Pawan kalyan: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబు ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఆయన మరోసారి ఎన్నికైనందుకు శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్టీఆర్ సంకల్పంతో ఆవిర్భవించిన టీడీపీ, చంద్రబాబు నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతోందన్నారు.
అపార అనుభవం, దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయకత్వం ఏపీ సర్వతోముఖాభి వృద్ధి కి ఎంతైన అవసరమన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ ఘనంగా నిర్వహించుకుంటున్న తొలి మహానాడు అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. 12వ సారి టీడీపీ అధ్యక్షునిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ‘సైబరాబాద్’గా మార్చి, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రస్తావించారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలను ఆకర్షించిన ఘటన ఆయనే చెల్లిందన్నారు. 1999లో ఆంధ్రప్రదేశ్ విజన్-2020ను రూపొందించిన ఘనత ఆయనకే చెల్లిందన్నారు.
ఆర్థిక సంస్కరణలు, సాంకేతికత ఆధారిత అభివృద్ధి వైపు పయనింప చేశారని రాసుకొచ్చారు. ఆయన అపారమైన అనుభవం, దూర దృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
ALSO READ: ఏపీలో ఎల్లుండి పెద్ద పండుగ.. అస్సలు మిస్ కావద్దు
దేశాభివృద్ధికి మరింత కృషి చేయాలనే ఆకాంక్షతో నూతన బాధ్యతల్లో అన్నివిధాలా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ముగించారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, శ్రీ @ncbn గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉంది.
2024 ఎన్నికల్లో NDA కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన తరవాత @JaiTDP ఘనంగా…
— Pawan Kalyan (@PawanKalyan) May 29, 2025