Champions Trophy 2025: ఓటమి ఎరుగకుండా భారత జట్టు ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచింది. వైట్ కాలర్ ఎగరేసింది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్ వేదికగా ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ మార్చ్ 9న దుబాయ్ లో ముగిసింది. పాకిస్తాన్ నిర్వహించిన ఈ ట్రోఫీని ఆ దేశంలో అడుగుపెట్టకుండానే భారత జట్టు ట్రోఫీ ని ఎగరేసుకుపోయింది. ఈ టోర్నమెంట్ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నిరాశ మిగిలింది.
Also Read: Avneet Kaur: సారాకు షాక్… ఆ స్టార్ నటితో గిల్ డేటింగ్?
లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టుతో స్టేడియాలలో ప్రేక్షకుల రాక తగ్గి.. టోర్నీ నిర్వహణ భారంగా మారింది. అంతేకాకుండా ఈ టోర్నీలో వర్షం కారణంగా మూడు కీలక మ్యాచ్లు రద్దు కావడంతో ప్రసారధారులు, స్పాన్సర్లు తీవ్రంగా నష్టపోయి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పై తీవ్ర ఒత్తిడి పెంచారు. అలాగే భారత జట్టు ఫైనల్ కీ చేరడంతో లాహోర్ లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం కూడా కోల్పోవడం పాకిస్తాన్ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టివేసింది.
అయితే సౌత్ ఆఫ్రికా – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కి ప్రేక్షకులను ఆకర్షించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ వినూత్న ఆఫర్ ని ప్రకటించింది. మ్యాచ్ కి హాజరయ్యే ప్రేక్షకులకు ఇఫ్తార్ విందును అందజేయాలని నిర్ణయించుకుంది. ఇందులో జ్యూస్, డేట్స్, మినీ పిజ్జా వంటి తినుబండారాలను అందించింది. రంజాన్ ఉపవాస సమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
వీటిని సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు అందించింది. అయితే ఈ వ్యూహంతో స్టేడియానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులను తీసుకురావాలని భావించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రాకపోవడంతో మరో ఎదురు దెబ్బ తగిలింది. అలాగే మరోవైపు భారత జట్టు ఫైనల్ చేరడంతో.. ఫైనల్ మ్యాచ్ ని దుబాయిలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో తమ కష్టాలు దూరమవుతాయని భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశలు ఆవిరయ్యాయి. అన్ని దేశాలు వచ్చినా.. ఒక్క భారత్ మాత్రం ఆ దేశంలో అడుగుపెట్టకపోవడంతో పాకిస్తాన్ భారీగా నష్టపోయింది.
Also Read: Mayank Yadav Injury: లక్నోకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్ ఐపీఎల్ కు దూరం ?
అనుకున్న స్థాయిలో టికెట్లు అమ్ముడు పోకపోవడం, కరాచీ, లాహోర్, రావల్పిండి క్రికెట్ స్టేడియాలను ఆధునికరించడం వంటి కారణాలతో ఈ టూర్ నీకోసం పాకిస్తాన్ 64 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు 558 కోట్ల రూపాయల ఖర్చు చేసింది. దీంతోపాటు అతిథ్యం, రవాణా కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయి. ఇక ఐసీసీ నుంచి 6 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 52 కోట్ల రూపాయలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి వస్తాయి. కానీ ఈ టోర్నమెంట్ లో ఖర్చు చేసినంత ఆదాయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి రాలేదు. ఓ అంచనా ప్రకారం ఈ టోర్నీ నిర్వాహనతో పాకిస్తాన్ కి దాదాపు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.