Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నా, కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడప్పుడు రైళ్లు రద్దు కావడం వల్ల అత్యవసర పనుల మీద వెళ్లే వారు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. తాజాగా రైలు ఆలస్యం కావడం కారణంగా ఓ ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్లకపోగా, రిటర్న్ టికెట్ రద్దు చేసుకోవాల్సి వచ్చిందిని ఓ ప్రయాణీకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం సదరు ప్రయాణీకుడికి అన్ని ఖర్చులు కలుపుకుని రూ. 24, 617 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
2022 అక్టోబర్ 8 ఉత్తర ప్రదేశ్ కు చెందిన షలీన్ సునేజా, సుబ్రమణియన్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో న్యూఢిల్లీకి ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఓ యూనివర్సిటీలో జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వాళ్లు హాజరు కావాల్సి ఉంది. పొద్దున్నే ఈ రైల్లో వెళ్లి, కార్యక్రమాన్ని చూసుకుని.. సాయంత్రం శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో తిరిగి రావాలని భావించారు. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్: 22436) ఆలస్యం అయ్యింది. ఈ నేపథ్యంలో వాళ్లు వెళ్లలేకపోయారు. ట్రిప్ ను పూర్తిగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అటు శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించి టికెట్ ను కూడా క్యాన్సిల్ చేసుకోలేకపోయారు. మొత్తంగా డబ్బులు కోల్పోవడంతో పాటు మానసికంగా ఇబ్బంది పడ్డామని న్యూఢిల్లీలోని వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
బాధితులకు రూ. 24 వేలు చెల్లించాలన్న న్యాయస్థానం
ఇరు పక్షాలు రికార్డులు పరిశీలించి, వాదనలు విన్న న్యాయస్థానం.. బాధితులకు రూ.24,617.90 పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. టికెట్ ఖర్చులకు అయిన రూ.3,617.90 రీఫండ్‌కు అర్హులని వెల్లడించింది. ఈ సంఘటనతో కలిగిన మానసిక వేదన కారణంగా మరో రూ. 20,000 వెల్లించాలని ఆదేశించింది. అటు కోర్టు కేసు ఖర్చుల కోసం రూ. 1,000 అందజేయాలని ఉత్తర రైల్వే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్డర్ కాపీ అందిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా ఫిర్యాదుదారులకు మొత్తాన్ని అందజేయాలని ఆదేశించింది. గడువులోపు డబ్బులు ఇవ్వకపోతే సంవత్సరానికి 12 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.
Read Also: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మతి పోతుంది, ఎంత వేగంతో దూసుకెళ్తుందంటే?
అటు రైల్వేలు సర్వీస్‌ల కొరత కారణంగా ఆలస్యం జరగలేదని రైల్వే సంస్థ తన వాదనలను వినిపించింది. అయితే, వినియోగదారుల న్యాయస్థానం ఫిర్యాదుదారుల వాదనలను సమర్థించింది. రైలు ఆలస్యం కారణంగా ప్రయాణీకులు చాలా సమస్యలు పడాల్సి వచ్చిందని వెల్లడించింది. ఫిర్యాదుల నిర్వహణలో మరింత కస్టమర్-సెంట్రిక్ విధానం అవసరమని సూచించింది. రైల్వేలు ఇలాంటి కేసులను వివాదాస్పద వ్యాజ్యాలుగా పరిగణించకూడదని న్యాయస్థానం వెల్లడించింది. ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిన సందర్భాల్లో ఆ సమస్యను వివాదం లేకుండా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సూచించింది.
Read Also: లాస్ట్ మినిట్ లో జర్నీ క్యాన్సిల్? మీ ట్రైన్ టికెట్ ను వేరే వాళ్లకు ఇలా ట్రాన్సఫర్ చేయొచ్చని తెలుసా?