Cyclone Disrupts Railway Services: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో మొత్తం 64కు పైగా రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వీటిలో కోస్తా ఆంధ్ర పరిధిలోనే సుమారు 53 సర్వీసులు ఉండగా, మరో 11 ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా రద్దయ్యాయి. తుఫాన్ కారణంగా రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే రైళ్ల వివరాలను తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం, కాకినాడ, భువనేశ్వర్, హౌరా లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రద్దయిన రైళ్లు ఏవంటే..
⦿ గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్: హైదరాబాద్ – విశాఖపట్నం
⦿ ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్: సికింద్రాబాద్ – హౌరా
⦿ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్: సికింద్రాబాద్ – విశాఖపట్నం
⦿ విశాఖ ఎక్స్ ప్రెస్: సికింద్రాబాద్ – భువనేశ్వర్
⦿ కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్: లింగంపల్లి – కాకినాడ టౌన్
⦿ గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్: లింగంపల్లి – కాకినాడ పోర్ట్
⦿ లింగంపల్లి – నర్సాపూర్ ఎక్స్ ప్రెస్
⦿ మహబూబ్‌నగర్ – విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
⦿ నాగావళి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: హజూర్ సాహిబ్ నాందేడ్ – సంబల్‌పూర్
⦿ చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్ ప్రెస్
ఈ రైళ్లలో ప్రయాణించాల్సిన వారు తమ రైలు నంబర్, ప్రయాణ తేదీ ఆధారంగా క్యాన్సిలేషన్ వివరాలను కన్ఫార్మ్ చేసుకోవాలి. రైళ్ల పేర్లు, రూట్లు మాత్రమే చూసి ప్రయాణం కొనసాగించకూడదు.
తుఫాన్ తీవ్రత, వర్షాల పరిస్థితి, రైల్వే ట్రాక్‌ల భద్రతను బట్టి అధికారులు మరికొన్ని రైళ్లను దారి మళ్లించే అవకాశం ఉంది. కొన్ని సర్వీసులను పాక్షికంగా రద్దు చేయడం లేదంటే గమ్యస్థానానికి ముందే నిలిపివేసూ అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి రైల్వే శాఖ తాజా నిర్ణయాలు తీసుకుంటోంది.
ప్రయాణానికి బయలుదేరే ముందు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) వెబ్‌సైట్‌లో రైలు స్టేటస్‌ను తనిఖీ చేసుకోవాలి. రైల్వే శాఖ అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండాలి. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
Read Also: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 100కు పైగా రైళ్లు రద్దు!