E-Paper
Advertisement

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!
Advertisement

Swimming Home From Work: చాలా మంది రోజూ ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడం, సాయంత్రం మళ్లీ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తారు. ఇందుకోసం కొందరు కార్లు ఉపయోగిస్తే.. మరికొందరు బస్సులు, మెట్రో రైళ్లను వాడుకుంటారు. కానీ, ఓ దేశంలో కొందరి ప్రయాణం క్రేజీగా ఉంటుంది. వారు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఏకంగా నదిలో ఈదుకుంటూ వెళ్తారు. ఎందుకలా అంటే..

ట్రాఫిక్‌ కు బదులు నదిలో ప్రయాణం!

స్విట్జర్లాండ్‌లోని బెర్న్, బాసెల్ నగరాల్లో వేసవి సమయంలో ఈ ప్రయాణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరే నది పరిసరాల్లో నివసించే కొందరు ఉద్యోగులు ఆఫీస్ అయ్యాక రోడ్లపై ట్రాఫిక్‌ లో చిక్కుకోవడం కంటే నదిలో ఈదుకుంటూ ఇంటికి వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ ప్రయాణం వారికి  వినోదంగా మారుతుంది. ఆఫీసులో రోజంతా పనిచేసిన తర్వాత చల్లటి నదిలోకి దిగి కొంతసేపు ఈదడం వల్ల శరీరానికి, మనసుకు ఉల్లాసం కలుగుతుందని భావిస్తారు.

లగేజీ పరిస్థితి ఏంటి?   

Advertisement

ఈ ప్రయాణంలో అసలు ఇంట్రెస్టింగ్ విషయం వారి సామాన్ల విషయంలో ఉంటుంది. ఆఫీసు బట్టలు, పర్సు, మొబైల్, ల్యాప్‌ టాప్ వంటి వస్తువులను సాధారణ బ్యాగుల్లో పెట్టుకుని నదిలోకి దిగితే అవి తడిసిపోతాయి. అందుకే ప్రయాణికులు ప్రత్యేకంగా తయారు చేసిన వాటర్‌ ప్రూఫ్ బ్యాగులను ఉపయోగిస్తారు. వీటిలో తమ దుస్తులు, విలువైన వస్తువులను భద్రంగా పెట్టుకుంటారు. అలాంటి బ్యాగులను స్విస్ జర్మన్‌ లో  వికెల్‌ ఫిష్  అని పిలుస్తారు. బ్యాగ్‌ ను వీపుకు తగిలించుకుని నదిలోకి దూకుతారు. సామాన్లు తడవకుండా ఉంటాయి.

ప్రవాహంతోనే ముందుకు..

ఆరే నది నీరు వేగంగా ప్రవహిస్తుంటుంది. మంచి ఈత వచ్చినవారు మాత్రమే ఈ జర్నీకి ఇష్టపడుతారు. అయితే, ఇది సాధారణ ఈత కొట్టడం లాంటిది కాదు. నది ప్రవాహం, నీటి పరిస్థితులు, ఎక్కడ బయటకు వెళ్లాలి? అనే  అంశాలపై అవగాహన ఉండాలి. ప్రయాణికులు ముందుగానే ఎక్కడ నదిలోకి దిగాలి? ఎక్కడ బయటకు రావాలి? అనే విషయాన్ని నిర్ణయించుకుంటారు. సరైన ప్రదేశానికి చేరుకున్న తర్వాత నది నుంచి బయటకు వచ్చి, తమ ఇంటికి చేరకుంటారు.

ప్రపంచాన్ని ఆకట్టుకున్న ప్రయాణం!

Advertisement

ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు నదిలో ఈదడం వినడానికి విచిత్రంగా అనిపించినా, బెర్న్‌ లో వేసవి కాలంలో కనిపించే ప్రత్యేకమైన సంప్రదాయంగా మారింది. రోడ్లపై ట్రాఫిక్‌ ను తప్పించుకుని, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంటికి చేరుకునే ఈ ప్రయాణం నిజంగా వెరీ వెరీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. రోజువారీ జీవితంలో ప్రయాణం ఎంత ఆనందాన్ని ఇస్తుందో    స్విట్జర్లాండ్‌ లోని ఈ నది ప్రయాణాన్ని చూస్తే అర్థం అవుతుంది.

Read Also: ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Tags

Related News

రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి ఈమే!

క్లియోపాత్రా అందానికి ప్రపంచమే ఫిదా.. ఇంతకీ ఆమె సౌందర్య రహస్యం ఏంటో తెలుసా?

లాంగ్ హాలిడే అవసరం లేదు.. 2 రోజుల్లో వీకెండ్ ఎంజాయ్ చేయగల 7 బెస్ట్ డెస్టినేషన్స్

Big Stories

Advertisement
×