E-Paper
Advertisement

అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 100కు పైగా రైళ్లు రద్దు!

అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 100కు పైగా రైళ్లు రద్దు!
Advertisement

100 Trains Cancelled: బంగాళాఖాతంలో ఏర్పడిన  అర్నబ్  తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పలు రైళ్లను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో 100కు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, దక్షిణ కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే సుమారు 53 నుంచి 64 రైళ్ల సర్వీసులను నిలిపివేసింది. అక్టోబర్ 28తో పాటు కొన్ని మార్గాల్లో నవంబర్ 4 వరకు ఈ క్యాన్సిలేషన్స్ అమల్లో ఉండనున్నాయి.

వందే భారత్ సహా కీలక రైళ్లు రద్దు

తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు 20707, 20708, 20833, 20834 ఇవాళ  క్యాన్సిల్ అయ్యాయి. వీటితో పాటు సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ ప్రెస్ (12704), గోదావరి ఎక్స్‌ ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్, రత్నాచల్ ఎక్స్‌ ప్రెస్, ఉదయ్ ఎక్స్‌ ప్రెస్ లాంటి రైళ్లపైనా ప్రభావం పడింది. రూర్కెలా-జగదల్‌పూర్, హౌరా-జగదల్‌పూర్ మార్గాల్లో నడిచే రైళ్లతో పాటు విశాఖపట్నం-విజయవాడ, కాకినాడ పోర్ట్‌-విశాఖపట్నం మధ్య నడిచే పలు మెము ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దయ్యాయి.

ప్రయాణికులకు అధికారుల కీలక సూచనలు

Advertisement

రైళ్ల రద్దు, దారి మళ్లింపుల కారణంగా ప్రయాణికులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. స్టేషన్‌కు బయలుదేరే ముందు తమ రైలు నడుస్తుందా? లేదా? అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ఇందుకోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) వెబ్‌ సైట్‌ ను చెక్ చేయాలని సూచించారు.  తుఫాన్ పరిస్థితులను బట్టి కొన్ని రైళ్లను దారి మళ్లించడం, మరికొన్ని రైళ్లను గమ్యస్థానానికి ముందే నిలిపివేయడం లాంటి మార్పులు కూడా ఉండవచ్చు. అందువల్ల రైల్వే శాఖ అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించడం మంచిదన్నారు.

టికెట్ రద్దు, రీఫండ్ వివరాలు..

రైల్వే రద్దు చేసిన రైళ్లలో ప్రయాణించాల్సిన ప్యాసింజర్స్ టికెట్ రద్దు, రీఫండ్‌ కు సంబంధించిన రూల్స్ తెలుసుకోవాలి.  అర్హత ఉన్న టికెట్లకు వర్తించే నిబంధనల ప్రకారం రీఫండ్ పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం రైల్వే స్టేషన్లలోని విచారణ కౌంటర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల మీదుగా ప్రయాణించేవారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. ప్రయాణికులు అధికారిక సమాచారాన్ని బేస్ చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

Read Also: అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. విమాన ప్రయాణికులకు కీలక అలర్ట్!

Tags

Related News

ఒకసారి కాదు.. మూడు సార్లు పెళ్లి చేసుకునే అమ్మాయిలు! ఆ ప్రాంతంలో వింత సంప్రదాయం

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖ నుంచి విజయవాడ వరకు ఎన్ని ఫ్లైట్స్ రద్దు అయ్యాయంటే?

అర్నబ్ కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో 64 రైళ్లు క్యాన్సిల్!

జంతువుల కోసం ఫ్లైఓవరా? కెనడా చేసిన ఈ పనికి.. యావత్ ప్రపంచమే ఫిదా!

అర్నాబ్ తుపాన్ ఎఫెక్ట్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో 16 విమాన సర్వీసులు రద్దు!

టోల్ ప్లాజా సమీపంలో నివసిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్!

ఎటుచూసినా బంగారమే బంగారం.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోల్డ్ వాక్‌వే..

Big Stories

Advertisement
×