OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు అందరూ ఓటీటీ వైపే చూస్తున్నారు. నచ్చిన సినిమాలను దొరికిన సమయంలో చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. వీటిలో సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా ఒక గడియారం చుట్టూ తిరుగుతుంది. దీని వల్ల భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఈ సన్నివేశాలను ఒంటరిగా మాత్రం చూడలేము. గుండె గట్టిగా ఉన్నవాళ్ళే ఈ సినిమాని చూడండి. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
ఎల్లా పటేల్ అనే 30 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్, తన భర్త ఐడన్ తో సంతోషకరమైన జీవితం గడుపుతుంటుంది. కానీ పిల్లలు కనాలనే కోరిక ఆమెకు ఏమాత్రం ఉండదు. అయితే స్నేహితులు, కుటుంబం, సమాజం నుంచి పిల్లలు కలిగి ఉండాలనే ఒత్తిడి ఎదురవుతుంది. ముఖ్యంగా ఆమె తండ్రి హోలోకాస్ట్ వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటాడు. ఈ సమయంలో ఆమె అమ్మమ్మ గుర్తుగా ఉన్న ఒక బయోలాజికల్ క్లాక్ విరిగిపోతుంది. దానిని సరిచేయడానికి డాక్టర్ ఎలిజబెత్ నడిపే ఒక క్లినికల్ కి వెళ్తుంది. ఈ సమయంలో ఆమెకు కూడా తల్లి కావాలనే కోరిక కలుగుతుంది. ఇప్పుడు స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇక్కడ ఆమెకు హార్మోన్ మాత్రలు, రోర్‌షాక్ టెస్ట్‌లు, సెన్సరీ డిప్రివేషన్ వంటి చికిత్సలు ఇవ్వబడతాయి.
కానీ దీంతో ఆమెకు భయంకరమైన హాల్యూసినేషన్స్ మొదలవుతాయి. చికిత్స జరుగుతున్న కొద్దీ, ఎల్లా రంగులను చూడలేకపోవడం, నిరంతరం క్లాక్ టిక్కింగ్ శబ్దం వినడం, ఆమె స్నేహితురాలు షానా బిడ్డకు హాని చేయడానికి ప్రయత్నించడం వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొంటుంది. ఆమె నర్సరీలో భయంకరమైన చిత్రాలు గీస్తూ, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటుంది. దీనివల్ల ఎల్లా తన తండ్రిని హాల్యూసినేషన్‌లో చంపేస్తుంది. చివర్లో ఆమె క్లినిక్ నుంచి తప్పించుకుని, సముద్రం వద్ద ఒక రాతిపై కూర్చుని తన ఒత్తిడి నుంచి విముక్తి పొందినట్లు భావిస్తుంది. ఈ క్లైమాక్స్ ఒక ప్రేక్షకులకు ఒక కన్ఫ్యుస్ ని క్రియేట్ చేస్తుంది. ఆమె చివరికి ఏమవుతుందనేది సస్పెన్స్ గా ఉంటుంది.
‘క్లాక్’ (Clock) 2023లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం. అలెక్సిస్ జాక్‌నో దర్శకత్వంలో డయానా అగ్రన్ (ఎల్లా పటేల్), మెలోరా హార్డిన్ (డాక్టర్ ఎలిజబెత్ సిమన్స్), జే అలీ (ఐడెన్ పటేల్), సౌల్ రుబినెక్ (జోసెఫ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 20th డిజిటల్ స్టూడియో నిర్మించిన ఈ చిత్రం 2023 మార్చి 31న ఓవర్‌లుక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2023 ఏప్రిల్ 28 నుంచి హులు, జియో హాట్ స్టార్ లో స్ట్రామింగ్ కి వచ్చింది. 1 గంట 31 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.0/10 రేటింగ్ పొందింది.
Read Also : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన పని… వీడియో తీస్తూ దారుణంగా… విష్ణు ప్రియ ఇలాంటి పాత్రలోనా ?