భారతీయులంతా గౌరవంగా చూసే వాళ్లలో మొదటి స్థానంలో ఉంటారు ఆర్మీ జవాన్లు. ప్రాణాలను పణంగా పెట్టి దేశ సేవ కోసం పాటుపడే సైనికులకు ఎవరికీ ఇవ్వనంత రెస్పెక్ట్ ఇస్తారు. కానీ, అందులోనూ కొంతమంది చిల్లర వ్యక్తులు ఉన్నట్లు అప్పుడప్పుడు బయటపడుతుంది. తాజాగా ఇలాంటి ఘటన జీలం ఎక్స్ ప్రెస్ లో జరిగింది. ఇందులో ఓ సైనకుడు చేసిన ఘన కార్యానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..
తాజాగా జీలం ఎక్స్ ప్రెస్ లో టీటీఈగా నటించి ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియో గత వారం రోజులుగా వైరల్ అవుతోంది. ఆ మోసగాడిని ఆర్మీ జవాన్ గా గుర్తించారు రైల్వే పోలీసులు. ఆర్పీఎఫ్ సిబ్బందిని అరెస్ట్ చేసి గ్వాలియర్ స్టేషన్ లో ప్రభుత్వ రైల్వే పోలీసులకు (జీఆర్‌పీ) అప్పగించారు. వైరల్ వీడియోలో సదరు సైనికుడు వెయిటింగ్ లిస్టు టిక్కెట్లు ఉన్నవారికి బెర్తులు ఇస్తానని చెప్పి డబ్బులు వసూళు చేస్తూ కనిపించాడు. ఈ క్లిప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ విషయం ఆర్‌పీఎఫ్ అధికారులకు తెలియడంతో వెంటనే వాళ్లు సదరు వ్యక్తి డబ్బులు వసూళు చేస్తున్న కోచ్‌కు చేరుకుని పట్టుకున్నారు. అతడిని గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో దింపి, జీఆర్‌పీకి అప్పగించారు. అతడి నుంచి అధికారులు రూ.1,620 స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి గ్వాలియర్ GRP TI జితేంద్ర చందేలియా కీలక విషయాలు వెల్లడించారు. “ప్రయాణికుల నుంచి లంచం తీసుకుంటున్నట్లు 139 రైల్వే హెల్ప్ లైన్ కాల్ ద్వారా ఫిర్యాదు అందింది. జీలం ఎక్స్ ప్రెస్ లో సదరు వ్యక్తి డబ్బులు వసూళు చేస్తున్నట్లు చెప్పారు. వెంటనే రైల్లోని ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చాం. వారు వెళ్లి నకిలీ TTEని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు ఉత్తరప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్న సైనికుడు కమల్ పాండేగా గుర్తించారు. అతడి నుంచి రూ.1,620 స్వాధీనం చేసుకున్నారు. అతడి మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతుంది” అని చందేలియా వెల్లడించారు.
झेलम एक्सप्रेस ट्रेन में एक फर्जी TTE पकड़ा गया है. आरोपी झांसी से ग्वालियर तक खुद बिना टिकट के यात्रा कर रहा था, लेकिन दूसरे यात्रियों का TTE बनकर टिकट चेक कर रहा था और सीट दिलाने के नाम पर उनसे पैसे वसूल रहा था.
GRP ने उसे ग्वालियर से हिरासत में ले लिया है. पूछताछ में उसने… pic.twitter.com/FAML4IUQc0
— The Lallantop (@TheLallantop) October 24, 2025
Read Also: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, ఇక ఆ నగరాలకు ఈజీగా వెళ్లొచ్చు!
అటు నిందితుడు కమల్ పాండేకు ఇంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేదని GRP అధికారులు వెల్లడించారు. సైనికుడు TTE లాగా నటించి ఎలా రైలు ఎక్కాడు. డబ్బులు ఏమని వసూళు చేశాడు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడికి చట్టప్రకారం శిక్ష పడుతుందని వెల్లడించారు.
Read Also: భారత్ లో ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్.. వేగం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!