E-Paper
Advertisement

ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులు ఏం చేయాలంటే?

ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులు ఏం చేయాలంటే?
Advertisement

Cyclone Flight Alert: తుఫాన్ ప్రభావంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. మారుతున్న వాతావరణ పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ప్రయాణికుల భద్రతపై అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు, వాతావరణ శాఖ, విమానయాన సంస్థలు, విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని విమానాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విమానయాన సంస్థల కీలక ప్రకటన

⦿ తుఫాన్ కారణంగా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసుల్లో మార్పులు చేశాయి. ఎయిర్ ఇండియా అక్టోబర్ 27న ఢిల్లీ–విశాఖపట్నం–ఢిల్లీ మార్గంలో, అక్టోబర్ 28న ఢిల్లీ–విజయవాడ–ఢిల్లీ మార్గంలో ఆరు విమానాలను రద్దు చేసింది.

Advertisement

⦿ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా విశాఖపట్నం నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు నడిచే సర్వీసులతో పాటు మొత్తం 13 విమానాలను రద్దు చేసింది. వీటిలో వారణాసి–బ్యాంకాక్, బ్యాంకాక్–విశాఖపట్నం సర్వీసులు కూడా ఉన్నాయి.

⦿ ఇండిగో సంస్థ విశాఖపట్నంలో విమాన కార్యకలాపాలను నిలిపివేయగా, అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటల తర్వాత విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లోనూ సర్వీసులను నిలిపివేసింది.

Advertisement

⦿ మరోవైపు, అక్టోబర్ 28న ఢిల్లీ–భోగాపురం–ఢిల్లీ మార్గంలో ఆకాశ ఎయిర్ తన సర్వీసును రద్దు చేసింది.

⦿అలయన్స్ ఎయిర్ మాత్రం ఎలాంటి రద్దులు ప్రకటించకుండా కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

ప్రయాణికులకు కీలక సూచనలు

విమానాలు రద్దయినా, ఆలస్యమైనా ప్రయాణికులకు ముందుగానే సమాచారం అందించాలని కేంద్రం విమానయాన సంస్థలను ఆదేశించింది. టికెట్ నిబంధనల ప్రకారం రీఫండ్ లేదంటే మరో తేదీకి ప్రయాణాన్ని మార్చుకునే అవకాశం కల్పించాలని సూచించింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు సంబంధిత సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదంటే హెల్ప్‌ లైన్ ద్వారా విమానం స్టేటస్‌ ను చెక్ చేసుకోవాలి. విమానం నడుస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే విమానాశ్రయానికి వెళ్లాలని అధికారులు సూచించారు.

అదనపు సహాయం అవసరమైన వారికి ప్రాధాన్యం

వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులు, వైద్య సహాయం అవసరమైన వారికి ప్రత్యేకంగా సహకరించాలని విమానాశ్రయ అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో విమానాశ్రయాలకు చేరుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురుకావచ్చని హెచ్చరించారు. విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోతే ప్రయాణికులు ఎయిర్‌ సేవా పోర్టల్ లేదంటే యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరాన్ని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

Read Also: ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖ నుంచి విజయవాడ వరకు ఎన్ని ఫ్లైట్స్ రద్దు అయ్యాయంటే?

Tags

Related News

భారత పైలట్ ధైర్యానికి యూఏఈ ఫిదా.. అత్యున్నత పురస్కారంతో సత్కారం!

ఒకసారి కాదు.. మూడు సార్లు పెళ్లి చేసుకునే అమ్మాయిలు! ఆ ప్రాంతంలో వింత సంప్రదాయం

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖ నుంచి విజయవాడ వరకు ఎన్ని ఫ్లైట్స్ రద్దు అయ్యాయంటే?

అర్నబ్ కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో 64 రైళ్లు క్యాన్సిల్!

అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 100కు పైగా రైళ్లు రద్దు!

జంతువుల కోసం ఫ్లైఓవరా? కెనడా చేసిన ఈ పనికి.. యావత్ ప్రపంచమే ఫిదా!

అర్నాబ్ తుపాన్ ఎఫెక్ట్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో 16 విమాన సర్వీసులు రద్దు!

Big Stories

Advertisement
×