Indian Railway Tticket Transfer Rules: చాలా మంది ముందుగానే రైలు ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. వాటికి అనుగుణంగా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. కొన్ని అనివార్య కారణాలతో చివరి క్షణంలో ప్రయాణాలు క్యాన్సిల్ అవుతాయి. అలాంటి సమయంలో చాలా మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటారు. టైమ్ తక్కువగా ఉండటంతో తక్కువ మొత్తంలో టికెట్ డబ్బులు రీఫండ్ అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే మన టికెట్ ను వేరొకరి పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, టికెట్ ట్రాన్స్ ఫర్ అనేది ఎవరికి పడితే వాళ్లు చేస్తామంటే కుదరదు. వాళ్లు కచ్చితంగా మన కుటుంబ సభ్యులు అయి ఉండాలి. అలాగే ఆన్‌డ్యూటీలో ప్రయాణాలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ టికెట్ ను తోటి ఉద్యోగికి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు కూడా వేరొక విద్యార్థి పేరు మీదకి టికెట్ ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, సదరు విద్యా సంస్థకు చెందిన ప్రిన్స్ పాల్ నుంచి ఇందుకు సంబంధించిన అనుమతి పత్రాన్ని రైల్వే కౌంటర్ లో అందించాల్సి ఉంటుంది. అటు ఎన్‌సీపీ క్యాడెట్స్ కూడాతమ హెడ్ అనుమతితో టికెట్ ను వేరే వారికి బదిలీ చేసే అవకాశం ఉంటుంది.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందే భారత్ రైళ్ల కోచ్ లు పెరుగుతున్నాయ్!
ఇంతకీ ట్రైన్ టికెట్ ఎలా ట్రాన్స్ ఫర్ చేయాలంటే?
టికెట్ ట్రాన్స్ ఫర్ సదుపాయం టికెట్ కన్ఫామ్ అయిన వారికి మాత్రమే లభిస్తుంది. మనం ప్రయాణించాల్సిన రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు టికెట్ ను ఇతరుల పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చేయడానికి అవకాశం లేదు.
⦿ ముందుగా కన్ఫర్మ్ అయిన టికెట్ ను ప్రింట్ తీసుకోవాలి.
⦿ కన్ఫామ్ అయిన టికెట్ ను ప్రింట్ తీసుకుని, మీ టికెట్ ను ఎవరి మీదికి మార్చాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డులో ఏదో ఒకటి తీసుకెళ్లాలి.
⦿ ఈ పత్రాలను తీసుకొని దగ్గర లోని రైల్వే స్టేషన్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి.
⦿ అక్కడ టికెట్ ట్రాన్స్ ఫర్ చేయాలని కోరుతూ మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. మీ దగ్గర ఉన్న టికెట్ ప్రింట్ తో పాటు, ట్రాన్స్ ఫర్ చేయాల్సిన వారి గుర్తింపు వివరాలను సమర్పించాలి.
⦿ వారు మీ వివరాలను పరిశీలించి టికెట్ ను ట్రాన్స్ ఫర్ చేస్తారు.
టికెట్ ట్రాన్స్ ఫర్ అనేది ఒకేసారి కుదురుతుంది. మరోసారి ట్రాన్స్ ఫర్ చేసిన తర్వాత వేరొకరికి చేయడం కుదరదు. అందుకే, టికెట్ ట్రాన్స్ ఫర్ చేసే ముందుకు ఒకటి రెండుసార్లు ఆలోచించి చేయాలి. ప్రతి ఏటా ఎంతో మంది ఈ సర్వీస్ ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: జస్ట్ రూ. 35 పైసలకే రైల్వే ఇన్సూరెన్స్.. ఎంత మొత్తం చేతికి వస్తుందంటే?