E-Paper
Advertisement

Telangana Railway Stations: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కళ్లు చెదిరేలా మారబోతున్న4 రైల్వే స్టేషన్లు!

Telangana Railway Stations: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కళ్లు చెదిరేలా మారబోతున్న4 రైల్వే స్టేషన్లు!
Advertisement

 Telangana Railway Stations Upgrade Soon: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.47,984 కోట్ల విలువైన ప్రాజెక్టులను టేకప్ చేస్తోంది. వీటిలో కొత్త రైలు మార్గాలు, స్టేషన్ అప్‌ గ్రేడ్‌ లు, మెరుగైన భద్రతా మౌలిక సదుపాయాలు ఉన్నాయి. నిజానికి తెలంగాణకు రైల్వే నిధులు గత దశాబ్దకాలంగా భారీగా పెరిగాయి. 2009- 2014 మధ్య ఉమ్మడి ఏపీలో సగటు వార్షిక రైల్వే బడ్జెట్ రూ.886 కోట్లుగా ఉండేది. 2026–27లో కేటాయింపులు దాదాపు ఆరు రెట్లు పెరిగి రూ.5,454 కోట్లకు చేరుకున్నాయి. 2014–15 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.258 కోట్లు వచ్చాయి. 2026–27 బడ్జెట్ నాటికి, కేటాయింపులు దాదాపు ఇరవై రెట్లు పెరిగి రూ.5,454 కోట్లకు చేరుకున్నాయి. భారతీయ రైల్వే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రూ.47,984 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది.

అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్  

దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మహబూబ్‌ నగర్ రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో అప్ గ్రేడ్ కాబోతోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపిక చేయబడిన ఈ స్టేషన్‌ ఎయిర్ పోర్ట్ తరహాలో రూపుదిద్దుకుంటుంది. ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కొత్త నిర్మాణాలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ లు, ఫుట్ ఓవర్ బిడ్జిలను నిర్మించడానికి కేంద్రం సుమారు రూ. 40 కోట్లు కేటాయించింది. ఈ స్టేషన్ 19వ శతాబ్దం చివరి నాటిది. 1988లో హైదరాబాద్ నుంచి రైల్వే పనులు ప్రారంభం అయ్యాయి. మీటర్ గేజ్ లైన్‌ పై మొదలైన ఈ పనులు 1892లో పూర్తయ్యాయి. 1922లో ప్రయాణీకుల సేవలు  ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో అప్ గ్రేడ్ కాబోతోంది.

 ప్రతి రోజూ 50 రైళ్ల రాకపోకలు

Advertisement

మహబూబ్‌ నగర్ స్టేషన్‌ లో ప్రయాణీకుల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. ప్రతిరోజూ దాదాపు 50 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా.. అధికారులు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ లు, ఆధునిక టాయిలెట్లు,  రైల్వే విభాగాల కోసం ప్రత్యేక నిర్మాణాలతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రవేశపెడుతున్నారు. కొత్త టెర్మినల్ విమానాశ్రయం తరహా సౌకర్యాలను పోలి ఉండేలా నిర్మించనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

Read Also:  ఉగాది పండుగకు ప్రత్యేక రైళ్లు, ఏ రూట్లలో నడుస్తాయంటే?

ఇతర రైల్వే స్టేషన్లు కూడా..

Advertisement

మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ తో పాటు జడ్చర్ల రైల్వే స్టేషన్, గద్వాల రైల్వే స్టేషన్, జోగులాంబ రైల్వే స్టేషన్లలోని స్టేషన్లను కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అప్‌ గ్రేడ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. బడ్జెట్‌ లో జడ్చర్లకు రూ.36.67 కోట్లు, గద్వాలాలకు రూ.42.82 కోట్లు, జోగులాంబకు రూ.6.7 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ నాలుగు రైల్వే స్టేషన్లు అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్ పోర్టుల మాదిరిగా రూపొందనున్నాయి.

Read Also:  హైదరాబాదీయులకు గుడ్ న్యూస్… ఆ స్పెషల్ రైళ్లు రెగ్యులర్ సర్వీసులు అందిస్తాయ్!

Related News

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

Big Stories

Advertisement
×