Special Trains for Ugadi 2026: ఉగాది పండుగ సందర్భంగా చాలా మంది పట్టణాల నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. మార్చి 19న ఉగాది పండుగ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రయాణాలు కొనసాగుతున్నాయి. పండుగ నాటికి మరింత రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక చర్యలు చేపడుతోంది. ఉగాది పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ఉగాది పండుగ సందర్భంగా నైరుతి రైల్వే ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతుంది. తాజాగా ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది.
ఉగాది రద్దీ నేపథ్యంలో SMVT బెంగళూరు–బెళగావి–SMVT బెంగళూరు ఎక్స్ ప్రెస్(06503/06504 ) స్పెషల్ రైలును నడిపిస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు మార్చి 18న(బుధవారం) సాయంత్రం 7 గంటలకు బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:35 గంటలకు బెళగావికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 22 (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు బెళగావి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ చేరుకుంటుంది.
అటు యశ్వంత్ పూర్–విజయపుర–యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్(06277/06278) స్పెషల్ రైలు మార్చి 18న(బుధవారం)రాత్రి 9.50 గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:45 గంటలకు విజయపుర చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 22న మధ్యాహ్నం 1:30 గంటలకు విజయపుర నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 12:30 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది.
అటు యశ్వంత్ పూర్–మడ్గావ్–బెంగళూరు కంటోన్మెంట్ ఎక్స్ ప్రెస్(06267/06268) స్పెషల్ రైలు మార్చి 18న(బుధవారం) మధ్యాహ్నం యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గురువారం ఉదయం 11 గంటలకు మడ్గావ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:20 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది.
Read Also: ఉగాది ట్రావెలర్స్ కు బ్యాడ్ న్యూస్.. నో రైల్వే టిక్కెట్ రిజర్వేషన్స్!
ఉగాది రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ రైళ్లను ప్రయాణీకులు ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులుస సూచించారు. పండుగ ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరంగా ప్రయాణించాలన్నారు. ఒకవేళ రద్దీ పెరిగితే, మరిన్ని అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: హైదరాబాదీయులకు గుడ్ న్యూస్… ఆ స్పెషల్ రైళ్లు రెగ్యులర్ సర్వీసులు అందిస్తాయ్!