Sravanthi Chokarapu: యాంకర్ స్రవంతి చోకవరపు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలగలిపిన యాంకర్స్ లో స్రవంతి కూడా ఒకరు. అల్లు అర్జున్ తో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఒక్కసారిగా స్రవంతి స్టార్ గా మారింది. ఇక దీని తరువాత అమ్మడి రేంజే మారిపోయింది.
స్టార్ హీరోస్ ఈవెంట్స్ అన్ని సుమ చేతికి వెళ్లగా.. కొంతమంది చిన్న హీరోల ఈవెంట్స్ కు స్రవంతినే యాంకర్ బాధ్యతలను తీసుకుంటుంది. ఆ గుర్తింపుతోనే ఈ చిన్నది బిగ్ బాస్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో స్రవంతి కంటెస్టెంట్ గా పాల్గొని మంచి కంటెంట్ ఇచ్చింది.
ప్రస్తుతం ఒక పక్క ఈవెంట్స్.. ఇంకోపక్క షోస్ తో బిజీగా మారింది. అయితే తాజాగా స్రవంతి అనారోగ్యం పాలైంది. ఈ విషయం ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. డబ్బు కోసం, షూటింగ్స్ అంటూ తిరిగి హెల్త్ ను పట్టించుకోకుండా వదిలేసి చివరకు హాస్పిటల్ బెడ్ పై ఉన్నట్లు ఆమె తెలిపింది. ఈ పోస్ట్ కేవలం మహిళల అవగాహన కోసమే పెడుతున్నట్లు ఆమె తెలిపింది.
Robinhood Teaser: రాబిన్ హుడ్.. వాడికి పర్టిక్యులర్ జెండా, ఎజెండా ఏది ఉండదు
” అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పెట్టక తప్పలేదు,కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే.స్పెషల్ గా “ఆడవారికోసం” గత 35 – 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్.రకరకాల మెడిసిన్ వాడాను,డాక్టర్ ని డైరెక్ట్ గా వెళ్లి కంసల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేపించుకోలేదు.
ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది,విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ ని కంసల్ట్ అయ్యాను.అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని,వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీ కి వెళ్లాల్సి వచ్చింది.ఈజీ గా కంప్లీట్ గా రికవర్ అవ్వాలి, ముందులాగ నడవాలి అంటే ఒక 4 నుండి 5 వారాలు పడ్తది అని చెప్పారు డాక్టర్.
Unstoppable With NBK: ఎప్పుడు నాది ఒకటే మాట.. ఆయన బంగారం.. అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు
సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే.అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేసాను. మళ్లీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి. అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే,హెల్త్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ.
వర్క్, షూట్స్ ,ఈవెంట్స్ అని కుదరక నెగ్లెట్ చెయ్యకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి.ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.త్వరలోనే నేను కోలుకొని స్ట్రాంగ్ గా తిరిగి వస్తాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. స్రవంతి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.