Elephants Swimming: జింబాబ్వేలోని మటుసడోనా నేషనల్ పార్క్ (Matusadona National Park)లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక కరిబా సరస్సులో ఏనుగులు సుమారు 7 కిలోమీటర్ల దూరం ఈదుతూ వెళ్లడం వన్యప్రాణి ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేసింది. భూభాగం నుంచి సరస్సులోని ఒక ద్వీపం వైపునకు అవి ప్రయాణిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. గజరాజులు నీటిలో ఈదుతున్న సమయంలో వాటి తలలు, తొండాలు మాత్రమే పైకి కనిపించడం ఆకట్టుకుంటోంది.
అయితే భారీ శరీరం, టన్నుల కొద్ది బరువుండే ఏనుగులు నీటిలో ఈదగలవన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ అవి అద్భుతంగా ఈదగలవని జంతు శాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎంతటి లోతున్న నీటిలోనైనా కాళ్లను ఆడిస్తూ అవి ఈజీగా ముందుకు సాగగలవని పేర్కొంటున్నారు. ఓవైపు కాళ్లతో ఈదుతూ.. శ్వాస కోసం తొండాలను నీటిపైకి తీసుకొస్తాయని తెలియజేశారు.
A remarkable sighting in Zimbabwe: a herd of elephants was observed swimming an impressive 7 kilometres from the mainland towards an island in Lake Kariba, within Matusadona National Park. https://t.co/3WwdAzzYpw
— EXPLOREREYES (@Gary161718) November 24, 2026
Also Read: 1981 భాగ్యనగరానికి.. ఇప్పటి హైదరాబాద్‌కి ఎంత తేడా? లెక్కలు చూస్తే షాకే!
ఇదిలా ఉంటే జింబాబ్వేలో ఏనుగులు ఈదిన సరస్సుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగా కరిబాకు పేరుంది. సుమారు 5,580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు.. విభిన్న వన్యప్రాణులకు ఆవాసంగా మారింది. దీని చుట్టూ ఆనుకొని ఉన్న మటుసడోనా నేషనల్ పార్క్‌లోని ఏనుగులు, సింహాలు, చిరుతలు, గేదెలతో పాటు మరెన్నో జీవులు ఇక్కడ సంచరిస్తుంటాయి. ఈ నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటాయి.