సోషల్ మీడియాలో ఎవరు? ఎందుకు? ఎలా పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. కొంత మంది అనామకులు ఓవర్ నైట్ లో సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలుగా మారిపోయారు. ఓ రేణూ మండల్ నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా వరకు సోషల్ మీడియా కారణంగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మోనాలిసా బాలీవుడ్ స్టార్ల కంటే అందంగా మారి సినిమా అవకాశాలు పొందుతోంది. ఇక తాజాగా ఓ రైల్వే టీసీ వీడియో ఒకటి నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. అతడి కోసం అమ్మాయిలంతా తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా ‘foodwithepshi’ అనే యువతి తన ఇన్ స్టాలో ఓ రైల్వే టీసీ వీడియో ఒకటి షేర్ చేసింది. సుమారు అర నిమిషం పాటు ఉన్న వీడియోలో అతడు ఏసీ కంపార్ట్ మెంట్ లో టికెట్స్ చెక్ చేస్తున్నాడు. స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటన్నాడు. చూడ్డానికి ఓ బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. అతడి వీడియోను తన ఫోన్ లో షూట్ చేసి ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి అంతానికి అమ్మాయిలు ఫిదా అవుతున్నారు. అతడి గురించి ఆరా తీస్తున్నారు.
ఇక ఈ వీడియో కింది అమ్మాయిలు తన పట్ల తమ ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయిల కామెంట్స్ కు మరికొంత మంది హిలేరియస్ రిప్లై ఇస్తున్నారు. “టికెట్ ను కిటికీలో నుంచి బయటపడేయండి. అప్పుడు అడుతు మిమ్మల్ని పట్టుకుంటాడు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “అతను ప్రభుత్వ ఉద్యోగి, అతనికి చాలా అందమైన భార్య వస్తుంది, అతని గురించి మీరు కలలు కనకండి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “వేరొకరి సోదరుడు, కొడుకు, బాయ్ ఫ్రెండ్ ని చూసి మీరు అలా మాట్లాడ్డం సిగ్గుగా లేదా? ఇంతకీ అతడు ఏ రూట్ లోని రైల్లో టికెట్స్ చెక్ చేస్తాడు?” అంటూ ఓ అమ్మాయి ఫన్నీగా కామెంట్ చేసింది. “నా దగ్గర టికెట్ లేదు, దయచేసి నన్ను పట్టుకోండి” అని మరో అమ్మాయి కామెంట్ చేసింది. “అతడు నాకు తెలుసు. ఇంకా పెళ్లి కాలేదు” అని ఇంకో వ్యక్తి చెప్పుకొచ్చాడు. “ఆ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు. నిజానికి అతను ఫేమస్ అయ్యాడని కూడా అతనికి తెలియకపోవచ్చు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇది చాలా తప్పు! రైలు నంబర్, రూట్ వివరాలు లేకుండా ఈ రీల్‌ను పోస్ట్ చేయడం బాగా లేదు” ఇంకో యువతి కామెంట్ చేసింది. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. నెటిజన్లకు మంచి వినోదాన్ని పంచుతోంది.
Read Also: వీసా నిబంధనలు మరింత కఠినతరం, ఇక ఆ దేశానికి వెళ్లడం అంత ఈజీ కాదు!