OTT Movie : ఎన్నో సినిమాలు రకరకాల జానర్లతో డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిలో టైమ్ లూప్‌లో తిరిగే స్టోరీలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఈ సినిమాలు నెక్స్ట్ ఏం జరుగుతుందనే టెన్షన్ పెంచుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమాలో, ఒక అమ్మాయి మర్డర్ చుట్టూ ఈ టైమ్ లూప్ తిరుగుతుంది. నేరస్తున్ని పట్టుకునే క్రమంలో ఈ టైమ్ లూప్ మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ట్రీ అనే ఒక కాలేజీ విద్యార్థిని, తన పుట్టినరోజున ఒక పార్టీ తర్వాత కళ్ళు తెరుస్తుంది. అయితే అంతకు ముందు రోజు రాత్రి ఆమె ఒక బేబీ మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి చేత హత్యకు గురవుతుంది. అయితే ఆమె మళ్లీ అదే ఉదయం కార్టర్ గదిలో మేల్కొంటుంది. అదే రోజు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఆమె టైమ్ లూప్‌లో చిక్కుకుంటుంది. ట్రీ తనని చంపిన హంతకుడిని కనుగొని, లూప్‌ను బ్రేక్ చేయడానికి ప్రతి రోజు ఆమె చనిపోతూ, మళ్లీ మేల్కొంటూ హంతకుడిని కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె స్నేహితులు డానియెల్, లోరీ, గ్రెగొరీ తో జరిగిన సంఘటనలను ఆమె గమనిస్తూ, హంతకుడు ఎవరో గుర్తించడానికి ఆధారాలను సేకరిస్తుంటుంది. ఈ విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ కార్టర్ సహాయం చేస్తాడు.
ఆమె జీవితంలోని తప్పులను సరిదిద్దడానికి, మరింత మంచి వ్యక్తిగా మారడానికి ఈ లూప్ ఒక అవకాశంగా మారుతుంది. ట్రీ తన రోజును జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ, తన రూమ్‌మేట్ లోరీపై అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే లోరీ ఆమెకు ఒక కప్‌కేక్ ఇస్తుంది. అది ఆమె హత్యకు కీలకమైన సూచనగా కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ తో అసలు హంతకుడు ఎవరో బయటపడుతుంది. ఆతరువాత ట్రీ, కార్టర్‌తో కలిసి తన పుట్టినరోజును సంతోషంగా జరుపుకుంటుంది. ఆమె జీవితం కొత్తగా మొదలవుతుంది. ఈ హంతకుడు ఎవరు ? ఎందుకు ట్రీ ని చంపాలనుకున్నాడు ? చివరికి కిల్లర్ ఏమవుతాడు ? ఈ టైమ్ లూప్ ఏమవుతుంది ? అనే ప్రశ్నకు సమాధానాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
‘హ్యాపీ డెత్ డే’ (Happy Death Day) 2017లో విడుదలైన అమెరికన్ స్లాషర్-కామెడీ హారర్ చిత్రం. క్రిస్టోఫర్ లాండన్ దర్శకత్వంలో, జెస్సికా రోథ్ (ట్రీ గెల్బ్‌మన్), ఇజ్రాయెల్ బ్రౌసార్డ్ (కార్టర్ డేవిస్), రూబీ మోడిన్ (లోరీ స్పెంగ్లర్), రాచెల్ మాథ్యూస్ (డానియెల్), చార్లెస్ ఐట్కెన్ (గ్రెగొరీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2017 అక్టోబర్ 13న థియేటర్లలో విడుదలై, 1 గంట 36 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.6/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, ఆపిల్ టీవీలో ఇంగ్లీష్ ఆడియోతో, తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
Read Also : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్