E-Paper
Advertisement

ఏపీలో 3 కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలం నుంచి నెల్లూరు వరకు ప్రయాణం ఇక మరింత ఈజీ!

ఏపీలో 3 కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలం నుంచి నెల్లూరు వరకు ప్రయాణం ఇక మరింత ఈజీ!
Advertisement

New Railway Routes in AP: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కనెక్టివిటీని మరింత పెంచేందుకు దక్షిణ తీర రైల్వే (South Coast Railway) కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో మూడు కొత్త రైలు మార్గాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. మార్కాపురం నుంచి శ్రీశైలం మీదుగా సికింద్రాబాద్‌కు, రాజంపేట నుంచి నెల్లూరుకు, సామర్లకోట నుంచి చింతూరుకు కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ప్రాథమిక సర్వేలు నిర్వహించి, డీపీఆర్ రెడీ చేసేందుకు రైల్వే బోర్డు అనుమతి కోరింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఏపీలోని పలు ప్రాంతాలకు రైలు ప్రయాణం మరింత ఈజీ కానుంది.

1.మార్కాపురం-శ్రీశైలం-సికింద్రాబాద్ రైల్వే లైన్

ఈ మూడు ప్రతిపాదనల్లో కీలకమైనది మార్కాపురం నుంచి శ్రీశైలం మీదుగా సికింద్రాబాద్‌ను కలిపే రైల్వే రూట్.  సుమారు 290 కిలోమీటర్ల పొడవుతో ఈ లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం శ్రీశైలానికి నేరుగా రైలు సౌకర్యం లేదు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, నార్త్ ఇండియా నుంచి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి నేరుగా శ్రీశైలానికి రైలు ద్వారా చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా, ఈ ప్రాంతంలోని రైల్వే కనెక్టివిటీ మెరుగుపడటంతో కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు గూడ్స్  రవాణా కూడా ఈజీ అవుతుంది.

2.సామర్లకోట-చింతూరు మధ్య 150 కిలోమీటర్ల లైన్

Advertisement

రెండో ప్రతిపాదన సామర్లకోట నుంచి చింతూరు వరకు సుమారు 150 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించడం. ఈ రూట్ జగ్గంపేట, రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల మీదుగా వెళ్లే అవకాశం ఉంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే గిరిజన ప్రాంతాలకు రైలు సౌకర్యం మెరుగుపడుతుంది. భద్రాచలం, రాజమహేంద్రవరం, సామర్లకోట ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి కాకినాడ పోర్టుకు బొగ్గు, ఇనుప ఖనిజాన్ని తరలించడం మరింత ఈజీ కానుంది.

3.రాజంపేట-నెల్లూరు మధ్య కొత్త మార్గం

మూడో ప్రతిపాదన రాయలసీమ ప్రాంతంలోని రాజంపేటను తీర ప్రాంతంలోని నెల్లూరుతో కలపడం. సుమారు 120 కిలోమీటర్ల పొడవుతో ఈ రైల్వే లైన్ నిర్మించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య నేరుగా రైలు మార్గం లేదు. ప్రయాణికులు రేణిగుంట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కొత్త లైన్ ఏర్పాటైతే ప్రయాణ దూరం తగ్గడంతో పాటు టైమ్ కూడా ఆదా అవుతుంది. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు సరకు రవాణాకు కూడా ఈ మార్గం ఉపయోగపడుతుంది.

Advertisement

ఈ మూడు రైల్వే లైన్ల ప్రాధాన్యతను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైల్వే శాఖకు లేఖ రాసింది. ప్రస్తుతం సర్వేలు, డీపీఆర్‌ల తయారీకి అనుమతి కోరుతూ ప్రతిపాదనలు రైల్వే బోర్డు వద్ద ఉన్నాయి. అనుమతి లభించిన తర్వాత సర్వేనిర్వహించి, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేస్తారు.

Read Also: వందే భారత్‌లో క్యాష్ బ్యాగ్ మరిచిపోయిన ఫారినర్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

Tags

Related News

దేశంలోని 90 శాతం ట్రక్కులపై నాగాలాండ్ నెంబరే ఎందుకు రాసి ఉంటుంది? అసలు సీక్రెట్ ఇదే!

రికార్డుల్లో కనిపించని ఎయిర్ ఇండియా విమానం.. 10 ఏళ్ల తర్వాత ఎక్కడ బయటపడిందో తెలుసా?

చలికాలంలో వెచ్చని వాతావరణం కావాలా?.. వింటర్ వెకేషన్‌కు ఈ 5 ప్రదేశాలు బెస్ట్

వందే భారత్‌లో క్యాష్ బ్యాగ్ మరిచిపోయిన ఫారినర్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

రీల్స్ కోసం రైలు ఎక్కాడు.. కరెంట్ తగిలి కాలిపోయాడు!

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇక నాలుగు రకాల వంటకాలే.. ఎందుకంటే?

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి కొల్లంకు స్పెషల్ ట్రైన్!

Big Stories

Advertisement
×