E-Paper
Advertisement

సాయంత్ర 6 దాటిందంటే.. వెన్నులో వణుకు పుట్టించే ప్రదేశాలు.. వీటి పేరు వింటేనే పోసుకుంటారు భయ్యా!

సాయంత్ర 6 దాటిందంటే.. వెన్నులో వణుకు పుట్టించే ప్రదేశాలు.. వీటి పేరు వింటేనే పోసుకుంటారు భయ్యా!
Advertisement

Haunted Places in India: మనం సాధారణంగా సాయంత్రం 6 దాటిందంటే చాలు.. వేడివేడి బజ్జీలు తింటూ టీ తాగడానికో, లేదా ఫ్రెండ్స్‌తో కలిసి రచ్చ చేయడానికో ప్లాన్ వేస్తాం. కానీ మన ఇండియాలో కొన్ని ఏరియాలు ఉన్నాయి భయ్యా.. అక్కడ గడియారంలో ముల్లు 6 దాటిందంటే చాలు, జనాలు పరుగులు పెడతారు! ‘దెయ్యాలా? బొంగు! అవన్నీ ఒట్టి ట్రాష్’ అని ధైర్యం చెప్పే మనలాంటి బ్యాచ్ కూడా అక్కడికి వెళ్తే వణుకు పుట్టాల్సిందే. ఆ డేంజర్ స్పాట్స్ ఏంటో, అసలక్కడ రాత్రిపూట ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం పద.

భంగర్ కోట (రాజస్థాన్)

Advertisement

భారతదేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా దీనికి పేరుంది. ఇక్కడ ఒక తాంత్రికుడి శాపం వల్ల ఊరంతా నాశనమైందని, రాత్రిపూట ఆత్మలు తిరుగుతాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు. అందుకే స్వయంగా భారత పురావస్తు శాఖ (ASI) సూర్యాస్తమయం తర్వాత లోపలికి వెళ్లడం నిషేధమని బోర్డులు పెట్టింది. రాత్రిళ్లు అక్కడ వింత శబ్దాలు, ఎవరో ఏడుస్తున్నట్లు, గజ్జెల చప్పుళ్లు వినిపిస్తాయని లోపలికి వెళ్లి తిరిగొచ్చిన వాళ్లు చెబుతుంటారు.

డుమాస్ బీచ్ (గుజరాత్)

Advertisement

సూరత్‌లోని ఈ బీచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది.. ఇక్కడి ఇసుక నల్లగా ఉంటుంది. పూర్వం ఇక్కడ శవాలను దహనం చేసేవారట. అందుకే ఆత్మలు ఇక్కడే తిరుగుతాయని జనాలు భయపడతారు. రాత్రిపూట ఒంటరిగా నడుస్తుంటే ఎవరో పక్కనే నడుస్తున్నట్లు అనిపించడం, ‘వెనక్కి తిరిగి చూడకు’ అని చెవిలో గుసగుసలు వినిపించడం వంటివి జరుగుతాయని అంటారు. చీకటి పడ్డాక బీచ్ లోపలికి వెళ్లిన కొందరు తిరిగి రాలేదనే కథలు ఇక్కడ బాగా ఫేమస్.

కుల్ధారా గ్రామం (రాజస్థాన్)

జైసల్మేర్ దగ్గర ఉన్న ఈ ఊరు ఒకప్పుడు కళకళలాడేది. కానీ ఒక దుర్మార్గుడైన మంత్రి బారి నుండి తమ ఆడపిల్లలను కాపాడుకోవడానికి, దాదాపు 1500 మంది గ్రామస్తులు ఒక్క రాత్రిలోనే ఊరు వదిలి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ “ఈ ఊరిలో ఎవరూ బతకలేరు” అని శాపం పెట్టారట. ఇప్పటికీ సాయంత్రం 6 తర్వాత అక్కడ ఎవరూ ఉండరు. రాత్రిళ్లు నీడలు కదులుతున్నట్లు, వింతగా ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుందని టూరిస్టులు చెబుతుంటారు.

శనివార్ వాడ (మహారాష్ట్ర)

పూణేలోని ఈ చారిత్రక కోటలో నారాయణరావు అనే యువరాజును అత్యంత దారుణంగా హత్య చేశారు. చనిపోయే ముందు అతను ‘కాకా మలా వాచవా’ (బాబాయ్ నన్ను కాపాడు) అని ఆర్తనాదాలు చేశాడట. ఇప్పటికీ పౌర్ణమి రాత్రుల్లో ఆ కోట గోడల మధ్య నుండి ఆ యువరాజు అరుపులు వినిపిస్తాయని స్థానికుల నమ్మకం.

చూశావుగా మామా! ఇవన్నీ కేవలం భ్రమలా లేక నిజంగానే అక్కడ ఏదైనా శక్తి ఉందా అనేది ఎవరికీ తెలియదు. కానీ నీకు నిజంగానే గుండె ధైర్యం ఎక్కువై, ‘నేను వెళ్లి చూస్తా’ అనుకుంటే మాత్రం.. సాయంత్రం 6 తర్వాత అటువైపు అడుగు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకో!

Tags

Related News

ట్యూబ్‌లెస్ టైర్ పంక్చర్ అయితే కారు ఎంత దూరం నడపవచ్చు? ఈ పొరపాటు చేస్తే భారీ నష్టం తప్పదు

న్యూ ఇయర్‌ కాశ్మీర్‌లో సెలబ్రేట్ చేసుకోవాలనుందా? IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ వచ్చేసింది!

అయోధ్య-జనక్‌పూర్ రైలు వెనుక మాస్టర్ ప్లాన్.. మరో 4 దేశాలపై ఇండియన్ రైల్వే కన్ను!

ఏపీలో 3 కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలం నుంచి నెల్లూరు వరకు ప్రయాణం ఇక మరింత ఈజీ!

దేశంలోని 90 శాతం ట్రక్కులపై నాగాలాండ్ నెంబరే ఎందుకు రాసి ఉంటుంది? అసలు సీక్రెట్ ఇదే!

రికార్డుల్లో కనిపించని ఎయిర్ ఇండియా విమానం.. 10 ఏళ్ల తర్వాత ఎక్కడ బయటపడిందో తెలుసా?

చలికాలంలో వెచ్చని వాతావరణం కావాలా?.. వింటర్ వెకేషన్‌కు ఈ 5 ప్రదేశాలు బెస్ట్

Big Stories

Advertisement
×