BigTV English

Kangaroo In Plane: ఫ్లైట్ లోకి కంగారూ.. ప్యాసింజర్ల పరేషాన్, నెట్టింట వీడియో వైరల్!

Kangaroo In Plane: ఫ్లైట్ లోకి కంగారూ.. ప్యాసింజర్ల పరేషాన్, నెట్టింట వీడియో వైరల్!

అందమైన కంగారూ. వీపుకు బ్యాగ్ తగిలించుకుంది. ముందు కాళ్లతో బోర్డింగ్ పాస్ పట్టుకుని విమానం ఎక్కింది. చెకింగ్ తర్వాత తన సీటులోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లక్షలాది మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. కంగారూలు విమానం కూడా ఎక్కుతున్నాయా? అని పరేషాన్ అయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేశారు. చివరకు ఏం తేలిందేట?


ఇంతకీ ఈ వైరల్ వీడియోలో ఏం ఉందంటే?

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఇన్ఫినిట్ అన్‌రియాలిటీ పోస్ట్ చేసింది. నిజానికి ఈ పేజీలో వింతైన AI-జనరేటెడ్ యానిమల్ క్లిప్‌లకు షేర్ చేస్తుంది. కానీ, ఈ వీడియో అచ్చం నిజమైన దానిలా కనిపించింది. విమానంలో బోర్డింగ్ పాస్‌ను పట్టుకుని ప్రశాంతంగా కనిపించే కంగారూ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ వీడియో నెటిజన్లలో వినోదంతో పాటు గందరగోళం కలిగింది. ఇందులో కంగారూ ఓపికగా నిలబడి ఉండగా, ఒక మహిళ విమాన సహాయకురాలితో వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత కంగారూ అక్కడి నుంచి తన సీట్ లో కూర్చునేందుకు వెళ్లడం కనిపిస్తుంది. చాలా మంది ఈ వీడియోను చూసి నిజమైనదేనని భ్రమపడ్డారు.


AI- ద్వారా కంగారూ వీడియోను క్రియేట్ చేసిన ఇన్ఫినిట్ అన్‌రియాలిటీ  

ఇక ఈ కంగారూ వీడియోను కృత్రిమ మేధస్సును ఉపయోగించి సృష్టించబడింది. మొదట ఇన్ఫినిట్ అన్రియాలిటీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా పోస్ట్ అయ్యింది. ఇప్పటికే ఈ పేజీ ద్వారా పలు జంతువులకు సంబంధించిన వీడియోలను రూపొందించింది. ఇప్పటికే విమానం సీటులో కూర్చున్న నీటి గుర్రం, విమానంలో ఎక్కే జిరాఫీ, స్త్రోలర్‌ లో పంది వీడియోలను క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే ఫార్మాట్ లో కంగారు వీడియోను వదిలి నెటిజన్లను కంగారు పెట్టింది.

Read Also: భారత్ లో ఐస్ క్రీమ్ అమ్ముతున్న పాక్ మాజీ ఎంపీ.. మరీ ఇంత ఘోరమా?

సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వ్యూస్

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్ అయ్యింది. కొద్ది గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. నెటిజన్లు ఈ వీడియోను చూసిన ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.  “కంగారూ బోర్డింగ్ పాస్ పట్టుకుని చాలా క్రమశిక్షణతో నిలబడింది. విమానంలోకి ఎక్కే చాలా మంది మనుషుల కంటే 100 రెట్లు బెటర్” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “మేం ఈ వీడియో ఏఐ క్రియేటెడ్ వీడియో అని అస్సలు నమ్మలేకపోతున్నాం” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇలాంటి ఫేక్ వీడియోలను సోసల్ మీడియాలో పోస్టు చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “దేవుగా మమ్మల్ని ఈ ఏఐ చెత్త వీడియోల సునామీ నుంచి కాపాడు” అని ఇంకో నెటిజన్లు కామెంట్ చేశాడు.

Read Also: పెళ్లి పందిరిలోకి అనుకోని అతిథి, బంధువులంతా పరుగో పరుగు!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×