బొద్దింకలు ఇళ్లలోనే కాదు, రైళ్లు, విమానాల్లోనూ కనిపిస్తుంటాయి. ఇలాంటి ఘటనలపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా బొద్దింకను చంపినట్లు ఎయిర్ ఇండియా సిబ్బంది చేసిన కామెంట్స్ నెట్టింట నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. విమానంలో కనిపించిన బొద్దింకను చనిపోయే వరకు ఉరితీసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బొద్దింక చేసిన నేరం ఏమై ఉంటుంది? అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.
తాజాగా ఈ విషయాన్ని విమానం లాగ్ బుక్ లో సిబ్బంది ప్రస్తావించారు. విమానంలో లాగ్ బుక్ చాలా కీలకమైనది. విమానా సిబ్బంది, పైలెట్లు, ఇతర మెయింటెనెన్స్ సిబ్బంది ఆ విమానంలో తలెత్తిన సమస్యల గురించి అందులో రికార్డు చేస్తారు. వాష్ రూమ్స్ పని చేయకపోవడం, ఏసీలు, లైట్లు పని చేయకపోవడం, సీట్ల సమస్యలు సహా అన్ని వివరాలను వివరిస్తారు. విమానం ల్యాండింగ్ తర్వాత ఈ బుక్ లోని సమస్యలను మెయింటెనెన్స్ సిబ్బంది సాల్వ్ చేస్తారు. అక్టోబర్ 24న AI315 విమానం న్యూఢిల్లీ నుంచి దుబాయ్ బయల్దేరింది. మార్గం మధ్యలో ఓ ప్రయాణీకులు బొద్దింకను గుర్తించాడు. వెంటనే అతడు విమాన సిబ్బందికి చెప్పాడు. వెంటనే, ఆ ఫిర్యాదును స్వీకరించి, సాల్వ్ చేసినట్లు ప్రయాణం అనంతరం లాగ్ బుక్ లో రాశారు. ‘ఓ ప్రయాణీకుడు బతికి ఉన్న బొద్దింకను గుర్తించాడు. ఆ బొద్దింకను చనిపోయే దాకా ఉరితీశాం” అని వివరించారు. ప్రస్తుతం ఈ లాగ్ బుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. “ఇంతకీ ఉరి తీసిన బొద్దింక శరీరాన్ని కుటుంబానికి అప్పగించారా? లేదా? అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “కుటుంబ సభ్యుల వివరాలు లభించకపోవడంతో క్యాటరింగ్‌కు దాని శరీరాన్ని అప్పగించారు” అని మరొక నెటిజన్ రాసుకొచ్చాడు. ఇంకో నెటిజన్ దానిని ఏకంగా “బొద్దింకల భగత్ సింగ్” అంటూ కొనియాడాడు. “ఇంతకీ బొద్దింకకు ఉరేయడానికి వాళ్లు టీ బ్యాగ్ తీగలను ఉపయోగించారా?” అని మరో వ్యక్తి ప్రశ్నించాడు. “ఇంతకీ బొద్దింకకు ఏ కోర్టులో శిక్ష విధించారు? ఆ జడ్జిపేరు ఏంటి? అని మరో వ్యక్తి ప్రశ్నించాడు.
Read Also: భారత్ లో ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్.. వేగం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!
రీసెంట్ గా కొలంబో-చెన్నై విమానంలో ప్యాక్ చేసిన ఫుడ్ ప్యాకెట్‌లో ఒక ప్రయాణీకుడు వెంట్రుకలను గుర్తించిన తర్వాత మద్రాస్ హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రయాణీకుడికి రూ. 35,000 చెల్లించాలని విమానయాన సంస్థను ఆదేశించింది. అటు మార్చి ప్రారంభంలో, చికాగో-ఢిల్లీ విమానంలో మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో 1 గంట 45 నిమిషాల తర్వాత వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
Read Also: టీటీఈగా నటిస్తూ.. డబ్బులు వసూలు చేస్తున్న జవాన్, వీడియో వైరల్!