Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది. రోజూ కోట్లాది మంది ప్రయాణీకులు రైలు ప్రయాణం చేస్తున్నారు. చౌక ధరలో, కంఫర్ట్ గా ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది రైలు జర్నీని ఎంచుకుంటున్నారు. ఇక రైల్వే సంస్థ కూడా ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సేవలను కల్పించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఓ కీలకమైన రైల్వే రూల్ గరించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టికెట్ లేకుండా రైలు ఎక్కినా నో ప్రాబ్లం!
రైలు ప్రయాణం చేసే వాళ్లలో చాలా మంది ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకుంటారు. మరికొంత మంది రైల్వే స్టేషన్ లోని టికెట్ కౌంటర్ లో టికెట్ కొనుగోలు చేస్తారు. కొంత మంది టికెట్ లేకుండానే రైలు ఎక్కుతారు. టికెట్ లేకుండా రైలు ఎక్కిన వాళ్లు మధ్యలో టీసీకి దొరికితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవసరం అయితే జైలు శిక్ష కూడా విధిస్తారు. ఈ నేపథ్యంలో టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణీకుల కోసం రైల్వే సంస్థ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. టికెట్ లేకుండా రైలు ఎక్కినా ఎలాంటి పెనాల్టీ లేకుండా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.
ప్లాట్ ఫారమ్ టిక్కెట్ ఉంటే చాలు!
అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే, మీరు టికెట్ రిజర్వేషన్ చేయకపోయినా, ఫ్లాట్ ఫారమ్ టికెట్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఫ్లాట్ ఫారమ్ టికెట్ తీసుకొని రైలు ఎక్కాలి. రైల్లోనే మీరు టికెట్ పొందే అవకాశం ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం, టికెట్ లేకున్నా ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు రైలు ఎక్కిన వెంటనే టీసీని కలవాలి. మీ దగ్గర ఉన్న ఫ్లాట్ ఫారమ్ టికెట్ ను తనకు చూపించాలి. ఆ టికెట్ ప్రకారం మీరు దిగాల్సిన స్టేషన్ కు వరకు ఆయన నుంచి టికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణీకుడు ఎక్కడ ప్లాట్ ఫారమ్ టిక్కెట్ తీసుకున్నాడో అదే స్టేషన్ నుంచి ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. టీసీ ఎలాంటి ఫైన్ విధించే అవకాశం లేదు. అంతేకాదు, ఈ ప్రయాణాన్ని నేరంగా పరిగణించరు కూడా.
Read Also: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మతి పోతుంది, ఎంత వేగంతో దూసుకెళ్తుందంటే?
అడ్వాన్స్ డ్ టికెట్ బుకింగ్ గడువు తగ్గింపు
ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు నింబంధనలను మారుస్తూనే ఉంటుంది. రీసెంట్ గా టికెట్ బుకింగ్ వ్యవధిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు రైల్వే టికెట్ బుకింగ్ 120 రోజుల ముందు నుంచే చేసుకునే అవకాశం ఉండేది. కానీ, కొత్త నిబంధన ప్రకారం, ఈ కాల పరిమితి 60 రోజులకు తగ్గించింది. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
Read Also: లాస్ట్ మినిట్ లో జర్నీ క్యాన్సిల్? మీ ట్రైన్ టికెట్ ను వేరే వాళ్లకు ఇలా ట్రాన్సఫర్ చేయొచ్చని తెలుసా?