Babar Azam Checks Pavan Rathnayake Bat: వన్డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026) నేపథ్యంలో నిన్న శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs Sri Lanka, 5th Match) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంక ఓడించింది. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత బాబర్ ఆజం చేసిన ఓ పని వివాదంగా మారింది. శ్రీలంక ఆటగాడు పవన్ రత్నాయకే ( Pavan Rathnayake) బ్యాట్ తీసుకొని బాబర్ ఆజం (Babar Azam) చెక్ చేశాడు. అందులో స్ప్రింగ్ లు ఉన్నాయా? లేదా ఏఐ చిప్స్ పెట్టారా ? అనే అనుమానంతో బ్యాట్ తిప్పి, తప్పి వెతికేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో బాబర్ ఆజం పైన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి.
శ్రీలంక జట్టును అవమానించేందుకే బ్యాట్లను బాబర్ ఆజం చెక్ చేశాడని చేశాడని ఆగ్రహిస్తున్నారు ఫ్యాన్స్. అలా బ్యాట్లు తీసుకొని చెక్ చేయాలని ఎవడు చెప్పాడని నిలదీస్తున్నారు. పిలిచి మరీ, లంకను అవమానించారని ఆగ్రహిస్తున్నారు. పవన్ రత్నాయకే ( Pavan Rathnayake) బ్యాట్ లాగేసుకున్న బాబర్ ఆజంపైన ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకోవాలని శ్రీలంక అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన పై పాకిస్థాన్ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సరదాగానే శ్రీలంక ఆటగాళ్లతో బాబర్ ఆజం మాట్లాడాడని… ఈ క్రమంలోనే బ్యాట్ తీసుకున్నాడని పేర్కొంటున్నారు. ఇరు ప్లేయర్ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్న నేపథ్యంలోనే బాబర్ ఆజం బ్యాట్ పట్టుకున్నాడు తప్ప మరో ఉద్దేశం లేదని కౌంటర్ ఇస్తున్నారు. దీంతో బాబర్ ఆజం బ్యాట్ పట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా మంగళవారం పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య ఐదవ వన్డే జరిగింది. ఈ ట్రై సిరీస్ లో ఫైనల్ కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి శ్రీలంకకు తలెత్తింది. దీంతో నిన్న జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును ఉతికారేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ను 110 పరుగులకే ఆల్ అవుట్ చేసిన శ్రీలంక.. ఆ తర్వాత చేజింగ్ లో 18 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. దీంతో పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ టోర్నమెంట్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్ కాగా.. శ్రీలంక ఫైనల్ కు చేరింది. అక్టోబర్ 31వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఇదే వేదికగా ఉంటుంది.
Babar Azam was seen checking Pawan Rathnayake’s willow 😍 #pakvsl pic.twitter.com/LXOxOb9Ijp
— Nibraz Ramzan (@nibraz88cricket) October 27, 2026