పడండి.. ఆ యూనివర్శిటీ ప్రకటనపై అంతా షాక్, కారణం ఇదేనట!

Fall in Love: విద్యార్థులూ ప్రేమలో పడండి.. ఆ యూనివర్శిటీ ప్రకటనపై అంతా షాక్, కారణం ఇదేనట!
Advertisement

Go Fall in Love: విద్యార్థులను ప్రయోజకులుగా మార్చాడంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. యువతకు విద్యాబుద్దులు నేర్పి భావి పౌరులను తీర్చిదిద్దుతాయి. సెలవులు వస్తే చక్కగా చదువుకోవాలని సూచిస్తుంటాయి. కానీ, ఓ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో చర్చకు కారణం అయ్యింది. ఇంతకీ ఆ యూనివర్సిటీ చేసిన పని ఏంటంటే..

సెలవులలో ప్రేమలో పడండి!

చైనాలో వివాహాలను పెంచాలనే ఉద్దేశంతో డ్రాగన్ సర్కారు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది. జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ఎలాగైనా పెంచాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఓ చైనా విశ్వవిద్యాలయం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను ప్రేమలో పడాలని ప్రోత్సహిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి 6 వరకు చైనాలో వసంతకాలపు సెలవులను ఇవ్వనున్నారు. ఈ సమయంలో “పువ్వులను చూడండి, ప్రేమను ఆస్వాదించండి” అని ప్రచారం మొదలుపెట్టింది. సిచువాన్ సౌత్‌ వెస్ట్ వొకేషనల్ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ తన అధికారిక వీచాట్ అకౌంట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది.

చైనాలో సరికొత్త సెలవులు  

Advertisement

ప్రతి ఏటా సంప్రదాయంగా వేసవి, శీతాకాల సెలవులతో పాటు విద్యాలయాలకు వసంత, శరత్కాలపు సెలవులను కూడా ప్రవేశపెడతామని చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సదరు యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పుస్తకాలు పక్కన పెట్టాలని సూచిస్తూ ఈ ప్రకటన చేసింది. ప్రేమలో మునిగితేలాలని పిలుపునిచ్చింది. సిచువాన్, తూర్పు జియాంగ్సు లాంటి ప్రావిన్సులు, సుజౌ, నాన్జింగ్ లాంటి  నగరాలు వసంతకాలపు సెలవుల కోసం ఇప్పటికే ప్రణాళికలను వెల్లడించాయి.

ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటి?

చైనాలో ప్రస్తుతం 140 కోట్ల జనాభా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణ, వినోద కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచాలని చైనీస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరింత తీరిక సమయాన్ని అందించడం ద్వారా యువతను ప్రేమలో పడేలా చేయాలని, ఫలితంగా వివాహాలను పెంచాలని భావిస్తోంది. 2025లో జననాల రేటు భారీగా పడిపోయింది. జనాభా వరుసగా నాలుగో ఏడాది కూడా తగ్గింది. ఇది మరింత క్షీణతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరించారు. మళ్లీ జనాభా పెంచాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే పిల్లలకు అనుకూలమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి బీజింగ్  గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. జాతీయ అభివృద్ధి, సంస్కరణల కమిషన్ (NDRC) వీటిని రీలీజ్ చేసింది.

Advertisement

Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

విద్య, ఆరోగ్యం నుంచి ప్రయాణం, క్రీడలు, వినోదం వరకు వివిధ రంగాలలో ప్రజా సేవలను మెరుగుపరచడం ద్వారా పిల్లలకు అనుకూలమైన నగరాలను తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచనలు చేసింది. పిల్లలను పెంచడానికి సమాజానికి తగినంత సమయం, డబ్బు ఉండాలని చైనా ట్రావెల్ కంపెనీ ట్రిప్ సహ వ్యవస్థాపకుడు జేమ్స్ లియాంగ్ అన్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చకు కారణం అయ్యింది. కొంత మంది ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుందని కొంత మంది నెటిజన్లు అంటే, ఇదేం విచిత్రం అని మరికొంత మంది పెదవి విరుస్తున్నారు.

Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×