BigTV English

Hyderabad Area Names: గచ్చిబౌలి నుంచి తార్నాక దాకా.. హైదరాబాద్ ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే?

Hyderabad Area Names: గచ్చిబౌలి నుంచి తార్నాక దాకా.. హైదరాబాద్ ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే?

Hyderabad History:హైదరాబాద్.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం. సిటీ హిస్టరీలోకి కాస్త తొంగి చూస్తే.. నగరంలోని ప్రతి ప్రాంతం పేరు వెనుక ఓ ప్రత్యేక కథ ఉంటుంది. రాజరికంలా ధ్వనించే బంజారా హిల్స్ నుంచి మలక్‌ పేట వరకు, ప్రతి ఏరియా ఒక నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. కొన్నింటికి పురాణ నేపథ్యం, మరికొన్నింటికి భాష నేపథ్యంలో, ఇంకొన్ని వంశపారంపర్యం నేపథ్యాలను కలిగి ఉన్నాయి. ధర్మేంద్ర ప్రసాద్ రాసిన ‘సోషల్ అండ్ కల్చరల్ జియోగ్రఫీ ఆఫ్ హైదరాబాద్ సిటీ: ఎ హిస్టారికల్ పెర్స్పెక్టివ్’ పుస్తకంలో హైదరాబాద్ లోని ప్రాంతాల పేర్లు, వాటి వెనుక కథలను వివరించారు.


⦿ ఖైరతాబాద్: ఈ ప్రాంతానికి కుతుబ్ షాహి యువరాణి ఖైరతున్నీసా బేగం పేరు పెట్టారు. ఆమె హైదరాబాద్ స్థాపకురాలు సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా సోదరి.

⦿ బంజారా హిల్స్: ప్రస్తుతం బంజారాహిల్స్ అంటే.. ధనవంతులు నివసించే ప్రాంతంగా భావిస్తారు. కానీ, 1920లో ఇక్కడ సంచార బంజారా తెగలు నివాసం ఉండేవారు.


⦿ డబీర్‌ పురా: ‘రాజ్య కార్యదర్శి’ అని అర్థం వచ్చే పర్షియన్ బిరుదు ‘దబీర్-ఉల్-ముల్క్’ నుంచి ఈ పేరు వచ్చింది. దబీర్ అనే పదం పండితుడిని సూచిస్తుంది, ఈ ప్రాంతం చారిత్రక అనుబంధాన్ని వివరిస్తుంది.

⦿ మలక్‌ పేట:  గోల్కొండ రాజవంశానికి చెందిన సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా నమ్మకమైన సేవకుడు మాలిక్ యాకూబ్ పేరు నుంచి వచ్చింది. అతడి సేవకు గుర్తింపుగా, సుల్తాన్ ఈ ప్రాంతంలో భూమిని బహుమతిగా ఇచ్చాడు. మాలిక్ యాకూబ్ అక్కడ తన నివాసం, మార్కెట్‌ను స్థాపించాడు. ఆ ప్రాంతానికి ‘మాలిక్‌పేట’ అని పేరు పెట్టారు. ఈ పేరు ఇప్పుడు ‘మలక్‌పేట’గా మారింది.

⦿ సోమాజిగూడ: 1853లో రాయ్ రాయన్ షామ్ రాజ్ రిజర్వ్‌లో ఉద్యోగిగా ఉన్న పండిట్ సోనాజీ (సోమాజీగా మార్చబడింది) పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు.

⦿ గచ్చిబౌలి: ఈ  ప్రాంతంలో సున్నపురాయితో కూడిన మెట్ల బావి ఉండేది. దానిని గచ్చిబౌలిగా పిలిచేవారు.

⦿ మోతీ గల్లీ: హైదరాబాద్ లాడ్ బజార్‌కు దక్షిణంగా ఉన్న ఈ ప్రాంతం కుతుబ్ షా శకంలో ‘మోతీ’ లేదంటే ముత్యాల వ్యాపారానికి కేంద్రంగా ఉంది. అందువల్ల దానికి మోతీగల్లీ అని పేరు వచ్చింది.

⦿ అబిడ్స్: హైదరాబాద్‌ సందడిగా ఉండే ప్రాంతానికి ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ వార్డ్‌ రోబ్‌ కు సేవకుడు, స్టీవార్డ్ అయిన ఆల్బర్ట్ అబిద్ అనే యూదుడి పేరు పెట్టారు.

⦿ ట్రూప్ బజార్: ఈ ప్రాంతానికి 18వ శతాబ్దంలో కమాండర్ డి బుస్సీతో కలిసి వచ్చిన ఫ్రెంచ్ దళాల పేరు పెట్టారు.

⦿ ఫతే మైదాన్: హైదరాబాద్‌లోని ఈ చారిత్రాత్మక ప్రదేశానికి 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ సుల్తాన్ ను ఓడించిన తర్వాత పేరు పెట్టారు. గోల్కొండ కోట ముట్టడి సమయంలో, ఔరంగజేబు సైన్యం ఈ బహిరంగ మైదానంలో విడిది చేసింది.

⦿ గన్‌ఫౌండ్రీ: 1795లో ఫ్రెంచ్ జనరల్ మోన్సియర్ రేమండ్ నిర్మించిన ఫిరంగి ఫౌండ్రీ పేరు దీనికి పెట్టారు. దీనిని ‘టాప్ కా సాంచా’ అని కూడా పిలుస్తారు.

⦿ దూద్‌ బౌలి: పాత బస్తీలోని ఫతే దర్వాజా సమీపంలో ఒక బావి ఉండేది. పాల వ్యాపారులు అక్కడికి వచ్చి పాలు అమ్మేవాళ్లు. పాల వ్యాపారులు వచ్చే బావి కావడంతో దాన్ని దూద్ బౌలిగా పిలవడం మొదలుపెట్టారు.

⦿ తార్నాక: ఇక్కడ నిజాం నవాబుకు చెందిన మామిడి, ద్రాక్ష తోట ఉండేది. నాకా అంటే చెక్ పోస్టు. ఈ తోటకు రక్షణగా ఏర్పాటు చేసిన వైర్డ్ చెక్‌పోస్ట్ ను తార్నాక అని పిలిచేవారు.  ఇవేకాదు, హైదరాబాద్ లోని ఇంకా చాలా ప్రాంతాల పేర్ల వెనుక చాలా నేపథ్యాలు ఉన్నాయి.

Read Also: ఫ్లైట్ లోకి కంగారూ.. ప్యాసింజర్ల పరేషాన్, నెట్టింట వీడియో వైరల్!

Related News

Trains cancelled: 68 రైళ్లు రద్దు, 24 తిరిగి ప్రారంభం.. ఆ లైన్ లో ఊరట కలిగించిన రైల్వే ప్రకటన..!

Railways TC: అబ్బా.. ఎవరీ హ్యాండ్సమ్.. నెట్టింట వైరల్ అవుతున్న రైల్వే టీసీ వీడియో!

New Visa Rules: వీసా నిబంధనలు మరింత కఠినతరం, ఇక ఆ దేశానికి వెళ్లడం అంత ఈజీ కాదు!

Special Trains: పండుగ సీజన్ కోసం మరో 150 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్!

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Big Stories

×