Trivikram: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకులు, హీరోలకి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే మిగతావారు పెద్దగా కనిపించకపోయినా.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో త్రివిక్రమ్ ఎలాంటి శ్రద్ధ వహిస్తారు అంటే ఆయన ఇతర దర్శకుల దర్శకత్వంలో సినిమాలు చేసినా సరే త్రివిక్రమ్ దగ్గరుండి మరీ ఆయన చిత్రాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. అంతేకాదు త్రివిక్రమ్ ఒక కథకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ సినిమాలు చేయరు అనే కామెంట్లు కూడా ఒకానొక సందర్భంలో వినిపించాయి. అలాంటిది ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ సినిమాలకు త్రివిక్రమ్ గుడ్ బై చెప్పబోతున్నారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ సినిమాల ప్లానింగ్ బాధ్యతల నుండి త్రివిక్రమ్ తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇకపై ఆ బాధ్యతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే విశ్వప్రసాద్ బ్యానర్ లో నాలుగు సినిమాలను ఓకే చేసిన పవన్ కళ్యాణ్.. ఆ చిత్రాల నిర్మాణంలో కూడా భాగం కాబోతున్నారట. ఇకపోతే మరి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే సడన్గా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా బాధ్యతలు నుండి తప్పుకోవడం వెనుక ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయా? లేక త్రివిక్రమ్ తన సినిమాల వల్ల బిజీ అయ్యారా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఈ విషయం గనుక నిజమైతే అభిమానులను పూర్తిస్థాయిలో ఆందోళన కలిగించే అంశం అని చెప్పవచ్చు. మరి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాల నుండి తప్పుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలపై ఆ ప్రభావం చూపుతుందేమో అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా ఒక క్రేజీ కాంబో మధ్య దూరం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
ALSO READ:Bigg Boss: వివాదంలో బిగ్ బాస్ బ్యూటీ.. పిల్లల కోసం అలాంటి పనికైనా సిద్ధం అంటూ!
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు అభిమానులను సంతోష పరచడానికి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి చిత్రం హరిహర వీరమల్లు . ఆ తర్వాత ఓజి సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేశారు పవన్ కళ్యాణ్. శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు.. ఇక భారీ అంచనాల మధ్య మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు టికెట్ ధరల పెంపకానికి అనుమతి కూడా లభించింది. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.