ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలు భారతీయులకు వీసా లేకుండా అనుమతిస్తుంటే, మరికొన్ని ఆ దేశానికి వెళ్లిన తర్వాత వీసా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని దేశాలు భారతీయ పౌరులకు వీసా నిబంధలనలను కఠినతరం చేస్తున్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా వీసా నిబంధనలకు మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతదేశ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాలు జారీ చేసిన పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లను(PCC) మాత్రమే అంగీకరించనున్నట్లు ఆదేశం వెల్లడించింది.
ఇప్పటి వరకు చాలా మంది న్యూజిలాండ్ వీసా దరఖాస్తుదారులు డిప్యూటీ కమిషనర్ లేదంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి అదీకాదంటే, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. తమ మీద ఎలాంటి కేసులు లేవని ఆయా పోలీసుల అధికారుల నుంచి సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ విషయంలో ఇప్పుడు కీలక మార్పులు చేస్తూ న్యూజిలాండ్ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తును సమర్పించేటప్పుడు ఆరు నెలల్లోపు ఉన్న PCCని అందించాలని సూచించింది. సర్టిఫికేట్ ఇంగ్లీష్ లో ఉండాలి.
ఇక ఈ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో భాగంగా దరఖాస్తుదారుడు ఫింగర ప్రింట్ వేయాల్సి ఉంటుంది. ఇది స్థానిక విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో ఈ సరిఫికేషన్ విధానం మారే అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో జాప్యాలను నివారించడానికి ప్రయాణికులు సంబంధిత పాస్ పోర్ట్ కార్యాలయంలో అవసరాలకు అనుగుణంగా సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త నింబంధనలు ఇండియాలో ఉన్న పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులు ఈ రూల్స్ పరిధిలోకి రారు.
దేశంలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీసుల నుంచి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అవకాశం ఉంది.
⦿ పాస్ పోర్ట్ సేవా పోర్టల్ (passportindia.gov.in)లో నమోదు చేసుకోవడానికి ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ కావాలి.
⦿ PCC దరఖాస్తు ఫారమ్ ను ఆన్‌లైన్ లో ఫిల్ చేయాలి. నివాస స్థలానికి సంబంధించిన ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఎంచుకోవాలి.
⦿ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఫీజును చెల్లించాలి.
⦿ సమీపంలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రం (PSK), పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం (POPSK)లో అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలి.
⦿ పాస్ పోర్ట్, దరఖాస్తు రసీదు, అడ్రస్ ప్రూఫ్ లాంటి పత్రాలతో PSK/POPSKని వ్యక్తిగతంగా వెళ్లాలి. కొన్నిసార్లు బయోమెట్రిక్ ధృవీకరణ, వేలిముద్రలు అవసరం కావచ్చు.
⦿ స్థానిక పోలీసు అధికారుల నుంచి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. నివేదిక అందిన తర్వాత పాస్ పోర్ట్ కార్యాలయం క్లియరెన్స్ ను ప్రాసెస్ చేస్తుంది.
⦿ ఆ తర్వాత PCCని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు సాధారణంగా పాస్ పోర్ట్ సేవా పోర్టల్ ద్వారా సర్టిఫికేట్ ను యాక్సెస్ చేయవచ్చు.
న్యూజిలాండ్ పోలీసు క్లియరెన్స్ కోసం కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టడంతో, భారతీయ ప్రయాణీకులు తమ వీసా దరఖాస్తులను గతంలో కంటే మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.