BigTV English

Sleeper coach Trains: మీకు తెలుసా? ఈ దేశాల్లోని రైళ్లలో పడుకుని ప్రయాణించలేరు.. ఎందుకంటే?

Sleeper coach Trains: మీకు తెలుసా? ఈ దేశాల్లోని రైళ్లలో పడుకుని ప్రయాణించలేరు.. ఎందుకంటే?

భారతదేశంలో స్లీపర్ రైళ్లకు కొరతే లేదు. దాదాపు 99 శాతం రైళ్లలో స్లీపర్ బెర్తులు ఉంటాయి. ఎక్కువ దూరాలైన, తక్కువ దూరాలైనా కూడా స్లీపర్ కోచ్‌లను బుక్ చేసుకొని హాయిగా పడుకుని ప్రయాణించవచ్చు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం స్లీపర్ కోచ్ ఉన్న రైళ్లు ఉండనే ఉండవు. ఎంత దూరమైనా కూడా కూర్చునే ప్రయాణించాలి. నిద్ర వస్తున్నా కూర్చుని ఉండాల్సిందే. అలాంటి స్లీపర్ కోచ్ రైళ్లు లేని దేశాలు ఏవో తెలుసుకోండి.


స్లీపర్ కోచ్ రైళ్లు లేని దేశాలు
లాటిన్ అమెరికా దేశాలైన మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాల్లో స్లీపర్ కోచ్ ఉన్న రైళ్లు కనిపించవు. బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో సుదూర ప్రయాణాలకు స్లీపర్ కోచులు ఉన్న బస్సులు, విమానాలను ఉపయోగిస్తారు. రైళ్లు తక్కువగా ఉంటాయి. ఇక్కడ సరుకు రవాణాకే అధికంగా రైళ్లు ఉపయోగిస్తూ ఉంటారు. చెరువులో మాత్రం ఒక లగ్జరీ స్లీపర్ ట్రైన్ లో స్లీపర్ కోచులు ఉన్నాయి. అయితే అది సాధారణ పర్యాటకులకు పనికిరావు. కేవలం కోటీశ్వరులు మాత్రమే దానిలో ప్రయాణం చేయగలరు.

సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, కెన్యా, ఐస్లాండ్, మాల్టా వంటి దేశాల్లో కూడా స్లీపర్ కోచ్‌లు ఉన్న రైళ్లు కనిపించవు. వారి భౌగోళిక పరిస్థితులు కారణంగా బస్సులు లేదా విమానాలను ఇక్కడ అధికంగా ఉపయోగిస్తారు. ఐస్లాండ్లో బస్సులే అధికంగా వాడతారు. లేదా కార్లు, ఫెర్రీలపై ఆధారపడి ప్రజలు జీవిస్తారు. ఇక దక్షిణ కొరియాలో కూడా స్లీపర్ రైళ్లు కనిపించవు. వీరు రాత్రిపూట ప్రయాణాలు తక్కువగా చేస్తారు. ముఖ్యంగా బస్సులు, విమానాలని సుదీర్ఘ ప్రయాణాలకు ఎంచుకుంటారు. అలాగే దక్షిణ కొరియాలో హై స్పీడ్ రైళ్లు ఉన్నాయి. ఇది కేవలం రెండు మూడు గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుస్తాయి. కాబట్టి ఎవరికి స్లీపర్ కోచులు అవసరం పడదు.


చిన్న దేశమైన న్యూజిలాండ్ కూడా స్లీపర్ కోచ్ రైళ్లు లేవు. ఇక్కడ రాత్రి పూట పెద్దగా ప్రయాణాలు చేయరు. పగటిపూట ప్రయాణాలు చేసినా కూడా తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకుంటారు. దేశాలు చిన్నవిగా ఉన్నప్పుడు ఎక్కువ గంటలపాటు రైళ్లల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. అలాగే రాత్రిపూట ప్రయాణించాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా పడుతుంది. ఇక హై స్పీడ్ రైలు ఉన్న దేశాలలో ఏ ప్రదేశానికైనా త్వరగానే చేరుకుంటారు. కాబట్టి స్లీపర్ కోచ్ లో అవసరం పడబోవు. కొన్ని దేశాలలో స్లీపర్ బస్సులు విమానాలు చవకగా దొరుకుతాయి. అలాంటప్పుడు స్లీపర్ రైళ్ల అవసరం అక్కడ ఉండదు.

స్లీపర్ కోచ్ రైళ్లు ఉన్న దేశాలు ఇవే
మనదేశంలో స్లీపర్ కోచ్ రైళ్లు అధికంగానే ఉన్నాయి. నాన్ ఏసీ ఏసీ, స్లీపర్ కోచ్ రైళ్లు మన దగ్గర అధికంగానే దొరుకుతాయి. మనదేశంలో అతిపెద్ద రవాణా నెట్వర్క్ రైల్వే వ్యవస్థ ఒకటి. దేశం మొత్తం మీద లక్షల మంది ప్రతిరోజూ రైళ్లల్లో ప్రయాణిస్తూ ఉంటారు.

యూరప్ దేశాలలో కూడా రైల్వే వ్యవస్థ ఉంది. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేయాలనుకునేవారు అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా రైళ్లను ఉపయోగిస్తారు. ఐరోపాలో ఉన్న దేశాలైన ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ చెందిన ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు రైల్వే వ్యవస్థను ఉపయోగించుకుంటారు. నైట్ జెట్ రైలు జర్మనీ, హంగేరి, పోలాండ్, క్రోయేషియా వంటి దేశాలను కలుపుతుంది. ఇవి డీలక్స్ క్యాబిన్లతో అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. డైనింగ్ టేబుల్స్, ఫ్యాన్సీ క్యాబిన్లతో ఎంతో అందంగా ఉన్న లగ్జరీ రైళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి.

చైనాలో…
చైనాలో కూడా రైలు నెట్వర్క్ భారీగానే ఉంటుంది. సుదూర ప్రయాణాలకు స్లీపర్ కోర్టులను బుక్ చేసుకునే వారి సంఖ్య అధికమే. అక్కడ కూడా హై స్పీడ్ రైలు, సాధారణ రైళ్లు.. రెండూ ఉన్నాయి. చైనా భారత దేశంలోనే చాలా పెద్ద దేశం. కాబట్టి స్లీపర్ రైళ్లు ఆ దేశానికి అత్యవసరం. రష్యా కూడా విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశమే. కాబట్టి వీటికి కూడా స్లీపర్ రైళ్ల అవసరం ఉంది. విస్తీర్ణపరంగా జనాభా పరంగా అధికంగా ఉన్న దేశాల్లోనే రైల్వే వ్యవస్థ ఎక్కువగా అవసరం పడుతోంది. చిన్న దేశాలకు రైళ్ల అవసరం చాలా తక్కువైనా అని చెప్పుకోవాలి.

Related News

IRCTC update: రైల్వే సూపర్ స్పీడ్.. నిమిషానికి 25,000 టికెట్లు బుక్.. ఇకపై ఆ సమస్యకు చెక్!

Diwal Special Trains: దీపావళి సందడి.. ఆ ఒక్క రాష్ట్రానికే 12 వేల ప్రత్యేక రైళ్లు!

Bharat Gaurav Train: అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!

Trains Cancelled: రైల్వే షాకింగ్ డెసిషన్, ఏకంగా 100 రైళ్లు రద్దు!

Railway Robberies: ఫస్ట్ ఏసీ కోచ్‌లోకి దూరి మరీ.. రెచ్చిపోయిన దొంగలు!

Train Cancelled: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఆ రూట్ లో రైలు సర్వీసులు బంద్!

Big Stories

×