BigTV English

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్


Boney Kapoor on Sivagami Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం బాహుబలి. ఈసినిమాతోనే పాన్ ఇండియా ట్రెండ్ ని పరిచయం చేశాడు రాజమౌళి. ఈ సినిమా స్రష్టించిన సంచలనం అంత ఇంత కాదు. బాహుబలి తర్వాత హాలీవుడ్ సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసింది. వెయ్యి కోట్ల వసూళ్లు చేసి అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో.. ఇందులో శివగామి పాత్ర అంతే స్థాయిలో ప్రశంసలు అందుకుంది. శివగామి పాత్ర రమ్యకృష్ణ ప్రాణం పోసింది.

శివగామి వివాదం ఇదే

రోల్ ఆమె తప్ప ఎవరూ చేసిన ఇంతగా ఇంపాక్ట్ ఉండేది కాదని, ఈ రేంజ్ లో టాక్ వచ్చేది కాదని ఏకంగా రాజమౌళి ఒప్పుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ బాహుబలిపై అంత బజ్ రావడానికి శివగామి పాత్ర కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. అంతగా ప్రశంసలు అందుకు శివగామి రోల్ కి మొదటి ఛాయిస్ రమ్యకృష్ణ కాదనే విషయం తెలిసిందే. మొదట ఈ రోల్ కోసం దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించినట్టు స్వయంగా జక్కన్న చెప్పారు. బాహుబలి మూవీ రిలీజ్ తర్వాత ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. అదే టైంలో శ్రీదేవిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. శివగామి పాత్ర చేయాలంటే ఆమె గొంతమ్మ కోరికలు కోరిందని, వాటిని నిర్మాతలు దడుసుకున్నారని అన్నారు.


శ్రీదేవి భారీ డిమాండ్స్

ఈ పాత్రకు తాను ఒప్పుకోకపోవడమే చాలా మంచిదైందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో శ్రీదేవి మంచి రోల్ వదులుకుందని అంతా అనుకున్నారు. దీనిపై అప్పట్లో శ్రీదేవి కూడా స్పందించింది. తాను ఎలాంటి డిమాండ్స్ చేయలేదని కూడా చెప్పింది. అయితే ఇప్పటికీ ఈ అంశం వివాదంగానే ఉంది. రాజమౌళి స్వయంగా అలా అనడం, తాను అలాంటి డిమాండ్స్ చేయలేదని చెప్పడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికీ ఈ వ్యవహరం హాట్ టాపిక్ గానే ఉంది. అయితే తాజాగా ఈ వివాదంపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్పందించారు. తాజా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన శివగామి పాత్ర వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు.

నిర్మాతలు శ్రీదేవిని అవమాన పరిచారు

దీంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.  కాగా బాహుబలి శివగామి పాత్రకు మొదట శ్రీదేవి సంప్రదించారు. తను తన స్టార్ డమ్ మేరకే పారితోషికం డిమాండ్ చేసింది. కానీ, నిర్మాతలు అంత ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీ కంటే తక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని తనని అవమానపరిచారు. పైగా దీనిపై తను ఏవేవో డిమాండ్ చేసిందని దర్శకుడు రాజమౌళికి తప్పుగా చెప్పారు. ‘తాము భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు మరిన్ని కండిషన్స్ పెట్టామని నిర్మాతలు దర్శకుడు రాజమౌళికి ఏవేవో చెప్పి ఆయనను తప్పుదోవ పట్టించారు. కేవలం మేము పిల్లల స్కూల్ సెలవులకు అనుగుణంగా షెడ్యూల్ మార్చమని మాత్రమే చెప్పాం.

అంతే తప్పా మరే డిమాండ్స్ మేము చేయలేదు. కానీ, నిర్మాతలు మాత్రం తాము బిజినెస్ క్లాస్ ప్లయిట్ టికెట్స్ అడిగామని, స్టార్ హోటల్లో రూం బుక్ చేయాలని డిమాండ్ చేశామని రాజమౌళికి ఏవేవో కల్పించి చెప్పారు‘ అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. కాగా బాహుబలి రిలీజ్ తర్వాత రాజమౌళిలోఇంటర్య్వూలో మాట్లాడుతూ.. శివగామి పాత్రకు శ్రీదేవి గారు ఒప్పుకోకపోవడమే మంచిది అయ్యింది. ఈ సినిమా కోసం అడిగితే ఆమె గొంతమ్మ కోరికలు కోరారు. తన పాత్ర కోపం రూ. 100 కోట్లు పారితోషికం అడిగారు. అంతేకాకుండా బిజినెస్ క్లాస్ ప్లయిట్ టికెట్స్, ఫైవ్ స్టార్ హోటల్లోనే రూం కావాలి అని డిమాండ్ చేశారు‘ అని ఆయన అన్నారు.

Related News

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×