BigTV English

Koti: ‘కోఠి’ పేరు వెనుక ఇంత కథ ఉందా? ఆ ప్యాలెస్ ను ఎవరు, ఎవరి కోసం కట్టించారంటే?

Koti: ‘కోఠి’ పేరు వెనుక ఇంత కథ ఉందా? ఆ ప్యాలెస్ ను ఎవరు, ఎవరి కోసం కట్టించారంటే?

Hyderabad History: హైదరాబాద్ కు వెళ్లే ప్రతి ఒక్కరికీ కోఠి గురించి తెలిసే ఉంటుంది. సిటీ నలుమూలల నుంచి ఇక్కడికి బస్సులు నడుస్తుంటాయి. కోఠి పెద్ద బిజినెస్ సెంటర్ గా కొనసాగుతుంది. ఇంతకీ అసలు కోఠి అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అనే విషయాలు చాలా మందికి తెలియదు. కోఠి పేరు పెనుక పెద్ద చరిత్ర ఉన్నది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


కోఠికి ఆ పేరు ఎలా వచ్చిందంటే?

‘కోఠి’ అంటే భవనం అని అర్థం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత విసాలవంతమైన ప్యాలెస్ ఉన్న నేపథ్యంలో దానికి కోఠి అనే పేరు వచ్చింది. ఈ ప్యాలెస్ 64 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇంతకీ ఆ ప్యాలెస్ ఎవరు కట్టారు? ఎందుకు కట్టారు? ఇప్పుడు ఆ ప్యాలెస్ ఏమైంది? అంటే.. దీనిని హైదరాబాద్ రెసిడెంట్ గా బ్రిటిష్ అధికారి జేమ్స్ అఖిలీస్ కర్క్‌ పాట్రిక్  ఈ ప్యాలెస్ ను కట్టించాడు. 1798 నుంచి 1805 దాకా ఆయన హైదరాబాద్ రెసిడెంట్ గా ఉన్నారు. నిజాంకు ఓ మెసేజ్ ఇచ్చేందుకు జేమ్స్ ఈ ప్యాలెస్ ను కట్టించాడు. పరిపాలకుడివి నువ్వు కాదు నేనే అని చెప్పాలనుకున్నాడు. నిజాంకు ఉన్న అన్ని భవనాల కంటే ఇది పెద్దగా ఉంటుంది. అమెరికాలోని వైట్ హౌస్ తో సమానంగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఇటాలియన్ పద్దతిలో ఉంటుంది. చెన్నైలో బ్రిటిష్ వాళ్లు కట్టిన రెసిడెన్సీ కంటే పెద్దది. హైదరాబాద్ లో నిజాం ప్యాలెస్ ల కంటే ఇదే అత్యంత వైభవంగా ఉంటుంది.


ఈ ప్యాలెస్ నిర్మాణం ఎలా జరిగిందంటే?

ఇక నిజాం సంస్థానంలో ప్రధాన మంత్రిగా ఉన్న మీర్ ఆలం మనవరాలు కైరున్నిసాను జేమ్స్ అఖిలీస్ ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెప్తారు. కానీ, ఆమెను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. ఆమెతో జేమ్స్ కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్నారు. ఆ తర్వాత లండన్ కు తీసుకెళ్లాడు. మీర్ ఆలంకు జేమ్స్ అంటే తొలుత పడేది కాదు. కానీ, ఆ తర్వాత తన మనువరాలిని చేసుకున్నాడు కాబట్టి కొంత ప్రేమ అనేది ఏర్పడింది. అదే సమయంలో తనకు ఓ పెద్ద ప్యాలెస్ కట్టాలని చెప్పి, ఓ పెద్ద క్లాత్ మీద ప్లాన్ గీసుకుని అప్పటి నిజాం రాజు సికిందర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ భవనం  ప్లాన్ చూసి తనతో కాదని చెప్పి ఆయన పారిపోతాడు. కానీ, మీర్ ఆలం.. జేమ్స్ కు చెప్పి, ఈ ప్లాన్ ను చిన్న సైజులో గీసుకుని తీసుకురమ్మని చెప్తాడు. నీకు నచ్చినట్లుగానే ప్యాలెస్ కట్టుకోవచ్చు అంటాడు. రెండు రోజుల తర్వాత చిన్న సైజ్ లో తీసుకుని వెళ్తాడు. ఇది చూసి నిజం సరే అని చెప్తాడు. ఆ నిర్మాణానికి అంగీకారం చెప్తాడు.  ఆ తర్వాత దీన్ని అద్భుతంగా నిర్మిస్తారు. 64 ఎకరాల్లో కళ్లు చెదిరేలా రెండు ప్యాలెస్ లు నిర్మిస్తారు. ఆ తర్వాత దీనికి కోఠి అనే పేరు వచ్చింది.

1911లో తన నివాసంగా మార్చుకున్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

ఆ తర్వాత నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ భవనంలో నివసించాడు. 1911లో ఆయన సింహాసనం అధిష్టించిన తర్వాత తన తండ్రి నివసించిన చౌమహల్లా ప్యాలెస్ లో కాకుండా ఈ భవనం ఉండేవాడు. ఇప్పుడు అదే ప్యాలెస్.. కోఠి ఉమెన్స్ యూనివర్సిటీగా మారింది. పోలీస్ యాక్షన్ తర్వాత 1949లో ఉమెన్స్ కాలేజీగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని యూనివర్సిటీగా మార్చారు. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంది. హెరిటేజ్ కట్టడంగా గుర్తింపు పొందింది. ఈ రెండు ప్యాలెస్ లలో ఒకదాన్ని ఉమెన్స్ యూనివర్సిటీగా, మరొకదాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీగా ఏర్పాటు చేశారు.

Read Also:  దేశంలో అత్యంత అద్భుతమైన రైల్వే వంతెనలు, చూస్తే ఆహా అనాల్సిందే!

Tags

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×