BigTV English

Fascinating Railway Bridges: దేశంలో అత్యంత అద్భుతమైన రైల్వే వంతెనలు, చూస్తే ఆహా అనాల్సిందే!

Fascinating Railway Bridges: దేశంలో అత్యంత అద్భుతమైన రైల్వే వంతెనలు, చూస్తే ఆహా అనాల్సిందే!

Indian Railways: భారతీయ రైల్వేకు 150కి పైగా సంవత్సరాల చరిత్ర ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన రైల్వే సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన రైల్వే మార్గాలను కలిగి ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 2 లక్షల రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి. వాటిలో కొన్ని అద్భుతమైన రైల్వే బ్రిడ్జిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ పంబన్ వంతెన – తమిళనాడు

ఈ వంతెన పొడవు 2,065 మీటర్లు. పంబన్ ద్వీపంలోని రామేశ్వరం పట్టణాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో లింక్ చేస్తుంది. ఈ రైల్వే వంతెనను ఫిబ్రవరి 24, 1914న ప్రారంభింఆరు. దేశంలో మొట్టమొదటి సముద్ర వంతెన ఇదే కావడం విశేషం. ప్రస్తుతం పాత వంతెనకు సమాంతరంగా కొత్త వంతెనను నిర్మించారు. రైల్వే, నౌకా ప్రయాణానికి వీలుగా వర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. ఈ బ్రిడ్జి ప్రయాణీకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


⦿ గోదావరి వంతెన – ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌ రాజమండ్రిలోని గోదావరి నదిపై ఈ వంతెనను నిర్మించారు. ఇది సుమారు 4.1 కి.మీ ఉంది. రైలుతో పాటు  రోడ్డు వంతెనగా రూపొందించారు. దేశంలోని అతి పొడవైన రైల్వే వంతెనలలో ఇది ఒకటి. ఈ వంతెన సింగిల్ ట్రాక్ రైలు మార్గంపై రెండు లేన్ల రోడ్ డెక్‌ ను కలిగి ఉంది. దీనిలో 2.8 కి.మీ రైల్వే, 4.1 కి.మీ రోడ్డు భాగం ఉంటుంది. దీనిని ప్రీస్ట్రెస్డ్ కాంక్రీటుతో నిర్మించారు. ఈ 2,745 మీటర్ల ఆర్చ్ వంతెన, ఒక్కొక్కటి దాదాపు 97 మీటర్ల పొడవున్న 28 స్పాన్‌ లను కలిగి ఉంది. ఈ వంతెన దేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రైల్ కమ్ రోడ్ వంతెన ఆగస్టు 16, 1974న ప్రారంభించారు.

⦿ వెంబనాడ్ రైలు వంతెన – కేరళ

ఇది దేశంలో రెండవ పొడవైన రైల్వే వంతెన.  వెంబనాడ్ రైలు వంతెన కేరళలోని కొచ్చిలోని ఎడప్పల్లి- వల్లర్పదంలను కలుపుతుంది. ఈ వంతెన 4.62 కి.మీ పొడవు ఉంటుంది. ఈ వంతెన కేరళలోని మూడు చిన్న ద్వీపాల గుండా వెళుతుంది. దీనిని వెంబనాడ్ సరస్సు బ్యాక్ వాటర్స్ మీద నిర్మించారు. ఈ బీమ్ వంతెన అద్భుతమైన చూపరులకు కనువిందు చేస్తుంది.

⦿ చీనాబ్ వంతెన – జమ్మూ  & కాశ్మీర్

ప్రపంచంలోనే ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే వంతెన ఇది.  కాశ్మీర్‌ లోని చీనాబ్ వంతెన దీనిని నిర్మించారు.  రియాసి జిల్లా గుండా ప్రవహించే చీనాబ్ నదిపై నిర్మించబడింది. నదీ నుంచి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇది కాశ్మీర్ లోయకు కనెక్టివిటీని అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.

⦿ కనో వంతెన– హిమాచల్ ప్రదేశ్

కల్కా సిమ్లా రైల్వే 988 వంతెనలు, వయాడక్ట్‌ లను కలిగి ఉంది. వాటిలో కొన్ని అనేక వంపులు కలిగిన రాతి గ్యాలరీలను కలిగి ఉన్నాయి.  అలాంటి వాటిలో కనో వంతెన ఒకటి. 1898లో దీనిని నిర్మించారు. ఈ వంపు వంతెనలు పైన్, ఫిర్, దేవదార్లతో కల్కా- సిమ్లా మార్గంలో ఉన్నాయి.  ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ పన్వల్నాడి వంతెన – మహారాష్ట్ర

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా పన్వల్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. 420 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వయాడక్ట్ బోలు, ట్యాంపరింగ్, అష్టభుజి స్తంభాలపై దీనిని నిర్మించారు. దీని పైలాన్‌ లను  బలమైన స్లిప్‌ ఫార్మ్ టెక్నిక్ ఉపయోగించి నిర్మించారు. ఈ పద్ధతి దేశంలో తొలిసారి ఉపయోగించారు. 1995లో ఈ వంతెన అమెరికన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ నుంచి భారత్ లో అత్యుత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డును అందుకుంది.

Read Also: రైల్వే బ్రిడ్జ్ లు ఇన్ని రకాలు ఉంటాయా? ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Tags

Related News

Vande Bharat Trains: ఇవాళ 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Big Stories

×