BigTV English

BJP State President: బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు ఎందుకింత ఆలస్యం..

BJP State President: బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు ఎందుకింత ఆలస్యం..

BJP State President: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ సంస్థగత ఎన్నికలకు బ్రేక్ పడనుందా? అధ్యక్ష పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలంతా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనా? ఇటు పార్టీ వర్గాల్లోనూ, అటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఆసక్తి రేపుతున్న అధ్యక్ష పదవిపై కూర్చోబోయే నేత ఎవరు?


టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సందిగ్ధత నెలకొంది. కమలం పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరనే ప్రశ్న ఇప్పటికే అందరి మెదళ్లను తొలుస్తోంది. ఎవరికి బాధ్యతలు ఇస్తారనే అంశంపై పార్టీతో పాటు రాజకీయవర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం స్టేట్ చీఫ్ నియామక ప్రక్రియకు కొన్నాళ్ళు బ్రేక్ వేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. బ్రేక్ వేస్తారా..? లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సంస్థగతoగా అధ్యక్షుడిని ఎంపిక చేస్తారా..? అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

ALSO READ: Pawan kalyan: టీడీపీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నిక.. చంద్రబాబుకు పవన్ శుభాకాంక్షలు


తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రికిషన్ రెడ్డి అధ్యక్షతనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన్ను మార్చి కొత్త వారికి బాధ్యతలు ఇస్తే ఇబ్బందులు ఎదురువుతాయనే ఉద్దేశ్యంతో కిషన్ రెడ్డినే కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు వస్తే సమయం తక్కువగా ఉండి కార్యవర్గం సెట్ అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు పార్టీలో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది..

కాంగ్రెస్ బీసీ నాయకుడిని పీసీసీ చీఫ్ గా నియమించడంతో బీజేపీ సైతం బీసీకే ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ, బీజేపీ కొత్త ప్రెసిడెంట్ ఎవరు అవుతారనేది మాత్రం అంతుపట్టడం లేదు. స్థానిక సంస్థలఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉన్న ఫలంగా అధ్యక్షుడి ఎంపిక జరిగితే ఆ ప్రభావం పార్టీ కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో అని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొత్త పాత నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతున్న నేపధ్యంలో కొత్తగా వచ్చిన అధ్యక్షుడుకి రాష్ట్ర నాయకత్వంతో పాటు, పార్టీ క్యాడర్ సహాకరిస్తుందా..? అనే సందిగ్ధత నెలకొంది. అంతేకాదు ఒకవేళ స్థానిక ఎన్నికల్లో విఫలం అయితే ఆ ప్రభావం చివరి వరకు ఉంటుందనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రాబోయే కాలంలో వరసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో అధ్యక్షుడి ఎంపిక ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ALSO READ: AP Pension: ఏపీలో ఎల్లుండి పెద్ద పండుగ.. అసలు మిస్ అవ్వొద్దు.. కానుక తీసుకోండి!

ప్రస్తుతం కేంద్ర మంత్రి బాధ్యతలతో పాటు కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 8 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడంలో కిషన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇటు స్టేట్ చీఫ్ గా, అటు కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఉండటతో స్టేట్ చీఫ్ గా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నానని, తొందరగా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవాలని ఉందన్న అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి పదేపదే వ్యక్తం చేస్తున్నారు. ఇన్సైడ్ మాత్రం కిషన్ రెడ్డి అధ్యక్ష పీఠం మీద ఇంకొకరుని కూర్చోకుండా చేస్తున్నారన్న విమర్శలు కిషన్‌రెడ్డి పై బలంగా వినిపిస్తున్నాయి. బయటకు మాత్రమే నాకొద్దు ఈ అధ్యక్ష పదవి అంటారు. లోన మాత్రం చేసేది చేస్తున్నారని పార్టీ నేతలు చిర్రుబుర్రులాడుతున్నారు.

ఈ మధ్యకాలంలోనే జమ్ము కాశ్మీర్ రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి రిలీవ్ అవ్వడంతో ఇప్పుడిప్పుడే తెలంగాణ పార్టీ కార్యకలాపాలపై కిషన్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. వరుసగా రివ్యూలు చేపడుతున్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్, హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలతో పాటు మెంబర్ షిప్ డ్రైవ్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో రాష్ట్రా వ్యాప్తంగా తిరంగ ర్యాలీలు చేస్తూ ప్రజలను బీజేపీ వైపుకు తిప్పు కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ తిరoగ ర్యాలీల ఫార్ములా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలనిస్తుందా లేదా అనేది అటుంచితే..? పార్టీ అధ్యక్షుడి పీఠంపై పలువురు నేతలు గంపెడాశలతో ఉన్నారు. ఎవరికి వారు తమకే వస్తుందని ధీమాతో ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. స్థానిక సంస్థలు దగ్గర పడుతుండటంతో సంస్థగత ఎన్నికలు పెండిగులో పెట్టే అవకాశమైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బూత్ స్థాయి, మండల డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్ష ఎంపికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్టేట్ చీఫ్ ఎన్నిక మాత్రమే, ఈ నెలాఖరుకు అధ్యక్ష ఎన్నిక పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు ఏడాది నుంచి చెప్పుకొస్తున్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి

మొత్తమ్మీద తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక రోజుకొక మలుపు తిరుగుతోంది. అధ్యక్షుడు ఎంపికలో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో అధిష్ఠానం ఉందనే చర్చ జరుగుతున్న తరుణంలో ఉగ్రదాడులు తెరమీదకు వచ్చాయి. ఆపరేషన్ సింధూర్‌తో అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. ఇక ఆపరేషన్ సింధూర్ చల్లబడింది రెపో మాపో అధ్యక్షుడిని ప్రకటిస్తారని అనుకుంటున్న నేపధ్యంలో కాళేశ్వరం కమిషన్ నోటీసుల పంచాయితీ తెరమీదకు రావడంతో ఇప్పట్లో రాష్ట్ర అధ్యక్ష పంచాయితీ లేనట్టే అంటున్నారు. కిషన్ రెడ్డి అనుకున్న రాజకీయమే బీజేపీలో నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కిషన్ రెడ్డే అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే దాదాపు మరో మూడు నుంచి నాలుగు నెలలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న అధ్యక్ష పదవిపై గంపేడాశలు పెట్టుకొని ఉన్న కాషాయ నేతలకు నిరాశే మిగలనుంది.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×