E-Paper
Advertisement

అయోధ్య-జనక్‌పూర్ రైలు వెనుక మాస్టర్ ప్లాన్.. మరో 4 దేశాలపై ఇండియన్ రైల్వే కన్ను!

అయోధ్య-జనక్‌పూర్ రైలు వెనుక మాస్టర్ ప్లాన్.. మరో 4 దేశాలపై ఇండియన్ రైల్వే కన్ను!
Advertisement

Ayodhya-Janakpur Train Launch: భారత్ రైల్వే నెట్‌ వర్క్‌ ను దేశ వ్యాప్తంగా విస్తరించడమే కాకుండా, పొరుగు దేశాలతోనూ రైల్వే మార్గాల అనుసంధానానికి ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఇందులో భాగంగా భారత్, నేపాల్ మధ్య కొత్త రైలు సర్వీసు ప్రారంభమైంది. అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు నడిచే ఈ రైలు రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అయితే, నేపాల్‌తోనే కాకుండా ఇతర పొరుగు దేశాలతోనూ భారత్ పలు రైల్వే ప్రాజెక్టులను చేపడుతోంది.

అయోధ్య-జనక్‌పూర్ మధ్య కొత్త రైలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బలేంద్ర షా తాజాగా కొత్త రైలు సర్వీసును ప్రారంభించారు. సరయూ-కమలా ఎక్స్‌ ప్రెస్ పేరుతో నడిచే ఈ రైలు 600 కిలోమీటర్లకు పైగా దూరాన్ని సుమారు 19 గంటల్లో చేరుకుంటుంది. గోరఖ్‌పూర్, బస్తీ, రక్సౌల్, సీతామర్హి, మధుబని, జయనగర్ లాంటి స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు ప్రయాణికులకు ఉపయోగపడటంతో పాటు, హిందువులు పవిత్రంగా భావించే అయోధ్య, జనక్‌పూర్ ప్రాంతాలను లింక్ చేయనుంది.  అయోధ్య శ్రీరాముడి జన్మస్థలంగా, జనక్‌పూర్ సీతాదేవి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందాయి. దీంతో రామాయణ యాత్ర చేయాలనుకునే భక్తులకు ప్రయాణం మరింత ఈజీ కానుంది.

నేపాల్‌తో మరిన్ని రైల్వే ప్రాజెక్టులు

Advertisement

భారత్, నేపాల్ మధ్య ఇప్పటికే పలు రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. జయనగర్-బిజల్‌పురా-బర్దిబాస్, జోగ్‌బాని-బిరాట్‌నగర్ రూట్లు వీటిలో ఉన్నాయి. అటు రక్సౌల్-కాఠ్మండు మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మార్గానికి సంబంధించి ఫీల్డ్ లొకేషన్ సర్వేను ఖరారు చేసినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. అలాగే నేపాల్‌ లో తూర్పు-పశ్చిమ రైల్వే అభివృద్ధికి సహకరించాలని నిర్ణయించారు. నేపాల్ రైల్వే సిబ్బందికి భారత్‌ లోని గతిశక్తి విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ కూడా అందిస్తున్నారు.

భూటాన్‌కు రైలు రూట్లు

భారత్ తన రైల్వే నెట్‌వర్క్‌ ను భూటాన్‌కు కూడా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రెండు కొత్త రైల్వే మార్గాలను ప్రతిపాదించింది. వాటిలో కోక్రాఝర్ (అస్సాం)-గెలెఫు (భూటాన్) రూట్ 69 కిలోమీటర్లు ఉంది. దీని అంచనా వ్యయం రూ.3,456 కోట్లు. అటు బనార్‌హాట్ (పశ్చిమ బెంగాల్)-సామ్ట్సే (భూటాన్) నడుమ 20 కిలోమీటర్లు నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ.577 కోట్లు. ప్రస్తుతం భూటాన్‌లో రైల్వే నెట్‌వర్క్ లేదు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆ దేశానికి తొలిసారిగా రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు రైల్వే సర్వీసులు బంద్

Advertisement

గతంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మైత్రి ఎక్స్‌ప్రెస్, బంధన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిచేవి. అయితే, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా 2024 జూలైలో ఈ సేవలను నిలిపివేశారు. అటు భారత్, పాకిస్తాన్ మధ్య నడిచిన సంఝౌతా ఎక్స్‌ ప్రెస్, థార్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు కూడా 2019 ఆగస్టులో నిలిచిపోయాయి.

మయన్మార్‌తోనూ రైల్వే అనుసంధానం

భారత్ మయన్మార్‌తో రైల్వే అనుసంధానానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిరిబామ్-ఇంఫాల్ మధ్య 125 కిలోమీటర్ల రైల్వే మార్గం నిర్మాణంలో ఉంది. ఇంఫాల్ నుంచి మోరే వరకు, అలాగే మయన్మార్‌లోని తాము నుంచి కలాయ్ వరకు రైల్వే మార్గాల ఏర్పాటుకు అనుమతులు రావాల్సి ఉంది. పొరుగు దేశాలతో రైల్వే అనుసంధానాన్ని పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యాలు, పర్యాటకం, వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయోధ్య-జనక్‌పూర్ రైలు ఈ ప్రయత్నంలో మరో కీలక ముందడుగుగా నిలవనుంది.

Read Also: అయోధ్య-జనక్‌పూర్ మధ్య డైరెక్ట్ ట్రైన్, మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!

Tags

Related News

ఏపీలో 3 కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలం నుంచి నెల్లూరు వరకు ప్రయాణం ఇక మరింత ఈజీ!

దేశంలోని 90 శాతం ట్రక్కులపై నాగాలాండ్ నెంబరే ఎందుకు రాసి ఉంటుంది? అసలు సీక్రెట్ ఇదే!

రికార్డుల్లో కనిపించని ఎయిర్ ఇండియా విమానం.. 10 ఏళ్ల తర్వాత ఎక్కడ బయటపడిందో తెలుసా?

చలికాలంలో వెచ్చని వాతావరణం కావాలా?.. వింటర్ వెకేషన్‌కు ఈ 5 ప్రదేశాలు బెస్ట్

వందే భారత్‌లో క్యాష్ బ్యాగ్ మరిచిపోయిన ఫారినర్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

రీల్స్ కోసం రైలు ఎక్కాడు.. కరెంట్ తగిలి కాలిపోయాడు!

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇక నాలుగు రకాల వంటకాలే.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×