BigTV English

Coconut Water: కొబ్బరి నీళ్ళు నేరుగా తాగకూడదా? అమ్మో.. ఇంత డేంజర్ అని అస్సలు తెలియదే!

Coconut Water:  కొబ్బరి నీళ్ళు నేరుగా తాగకూడదా? అమ్మో.. ఇంత డేంజర్ అని అస్సలు తెలియదే!

Coconut Water Drinking Tips:

కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి.  కొబ్బరి నీళ్లకు సహజమైన, హైడ్రేటింగ్ డ్రింక్ గా మంచి గుర్తింపు ఉంది.  చాలా మంది కొబ్బరి నీళ్లను నేరుగా తాగడం సురక్షితం అని భావిస్తారు. అయితే, తాజా పరిశోధనలో నేరుగా కొబ్బరి నీళ్లను తాగడం ప్రమాదకరం అని తేలింది. కొబ్బరి బొండాలను చెట్టు నుంచి కొట్టి దుకాణానికి తెచ్చిన తర్వాత, అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా తేమ కారణంగా చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. అంతేకాదు, కొబ్బరి బోండాలపైన హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాల లాంటి ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉంటుంది. కొబ్బరి నీటిలోకి ఫంగస్ చేరే ప్రమాదం ఉంటుంది. తాజాగా ఫంగల్ కాలుష్యం కారణంగా డెన్మార్క్ లో ఓ మనిషి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే కొబ్బరి నీళ్లు తాగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


తాజాగా కనిపించే కొబ్బరి ప్రాణాంతకంగా మారుతుందా?   

వాస్తవానికి చెట్టు నుంచి కొట్టి తీసుకొచ్చి నిల్వ చేసిన కొబ్బరి నీళ్లు అంత సురక్షితం కాదు. తేమతో కూడిన పరిస్థితులలో నిల్వ చేసినప్పుడు,  అవి కాలుష్యానికి గురవుతాయి. బాక్టీరియా, శిలీంధ్రాలు కొబ్బరి టెంకలోని పగుళ్ల ద్వారా లోపలికి వెళ్తాయి. కొబ్బరి నీళ్లను కలుషితం చేస్తాయి. ఆ నీళ్లను తాగిన తర్వాత ప్రాణాంతక 3-నైట్రోప్రొపియోనిక్ యాసిడ్ కడుపులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా డెన్మార్క్‌ లో 69 ఏళ్ల వ్యక్తి  ఫంగస్ కారక కొబ్బరి నీళ్లు తాగి చనిపోయాడు. 3-నైట్రోప్రొపియోనిక్ యాసిడ్ (3-NPA) కారణంగా ఆర్గాన్స్ దెబ్బతిని చనిపోయాడు.

కలుషితమైన కొబ్బరి నీళ్ల ఆరోగ్య సమస్యలు  

⦿ జీర్ణకోశ సమస్యలు: నిల్వ చేయబడిన, కలుషితమైన కొబ్బరి నీళ్లలో జీర్ణ సమస్యలకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ నీళ్లు తాగితే వికారం, విరేచనాలు, పొత్తికడుపు తిమ్మిరి ఏర్పడుతాయి.


⦿ నాడీ సంబంధిత లక్షణాలు: శిలీంధ్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే 3-నైట్రోప్రొపియోనిక్ యాసిడ్(3-NPA) లాంటి కొన్ని విషపదార్థాలు నాడీ వ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తాయి.  గందరగోళం, తలతిరగడం, అసాధారణ కండరాల సంకోచాలతో పాటు మూర్ఛకు  దారితీసే అవకాశం ఉంది.

⦿ శ్వాసకోశ సమస్యలు: మరింత తీవ్రమైన సందర్భాల్లో, శిలీంధ్రాల పాయిజన్ తో కూడిన కొబ్బరి నీళ్ళు శ్వాసకోశ ఇబ్బందులకు కారణమవుతాయి. శ్వాస ఆడకపోవడం, ఛాతీ బిగుతుగా మారడం, ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు తీరమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

⦿ ప్రాణాంతక సమస్యలు:  కలుషితమైన కొబ్బరి నీటితో కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. టాక్సిన్ ఉత్పత్తి చేసే శిలీంధ్రాలు ఉన్న కొబ్బరి నీళ్లు తాగితే ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగి మరణం ఏర్పడుతుంది.

కొబ్బరి నీళ్లను సురక్షితంగా ఎలా తాగాలి?

⦿ కొబ్బరికాయల నుంచి నేరుగా నీరు తాగడం మానుకోవాలి. కొబ్బరికాయ పగుళ్లు, కోతల కారణంగా సూక్ష్మజీవులు నీటిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.

⦿ కొబ్బరి నీటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. షెల్ లోపల శిలీంధ్ర, బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించబడుతాయి.

⦿ దుర్వాసన, జిగటగా కనిపించే కొబ్బరి బోండాలను తీసుకోకపోవడం ఉత్తమం.

⦿ నమ్మకమైన బ్రాండ్‌ల నుంచి ప్రాసెస్ చేయబడి, సీల్ వేసిన కొబ్బరి నీటిని మాత్రమే తీసుకోండి.

⦿ ప్యాకేజ్ చేయబడిన కొబ్బరి నీళ్లకు భద్రతా తనిఖీలు ఉంటాయి.  టాక్సిన్‌లను కలిగి ఉండే అవకాశం తక్కువ.

Read Also: బట్టతల బాబులకు బంగారం లాంటి న్యూస్, ఇలా చేస్తే నేచురల్‌ గానే జుట్టు వచ్చేస్తాదట!

Related News

Artificial Sweeteners: ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు వాడుతున్నారా? అవి మీ మెదడును ఏం చేస్తాయో తెలుసా?

Bald Head: బట్టతల బాబులకు బంగారం లాంటి న్యూస్, ఇలా చేస్తే నేచురల్‌ గానే జుట్టు వచ్చేస్తాదట!

Ganesh Laddu: ఒక లడ్డు.. లక్షలు కాదు కోట్లు.. ఎక్కడెక్కడ ఎంత ధర పలికిందంటే?

Phone Charging: ఫోన్ చార్జింగ్ అయిపోయిన తరువాత.. చార్జర్ అలాగే వదిలేస్తున్నారా?

Tulsi Tree: తరచూ తులసి మొక్క ఎండిపోతుందా ? ఈ టిప్స్ ట్రై చేయండి

Big Stories

×