IRCTC Kashmir Tour Package 2027: కొత్త సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది సరికొత్త ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగానే అద్భుతమైన టూరిజం స్పాట్స్ లో వేడుకలకు సిద్ధం అవుతున్నారు. మంచుతో కప్పబడిన కొండలు, అందమైన లోయలు, దాల్ సరస్సు, హౌస్‌బోట్ ప్రయాణం లాంటి ఎక్స్ పీరియెన్స్ పొందాలనుకునే వాళ్లు కాశ్మీర్ టూర్ కు సిద్ధం అవుతున్నారు. ఒకవేళ మీరూ కాశ్మీర్ కు వెళ్లాలనుకుంటే.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పెషల్ వింటర్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. భువనేశ్వర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ఆరు రోజుల యాత్రలో కాశ్మీర్‌లోని కీలక పర్యాటక ప్రాంతాలను చూసే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీ ధరలు, ప్రయాణ తేదీలు, పూర్తి షెడ్యూల్ వివరాలు తెలుసుకుందాం.
IRCTC వింటర్ స్పెషల్ కాశ్మీర్ ప్యాకేజీ పేరుతో ఈ యాత్రను ప్లాన్ చేసింది. 2027 జనవరి 9న భువనేశ్వర్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఢిల్లీ మీదుగా శ్రీనగర్ చేరుకుంటారు. జనవరి 14న తిరిగి భువనేశ్వర్‌కు చేరుకుంటారు. మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది.
ప్రయాణికుల సంఖ్య, పిల్లల వయస్సును బట్టి ప్యాకేజీ ధరలు మారుతాయి. ఒకరు ప్రయాణిస్తే రూ.56,570, ఇద్దరు ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.51,630, ముగ్గురు ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.50,255, 5–11 ఏళ్ల పిల్లలకు (బెడ్‌తో) రూ.43,835, 5–11 ఏళ్ల పిల్లలకు (బెడ్ లేకుండా) రూ.41,745 ఛార్జ్ చేయనున్నారు.
⦿ మొదటి రోజు: భువనేశ్వర్ నుంచి ఢిల్లీ మీదుగా శ్రీనగర్ చేరుకుంటారు. హోటల్లో బస చేస్తారు. సాయంత్రం దాల్ సరస్సులో షికారా ప్రయాణం చేయాలనుకుంటే సొంతంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
⦿ రెండో రోజు: సోనామార్గ్ సందర్శన ఉంటుంది. ఇక్కడి ప్రసిద్ధ థాజివాస్ మంచి నదిని చూడవచ్చు.
⦿ మూడో రోజు: గుల్మార్గ్ పర్యటన ఉంటుంది. అక్కడ గోండోలా కేబుల్ కార్ ప్రయాణం, ఖిలాన్మార్గ్ సందర్శనకు అవకాశం ఉంటుంది.
⦿ నాలుగో రోజు: శ్రీనగర్ నుంచి పహల్గామ్కు వెళ్తారు. మార్గంమధ్యలో అవంతిపోరా పురాతన కట్టడాలు, కుంకుమపువ్వు ఫీల్డ్ లను చూడవచ్చు. పహల్గామ్లో రాత్రి బస ఉంటుంది.
⦿ ఐదో రోజు: తిరిగి శ్రీనగర్ చేరుకుని శంకరాచార్య ఆలయం, హజ్రత్బల్ దర్గా, షాలిమార్, చష్మేశాహి, పరిమహల్ లాంటి ప్రాంతాలను సందర్శిస్తారు. వాతావరణం అనుకూలిస్తే హౌస్‌బోట్‌లో బస చేసే అవకాశం ఉంటుంది.
⦿ ఆరో రోజు: బ్రేక్ ఫాస్ తర్వాత శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఢిల్లీ మీదుగా భువనేశ్వర్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
రానుపోను విమాన టిక్కెట్లు, హోటల్ వసతి, ఒక రాత్రి హౌస్‌బోట్ స్టే, బ్రేక్ ఫాస్ట్, నైట్ డిన్నర్, షేర్డ్ ఏసీ వెహికల్ లో లోకల్ ట్రావెల్, టూర్ ఎస్కార్ట్, ట్రావెల్ న్సూరెన్స్, పార్కింగ్, టోల్ చార్జీలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. అయితే, మధ్యాహ్న భోజనం, స్మారక కట్టడాల ఎంట్రీ ఫీజ్, షికారా ప్రయాణం, గోండోలా టిక్కెట్లు, గైడ్ ఫీజులు, వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో ఉండవు.
ప్రయాణానికి 21 రోజుల లోపు టికెట్ రద్దు చేస్తే 30 శాతం, 15–21 రోజుల మధ్య రద్దు చేస్తే 55 శాతం, 8–14 రోజుల మధ్య రద్దు చేస్తే 80 శాతం ఛార్జీలు కట్ చేస్తారు. ప్రయాణానికి ఏడు రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఉండదు. IRCTC అధికారిక వెబ్సైట్లో టూర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Read Also: అయోధ్య-జనక్‌పూర్ రైలు వెనుక మాస్టర్ ప్లాన్.. మరో 4 దేశాలపై ఇండియన్ రైల్వే కన్ను!